Hibiscus Toner For Skin: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ ఎండ, దుమ్ము కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ముఖానికి రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడటానికి బదులుగా నేచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం మంచిది. హోం రెమెడీస్ వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇదిలా ఉంటే చాలా మంది ఇళ్లలో పెంచుకునే మందార మొక్క కూడా జుట్టు, ముఖానికి మేలు చేస్తుంది.
మందార పువ్వు చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు,విటమిన్ సి ఉంటాయి. ఇది పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ముఖానికి హైబిస్కస్ టోనర్‌ను అప్లై చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మందార పువ్వులతో తయారు చేసిన మందార ఫేస్ టోనర్ ముఖం కోల్పోయిన మెరుపును పునరుద్ధరించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.ఈ టోనర్ తయారు చేసే పద్ధతి, వాడే విధానం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి మందార టోనర్ ప్రయోజనాలు:
1. మందారంలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ సి , ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో, చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఇది చర్మపు రంగు సమస్యను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. దీని వాడకం టానింగ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే పదార్థాలు చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. తద్వారా చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మృత చర్మ కణాలు, మలినాలను తొలగిస్తాయి. ఫలితంగా ముఖం తెల్లగా మెరిసిపోతుంది.
2.మందార చర్మాన్ని తేమగా ఉంచడం ద్వారా pH స్థాయిని సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది చర్మం చికాకు, వేడి వల్ల కలిగే దద్దుర్లు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మందార పువ్వు చర్మంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నిజానికి.. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచుతుంది. దీని కారణంగా ముడతలు, గీతలు తగ్గుతాయి.
3.చర్మంపై ఉండే మొటిమలు తగ్గడంలో కూడా మందార చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని పోషకాలు చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. అందుకే మందార తరచుగా ముఖానికి వాడటం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. తలమోయలేనంత జుట్టు
మందార పువ్వు నుండి టోనర్ ఎలా తయారు చేయాలి ?
ముందుగా 5-6 తాజా మందార పువ్వులు తీసుకోండి
ఇప్పుడు ఒక పాన్ లో నీళ్ళు మరిగించి, దానికి మందార పువ్వులు వేసి మరికొన్ని నిమిషాలు వేడి చేయాలి.
దీని తరువాత.. గ్యాస్ ఆపివేసి, దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలపండి.
ఈ నీటిని చల్లారనిచ్చి స్ప్రే బాటిల్‌లో నింపండి.
మందార టోనర్ ఎలా ఉపయోగించాలి ?
మీ ముఖం, మెడపై దూది సహాయంతో మందార టోనర్‌ను అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. టోనర్ చర్మంలోకి ఇంకిన తర్వాత, మాయిశ్చరైజర్‌ను అప్లై చేసి.. ఆ తర్వాత సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. మీరు దీనిని ఉదయం, సాయంత్రం రెండు సార్లు అప్లై చేయవచ్చు.