E-Paper
Advertisement

TPCC Chief Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఆమెకే.. రేవంత్ హామీ

TPCC Chief Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఆమెకే.. రేవంత్ హామీ
Advertisement

TPCC Chief Revanth Reddy : డిగ్రీలకు డిగ్రీలు చదివి ఉద్యోగాలు దొరకక యువతలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ కొలువు కాదు కదా.. చిన్నదో, పెద్దదో.. ప్రైవేట్ ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి. ఐటీ సంస్థల్లో ఉద్యోగాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త ఉద్యోగాల సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతం అక్కడ పనిచేసే వారికి కూడా ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వ కొలువుల విషయానికొస్తే.. గ్రూప్-1 నుంచి గ్రూప్ -4 వరకూ ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉన్నా పరీక్షలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కేసులోనూ.. గ్రూప్ పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. ఉద్యోగాలు రాక యువత మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ధీటుగా స్పందించాయి. ఈ నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ యువతికి ఉద్యోగ హామీ ఇచ్చారు.

ఉద్యోగంపై ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని, ప్రైవేట్‌ సంస్థలు కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని.. నాంపల్లికి చెందిన రజిని అనే యువతి రేవంత్‌ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్‌ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజిని పేరుతో స్వయంగా నింపారు. డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ఖర్గే వస్తారని.. అదే రోజు రజినికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని రేవంత్‌ హామీ ఇచ్చారు. ఇది తన గ్యారెంటీ అని రజినికి చెప్పారు రేవంత్‌రెడ్డి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×