BigTV English

Hamas Attack: హత్తుకుని.. మృత్యువును స్వాగతించి.. విషాద గాథలెన్నో..!

Hamas Attack: హత్తుకుని.. మృత్యువును స్వాగతించి.. విషాద గాథలెన్నో..!

Hamas Attack: సరిహద్దుల్లోని ఇజ్రాయెలీ పట్టణాల్లో హమాస్ సాగించిన నరమేధం తాలూకు విషాద గాథలు క్రమేపీ వెలుగులోకి వస్తున్నాయి. గాజా సరిహద్దుల్లోని ఫార్ ఆజాలో కట్జ్ కుటుంబం అనుబంధాలకు పుట్టిల్లు. అవీవ్ కట్జ్(54), లివ్నాట్(49) దంపతులు, వారి సంతానం రోటెమ్(19), యోనటన్(17), ఇఫ్టాక్(17)లను చూసిన వారు ఎంతో ముగ్ధులవుతారు.


వారి మధ్య ఆప్యాయతలను చూసి అసూయపడ్డవారూ లేకపోలేదు. ఆ ఐదుగురి మధ్య అనుబంధం ఎంత దృఢమైనదో అక్టోబర్ 7నే అందరికీ తెలిసింది. మృత్యువు తలుపు తట్టినా.. వారు ఒకరి‌నొకరు వీడలేదు. గాఢంగా హత్తుకుని.. కలసికట్టుగానే మృత్యు ఒడిలోకి చేరారు. హమాస్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి.. ఇంట్లోకి దూసుకొచ్చినప్పుడు కట్జ్ కుటుంబం మొత్తం అక్కడే ఉంది.

టెర్రరిస్టులను చూడగానే వారు ఒకరినొకరు గాఢంగా హత్తుకున్నారు. ఆ మరుక్షణమే మిలిటెంట్ల తూటాలు వారి శరీరాన్ని జల్లెడలా మార్చేశాయి. బెడ్రూంలో వారందరూ అలా హత్తుకునే కుప్పకూలిపోయారు. గది అంతా రక్తసిక్తమైంది. వాస్తవానికి ఆ ఘటన జరిగిన రోజే తాను కట్జ్ కుటుంబాన్ని కలవాల్సి ఉందని బంధువైన అడీ లెవీ సలామా తెలిపారు.


అంతకు కొద్ది రోజుల క్రితం సరిహద్దుల్లోని ముళ్ల కంచె వద్ద పతంగుల పండుగను అవీవ్ కట్జ్ నిర్వహించాడని ఆమె వివరించారు. అందరూ ప్రశాంత జీవనం గడపాలనే ఆకాంక్షతో.. ఆ సందేశాన్ని గాజన్లకు ఇచ్చేందుకు ఆ వేడుకను నిర్వహించారని సలామా చెప్పుకొచ్చింది. ఓ కన్సల్టింగ్ కంపెనీకి అవీవ్ డిప్యూటీ డైరెక్టర్. వ్యవసాయం కూడా చేస్తుంటాడు. లివ్నాట్ గ్రాఫిక్ డిజైనర్. 1973లో యామ్ కొప్పూర్ వార్ సమయంలో ఆమె జన్మించింది.

రోటెమ్ ఐడీఎఫ్ సోల్జర్. కొత్తగా సైన్యంలో చేరేవారికి శిక్షణ ఇవ్వడం ఆమె పని. ఇద్దరు కొడుకులు యోనటన్, ఇఫ్టాక్ టెల్ అవీవ్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్నారు. ఇద్దరూ బాస్కెట్ బాల్ ప్లేయర్లేనని బంధువు సలామా వివరించారు. ప్రేమను పంచే ఆ కుటుంబం మొత్తం దూరం కావడం తీరని విషాదమని ఆమె గద్గదస్వరంతో తెలిపింది.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×