BigTV English
Advertisement

Rohit Sharma :హిట్ మ్యాన్ మజిల్ పవర్.. అంపైర్ షాక్..

Rohit Sharma :హిట్ మ్యాన్ మజిల్ పవర్.. అంపైర్ షాక్..
Rohit Sharma

Rohit Sharma : వరల్డ్ కప్ లో జరుగుతున్న మ్యాచ్ ల్లో మెరుపులు లేకపోయినా ఆటలో చమక్కులకు మాత్రం కొదవలేదన్నట్టుగా ఉంది. ఇండియా పాక్ మ్యాచ్ లో పలు వింతలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి రోహిత్ శర్మ పాక్ బౌలింగ్ ని చీల్చి చెండాడాడు. స్టార్ పేసర్లు షాహీన్ షా ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ లను ఒక ఆట ఆడుకున్నాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.


అది 15వ ఓవర్.. హ్యారీస్ రవూఫ్ 141.1 కిమీ వేగంతో వేసిన బాల్ ని, రోహిత్  తన ట్రేడ్ మార్క్ అయిన ఫుల్ షాట్ ఆడాడు. అది అంతకన్నా వేగంగా గాలిల్లోకి దూసుకుపోయి, ఎక్కడో స్టాండ్ అవతల పడింది. అది చూసిన ఫీల్డ్ అంపైర్ సౌత్ ఆఫ్రికా కి చెందిన ఎరాస్మస్ షాక్ అయ్యాడు. వెంటనే రోహిత్ దగ్గరకు వచ్చి అంత సింపుల్ గా ఎలా కొట్టావ్? నీ బ్యాట్ లో ఏదో పవర్ ఉంది అన్నాడు. దానికి రోహిత్ నవ్వుతూ బ్యాట్ లో కాదు, నా మజిల్ పవర్ అంటూ సరదాగా చూపించాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది.

మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ తో మాట్లాడిన రోహిత్ ఇదే విషయమై స్పందించాడు. అంత ఈజీగా సిక్సర్లు ఎలా కొడుతున్నావని అంపైర్ నన్ను అడిగాడు. అది బ్యాట్ పవర్ కాదు, నా పవర్ అని చెప్పా..అని నవ్వుతూ అన్నాడు.


అయితే ఇతర బ్యాట్స్ మెన్లు సిక్స్ కొట్టాలంటే చాలా కష్టపడతారు. తమ శక్తినంతా ఉపయోగించి ఆడతారు. కానీ రోహిత్ శర్మ అంత ఈజీగా కొట్టడానికి కారణం ఏమిటంటే..టైమింగ్.. అని చెబుతున్నారు. బాల్ ని కరెక్ట్ టైమింగ్ లో ఎటమ్ చేస్తే..చాలా సులువుగా సిక్స్ లు కొట్టవచ్చునని క్రీడా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆ షాట్ టైమింగ్ అనేది రోహిత్ శర్మ ప్రధాన అస్త్రాలలో ఒకటని కూడా చెబుతున్నారు.

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×