BigTV English

NASA Warning: 100 అంతస్తుల సైజు.. 1,000 అణుబాంబుల శక్తి.. భూమిపైకి దూసుకొస్తున్న ముప్పు..!

NASA Warning: 100 అంతస్తుల సైజు.. 1,000 అణుబాంబుల శక్తి.. భూమిపైకి దూసుకొస్తున్న ముప్పు..!

NASA Warning: భూమికి అత్యంత దగ్గరగా.. అంటే భూమికి చంద్రుడికి మధ్య దూరం కంటే దాదాపు 17 రెట్లు దగ్గరగా.. ఒక గ్రహశకలం దూసుకొస్తోంది. అదలా రావడం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఇదిగానీ ఢీ కొడితే.. వెయ్యి అణు విస్ఫోటనాలు జరుగుతాయని మీరు ఊహించగలరా? ప్రపంచ మంతా ఒక్కసారి చల్లగా మారిపోయి.. సూర్యుడి ఉనికే లేకుండా మనమంతా గజగజలాడిపోతామని కనీసం గెస్ చేయగలరా? అదేంటో దాని పరిమాణమేంటో..


భూమికి దగ్గరగా వెయ్యి అణుబాంబులంత గ్రహశకలం

అది పడ్డ చోట మొదట ఒక పొగ గొడుగు ఏర్పడుతుంది.. తర్వాత దాని ప్రభావం.. ఆ ప్రాంతమంతా విస్తరిస్తుంది. ఆ తీరం వెంబడి ఒక నగరంగానీ ఉంటే.. ఏకంగా ఆ నగరమంతా కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. అంతగా ఆ ఆస్ట్రాయిడ్ తన ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం ఈ భూమికి దగ్గరగా ఒక గ్రహశకలం వస్తోంది. దీని పరిమాణం, ప్రభావం విలువ ఎలాంటిదంటే ఏకంగా వెయ్యి అణుబాంబులంత. ఒకటి రెండు అణుబాంబులు పడితేనే హిరోషిమా, నాగసాకీ వంటి పట్టణాలు కొన్నేళ్ల పాటు కోలుకోలేదు. అలాంటిది వెయ్యి అణుబాంబులు ఒక్కసారిగా ఈ భూమ్మీద పడితే.. ఊహించడానికే భయమేసేలాంటి పరిస్థితి.


నాసా- సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ అంచనా

ప్రస్తుతానికైతే అలాంటి ప్రమాదం ఏదీ లేదు కానీ.. భూమికి అత్యంత దగ్గరగా ప్రమాదకర పరిస్థితుల్లో ఒక గ్రహశకలం వెళ్తున్నట్టు చెబుతోంది.. నాసాకి చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ సంస్థ. క్లుప్తంగా చెప్పాలంటే భూమి నుంచి సుమారు ఏడు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహశకలం దాటనుందని అంటున్నారు. ఇది భూమి- చంద్రుని మధ్య దూరానికి 17 రెట్లు దగ్గరగా ఉంటుందట.

2003 MH 4 సంభావ్యత గల ప్రమాదకర శకలం

ఈ గ్రహశకలం 2003 MH 4 సంభావ్యత గల అత్యంత ప్రమాదకరమైనదిగా తెలుస్తోంది. సుమారు 335 మీటర్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలం మూడు ఫుడ్ బాల్ మైదానాల పొడవు ఉంటుంది. ఇది మే 24, 2025న భూమికి దగ్గరగా వచ్చింది. సెకనుకు 14 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకెళ్తున్న ఈ గ్రహశకలం పరిణామం, వేగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రస్తుతానికి మనకెలాంటి భయం లేదు కానీ..

ప్రస్తుతానికైతే మనకెలాంటి ముప్పు లేదు. కానీ ఈ సామీప్యాన్ని అతి ముఖ్యమైనదిగా భావిస్తోంది మన శాస్త్ర లోకం. ఈ పరిమాణంలో ఉన్న వస్తువు.. ఢీకొట్టే ప్రమాదం లేకపోయినా సరే.. దాన్ని పర్యవేక్షించడం మాత్రం అత్యవసరంగా భావిస్తున్నారు సైంటిస్టులు.

