BigTV English
Advertisement

Race to Top 2 : RCB కి బంపర్ ఆఫర్.. ప్లే ఆఫ్స్ లో ఇలా జరిగితే కప్ గ్యారంటీ

Race to Top 2 : RCB కి బంపర్ ఆఫర్.. ప్లే ఆఫ్స్ లో ఇలా జరిగితే కప్ గ్యారంటీ

Race to Top 2 : ఐపీఎల్ 2025 సీజన్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. అయితే ఇవి ప్లే ఆప్స్ కి చేరినప్పటికీ.. టాప్ 1, 2, 3, 4 జట్లు ఏవి అనేవి మాత్రం ఇంకా క్లారిటీ లేదు. టాప్ 1 లేదా 2 కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. టాప్ 2లో ఉన్న జట్టు ఓడిపోయినప్పటికీ ఎలిమినేటర్ లో విజయం సాధించిన జట్టుతో మరోసారి క్వాలిఫ్లయిర్ 2 ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ టాప్ ప్లేస్ లో ఉండేందుకు ఆయా జట్లు పోటీ పడుతున్నాయి.


Also Read : Natarajan : ఒక్కో బాల్ కు 60 లక్షలు.. నటరాజన్ క్రేజ్ మామూలుగా లేదు

అయితే ప్లే ఆప్స్ కి చేరుకున్న జట్లు ముచ్చటగా మూడు ఇప్పటికే ఓటమిపాలయ్యాయి. తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్ తో.. రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఓడిపోవడంతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది. ముంబై జట్టు.. పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో కనుక గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే పరిస్థితి మరోలా ఉంటుంది. ముఖ్యంగా నిన్న పంజాబ్ జట్టు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికనే తలకిందులు అయినంత పని చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి అడ్వాంటేజ్ గా మారనుంది. గుజరాత్ టైటాన్స్ 18, పంజాబ్ 17, ఆర్సీబీ 17, ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ఉంది. అయితే ఈ నాలుగు టీమ్ లకు ఒక్కొక్క మ్యాచ్ మిగిలి ఉంది.


ఆర్సీబీ కే అధిక ఛాన్స్.. 

అయితే గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ విజయం సాధిస్తే.. 20 పాయింట్లకు చేరుకుంటుంది. అఫిషీయల్ గా టాప్ లో క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఓడిపోతే పరిస్థితి మరోలా ఉంటుంది. 90 శాతం గుజరాత్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక తరువాత మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్టు ఆడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. ఒకవేళ పంజాబ్ గెలిస్తే పంజాబ్ టాప్ 2లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఆర్సీబీ విజయం సాధిస్తే.. పంజాబ్, ఆర్సీబీ లలో ఎవరి రన్ రేట్ బాగుంటే వాళ్లు టాప్ 2లోకి వెళ్తారు. ఒకవేళ పంజాబ్ ముంబై పై ఓడిపోతే.. మాత్రం.. ఆర్సీబీ విజయం కోసం ఎదురుచూడాలి. ఆర్సీబీ విజయం సాధిస్తే.. మాత్రం నేరుగా టాప్ 2లోకి వెళ్తుంది. చివరి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ ఆడబోతుంది. అయితే ఎన్ని ఓవర్లలో గెలవాలనేది తెలుస్తుంది కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ముంబై జట్టు ఇతర జట్ల పై ఆధారపడాలి. కానీ ఆర్సీబీ చూసుకొని సత్తా చాటితే ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రారంభం నుంచి ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.

?igsh=cTZ5OXZhb2NweGls

Tags

Related News

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Big Stories

×