BigTV English

Who is Gukesh Dommaraju: చరిత్ర సృష్టించాడు.. అతి చిన్న వయసులోనే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ విన్నర్ గా గుకేశ్

Who is Gukesh Dommaraju: చరిత్ర సృష్టించాడు.. అతి చిన్న వయసులోనే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ విన్నర్ గా గుకేశ్

Who is Candidates Chess Tournament Winner Gukesh: చెస్ సామ్రాజ్యంలో గుకేశ్ దొమ్మరాజు చరిత్ర సృష్టించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అతి చిన్న వయసులో టైటిల్ అందుకున్న ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. 17 ఏళ్ల వయసులోనే గుకేశ్ టైటిల్ నెగ్గడంతో.. భారత చెస్ ప్లేయర్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తం 14 రౌండ్లు జరగగా.. 14వ రౌండ్ లో అమెరికాకు చెందిన గ్రాండ్ మాస్టర్ హికారు నకమురాతో బ్లాక్ పీస్ లో డ్రా చేసుకున్నాడు.


అలాగే గ్రాండ్ మాస్టర్లు ఫాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచ్చి మధ్య ఉత్కంఠభరితంగా గేమ్ జరగగా.. అది కూడా డ్రా గా ముగిసింది. చివరికి టైటిల్ యువ ప్లేయరైన గుకేశ్ సొంతమైంది. గుకేశ్ టైటిల్ అందుకునే సమయంలో.. గ్రేట్ హాల్ లో ఉన్న ప్రేక్షకులు అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ టైటిల్ విన్నర్ గా నిలిచిన.. గుకేశ్ ఈ ఏడాది చివరిలో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ కు సిద్ధమవుతున్నాడు. కాగా.. మాగ్నస్ కార్ల్ సెన్, గ్యారీ కాస్పరోవ్ లు ప్రపంచ ఛాంపియన్ లుగా నిలిచినపుడు వారి వయసు 22 సంవత్సరాలు.

Also Read: గ్రీన్ జెర్సీలో బెంగళూరు.. గెలుపోటముల వివరాలివే..


విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన 2వ భారతీయుడిగా గుకేశ్ నిలిచాడు. గుకేశ్ గురువు, లెజెండరీ చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్.. గుకేశ్ కు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతా గుకేశ్ ఎలా ఆడాడో.. విశ్వనాథన్ ఆనంద్ పేర్కొన్నాడు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×