అపోలో గ్రహశకలాలకు చెందిన- 2003 MH4

నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్, గ్రహరక్షణ బృందాలు 2003 MH4 ని సునిశితంగా ట్రాక్ చేస్తున్నాయి. ఈ గ్రహశకలం భూమి నుంచి దగ్గరగా వెళ్లడం వల్ల జరిగే పరిణామ క్రమాలు ఎలాంటివన్న రీసెర్చ్ జరుగుతోంది. ఈ గ్రహశకలం పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్టరాయిడ్ గా వర్గీకరించారు. ఇది భూమి పరిధిలోకి వచ్చే 150 మీటర్ల కంటే ఎన్నో అంతరిక్ష వస్తువులకన్నా భిన్నమైనదని గుర్తించారు.

ఈ గ్రహశకలం భూమిని ఢీ కొడితే..

గ్రహశకలాలు ఢీకొట్టకున్నా.. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలి. ఎందుకంటే గ్రహాల గురుత్వాకర్షణ శక్తి, సౌర వికీరణం నుంచి వచ్చే మైక్రో యార్కోవ్స్కీ ప్రభావం వల్ల అవి ఒక్కోసారి చిన్నపాటి మార్పులతోనూ.. తమ గమనాన్ని మార్చుకోగలవు. దీంతో ఈ శకలం గమనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిందేనంటారు పరిశోధకులు. ఈ గ్రహశకలం సాంధ్రత, అది ఉన్న స్థితిగతులు, దీని లక్షణాలు కూడా నిశిత పరిశీలనలో ఉన్నాయి. ఎందుకంటే ఈ లక్షణాలే దాని కక్ష్య పరివర్తన, సంభావ్యతలను శాసిస్తాయి.

ఇది భూమిని దాటే కక్ష్యలతో రిలేట్ అయి ఉంటుంది

2003 MH4 అపోలో గ్రహశకలాలకు చెందినది. ఇది భూమిని దాటే కక్ష్యలతో రిలేట్ అయి ఉంటుంది. ఇలాంటివి కొన్ని సార్లు.. మన గ్రహానికి దగ్గరగా తీసుకు రాగలవు. వీటి ప్రభావం చాలా తక్కువైనప్పటికీ.. ప్లైబై గ్రహ రక్షణ చొరవ కారణంగా.. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదంటారు పరిశోధకులు.

విపరీతమైన మంటలు, సునామీలు

ఈ పరిమాణంలో ఉన్న ఒక ఉల్క.. నేరుగా భూమిని ఢీ కొడితే అది వేల అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేస్తుంది. దీంతో విపరీతమైన మంటలు, సునామీలకు కారణం కావచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఒకరకమైన శీతల వాతావరణం ఏర్పడే ప్రమాదముంది.

గ్రహశకలాలతో ఈ భూమిపై విలయం జరుగుతుందా?

గ్రహశకలాలతో ఈ భూమిపై విలయం జరుగుతుందా? అవి వచ్చి ఢీ కొట్టగానే విధ్వంసమవుతుందా? ఈ భూమి అతలాకుతలమై మనమంతా ప్రాణాలు కోల్పోతామా? అన్న భయాలు డైనోసార్ల కాలం నాటివి. ఆ మాటకొస్తే.. డైనోసార్లను అంతం చేసిందే ఈ గ్రహశకలాలని అంటారు నిజమేనా? ఏంటీ గ్రహశకలాల గొడవ? దీన్ని మనమెలా అర్ధం చేసుకోవాలి? అని చూస్తే.. ఆ టైంలో మలమలమాడిన చెట్లు మొక్కలుప్రస్తుతం.. గ్రహశకలాలకు సంబంధించి మన శాస్త్రవేత్తలు.. అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అందుకోసం నాసా ప్రత్యేక బృందాలను నియమించి సెకన్ టు సెకన్ లైవ్ అప్ డేట్ ఇస్తోంది.

