BigTV English

Ys Sharmila Vs CM Jagan on Assets: జగన్‌పై ఆగ్రహం.. ఇంకెన్నాళ్లు.. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే..!

Ys Sharmila Vs CM Jagan on Assets: జగన్‌పై ఆగ్రహం.. ఇంకెన్నాళ్లు.. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే..!

Ys Sharmila Vs CM Jagan on Assets: ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ముఖ్యంగా సీఎం జగన్, ఆయన చెల్లెలు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం ముదిరి తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న ఆస్తుల వ్యవహారం కూడా బయటకువచ్చింది. ఇదే విషయాన్ని వైఎస్ షర్మిల ప్రస్తావించి తన అన్న, సీఎ జగన్ వ్యవహారశైలిని బట్టబయలు చేశారు.


కర్నూలు జిల్లా జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్‌లో మనీ మేటర్ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు ఆమె. ఏ అన్న అయినా చెల్లెలికి ఆస్తిలో వాటా ఇవ్వాలని, ఆది మహిళ హక్కుగా వర్ణించారు. ఆస్తి ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంటుందన్నారు. ఆ ధర్మాన్ని సహజంగా అందరూ పాటిస్తుంటారు. కొందరు చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమదిగా భావిస్తున్నారన్నారు. కొందరు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేవాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. చెల్లెలికి ఆస్తిలో వాటా ఇవ్వకపోగా కొసరు ఇచ్చి, దాన్నిఅప్పుగా ఇచ్చినట్టు చూపించేవాళ్లు సమాజంలో ఉన్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ వాస్తవమని, ఈ విషయం దేవుడికి తెలుసని పరోక్షంగా తన అన్న జగన్‌పై కామెంట్స్ చేశారు.

అసలేం జరిగింది..?


ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్, ఆమె చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించిన 82 కోట్ల రూపాయలపై రచ్చ కొనసాగుతోంది. వైఎస్ఆర్ మరణం తర్వాత తన ఆస్తి ఇవ్వాలని వైఎస్ షర్మిల పలుమార్లు అన్న జగన్ వద్ద ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి జగన్ ససేమిరా అనడంతో అన్నాచెల్లెలు మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ వ్యవహారంపై ఆ మధ్య ఓ వ్యక్తి రాయబారం నడిపినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడిచింది. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.

ALSO READ:  ఏపీ పదో తరగతి ఫలితాలు నేడే.. మీ ఫోన్ నంబర్ కే రిజల్ట్స్.. ఇలా చేయండి

ఎన్నికల అఫిడవిట్ పుణ్యమానికి మళ్లీ అన్న-చెల్లెలు మధ్య ఆస్తి వ్యవహారంపై చర్చ సాగుతోంది. తండ్రి సంపాదనలో తన వాటా ఇవ్వాల్సిందేనని వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టారు. ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

Pulivendula Victory: జగన్‌కు మరిన్ని షాకులు.. పులివెందుల విక్టరీపై సీఎం చంద్రబాబు రియాక్షన్

AP Free Bus Scheme: రేపటి నుంచి ఏపీ మహిళలకు ఫ్రీ బస్సు.. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

Pulivendula: పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలు.. లతా రెడ్డి ఘన విజయం, డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. డేంజర్‌లో విజయవాడ

AI In Tirumala: ఆగమ శాస్త్రానికి విరుద్ధం.? కొండపై AI తో లాభమా.? నష్టమా.?

AP Politics: కాంగ్రెస్ నుంచి జగన్‌కు సంకేతాలు.. షర్మిలతో చేయి కలుపుతారా? ఏపీలో హాట్‌గా చర్చ

Big Stories

×