సౌర వ్యవస్థలో మిగిలిన శిల, లోహ పదార్ధాలు

ఇంతకీ ఏంటీ గ్రహశకలాలు అంటే? సౌర వ్యవస్థలో మిగిలిపోయిన శిల, లేదా లోహపదార్ధాలు. వీటినే ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇవి సాధారణంగా మార్స్, జుపిటర్ అంటే అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ప్రాంతంలో ఉంటాయి.

చిన్న గ్రహాలు, ఖగోళ వస్తువులని కూడా పిలుస్తారు

వీటిని చిన్న గ్రహాలు లేదా చిన్న చిన్న ఖగోళ వస్తువులని కూడా అంటారు. ఇవి దాదాపు 4. 6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినపుడు మిగిలిపోయిన శిలా, లోహ అవశేషాలు. మనం ముందే అనుకున్నట్టుగా ఈ శకలాలు అంగారక- బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఒక కక్ష్యలో తిరుగుతాయి.

గింజ పరిమాణం నుంచి వెస్టా వంటి గ్రహశకలాల వరకూ

ఈ గ్రహశకలాలు చిన్న గింజ పరిమాణం నుంచి వెస్టా వంటి అతిపెద్ద గ్రహశకలాల వరకూ ఉంటాయి. ఈ గ్రహశకలాలు అధికంగా శిల లేదా లోహ పదార్ధాలతో ఉంటాయి. కొన్నయితే గాలిలేని మట్టితో కూడి ఉంటాయి.

దిశ మళ్లించే అవకాశాలనూ పరిశీలించే సైంటిస్టులు

నాసాకు చెందిన సైంటిస్టులు గ్రహశకలాల గురించి అధ్యయనం చేస్తూనే ఉంటారు. కొందరు ఈ భూమికి దగ్గరగా మసిలే గ్రహశకలాల గురించి ఎప్పంటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఒక వేళ అవి భూమి మీదకు వస్తున్నట్టయితే దాని దిశ మళ్లించే అవకాశాలను కూడా పరిశీలిస్తారు. వీటి గమనాన్ని మళ్లించడానికి చిన్న చిన్న కదలికలు సైతం సరిపోతాయి.

2024 YR4- గ్రహశకలం భూమిని ఢీకొట్టొచ్చన్న అలజడి

అయితే ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎన్నిసార్లు ఈ ఆస్టరాయిడ్స్ ఎన్నిసార్లు ఢీకొట్టాయి. అందుకు మన దగ్గరున్న ఆధారాలేంటని చూస్తే.. 2024లో, 2024 YR4 అనే ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది 2032లో భూమికి దగ్గరగా వస్తుందని, ఢీకొట్టే అవకాశం చాలా తక్కువనీ అన్నారు. ఇది భూమిని ఢీ కొట్టే ఛాన్స్ కేవలం.. 0.28% మాత్రమే ఉందని అన్నారు. ప్రస్తుత గ్రహశకలం ఏడు మిలియన్ కిలోమీటర్ల దూరంలోనిదైతే.. అదే ఈ గ్రహశకలం.. కేవలం ఒకటిన్నర మిలియన్ కిలోమీటర్లు మాత్రమే కావడంతో ఇదో టెన్షన్ నడిచింది. ఇది 40 నుంచి 90 మీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు.

డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం ఇదే?

ఇక డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం ఎక్కడ పడిందని చూస్తే.. సుమారు 6. 6 కోట్ల సంవత్సరాల క్రితం.. ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టిందని అంటారు శాస్త్రవేత్తలు.. అదే డైనోసార్ల అంతు చూసిందని చెబుతారు. దీంతో పాటు మరో చిన్న గ్రహశకలం కూడా భూమిని ఢీ కొట్టిందని అంటారు సైంటిస్టులు ఈ అంతరిక్ష శిల.. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని సముద్రంలో పడ్డంతో పెద్ద బిలం ఏర్పడిందని గుర్తించారు. దీని వల్ల అప్పట్లో అట్లాంటిక్ మహా సముద్రంలో 800 మీటర్ల ఎత్తులో సునామీ ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే నాదిర్ బిలం ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు.

2022లో కనుగొన్న నాదిర్ బిలం

2022లో తొలిసారి నాదిర్ బిలాన్ని కనుగొన్నారు. ఇది ఎలా ఏర్పడిందనే అంశంపై అప్పటి వరకూ ఒక అనిశ్చితి ఉండేది. అయితే గ్రహశకలం సముద్ర గర్భాన్ని ఢీ కొట్టడం వల్లే 9 కిలోమీటర్ల మేర ఆ బిలం ఏర్పడిందని వారు ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే ఈ గ్రహశకలం సముద్ర గర్భాన్ని ఎప్పుడు ఢీ కొట్టిందనే ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేక పోతున్నారు.

మెక్సికోలో 180 కి. మీ విస్తీర్ణంలో చిక్సులబ్ బిలం

మెక్సికోలో 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిక్సులబ్ బిలం ఏర్పడ్డానికి కూడా ఒక గ్రహశకలం ఢీ కొట్టడమే కారణమని అంటారు. అయితే నాదిర్ బిలం ఏర్పడ్డానికి కారణమైన గ్రహశకలం, చిక్సులబ్ బిలం ఏర్పడ్డానికి ముందు ఢీ కొట్టిందా? తర్వాత అనే ప్రశ్నకూ సమాధానం దొరకడం లేదు. చిక్సులబ్ బిలం ఏర్పడ్డానికి గల కారణమైన గ్రహశకలంతో డైనోసార్లు అంతమై పోయాయంటారు శాస్త్రవేత్తలు.

డైనోసార్లను అంతం చేసింది- సైంటిస్టులు

డైనోసార్లు అంతరించిపోయిన టైంలోనే ఈ చిన్న గ్రహశకలం భూమిని తాకిందని వారు చెబుతున్నారు. ఈ శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినపుడు అది ఒక ఫైర్ బాల్ లా మారి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫర్ సపోస్.. గ్రహశకలం గ్లాస్గోను తాకినట్టు ఆ టైంలో మీరున్న చోట నుంచి చూస్తే అది 24 రెట్ల పెద్దదైన సూర్యగోళం మీ మీదకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అంతే కాదు.. చెట్లు మొక్కలను మాడ్చేస్తుందని అంటారు శాస్త్రవేత్తలు. అలా భారీ శబ్ధంతో గ్రహశకలం సముద్ర గర్భాన్ని తాకడంతో భూకంపం వచ్చి ఉంటుంది. సముద్రంలోంచి పెద్ద మొత్తంలో నీరు బయటకొచ్చి.. తిరిగి అదే ప్రాంతానికి చేరి.. అక్కడ ప్రత్యేకమైన గుర్తులు ఏర్పడి ఉండొచ్చు. ఇంత పెద్ద గ్రహశకలాలు భూమిని ఢీ కొట్టి ఉంటాయనడం మనం కనీసం ఊహించలేం. కానీ ఈ రెండూ వెంట వెంటనే భూమిని ఎందుకు ఢీకొట్టాయో మన సైంటిస్టులు ఇప్పటికీ చెప్పలేక పోతున్నారు.

ఆ టైంలో మలమలమాడిన చెట్లు మొక్కలు

ప్రస్తుతం భూమికి దగ్గరగా వెళ్తున్న గ్రహశకలం లాంటివెన్నో ఇలా భూమిని క్రాస్ చేస్తూనే ఉంటాయి. వాటి గమనాన్ని మన వాళ్లు గత కొన్నేళ్లుగా సునిశిత పరిశీలన చేస్తూనే ఉన్నారు. కొన్నొ సార్లు ఈ గ్రహశకలాలు ఎక్కడ భూమిని ఢీ కొడతాయో అన్న భయంతో జనం భయపడుతూనే ఉంటారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×