BigTV English

CM Revanth Reddy Vs KCR: గెట్ రెడీ @ తెలంగాణ బడ్జెట్.. ఈసారి అంతకు మించి

CM Revanth Reddy Vs KCR: గెట్ రెడీ @ తెలంగాణ బడ్జెట్.. ఈసారి అంతకు మించి

CM Revanth Reddy Vs KCR: యుద్ధానికి సిద్ధం. సభలో నువ్వా నేనా.. ఓవైపు అధికార కాంగ్రెస్, ఇంకోవైపు విపక్ష బీఆర్ఎస్. అసెంబ్లీ దద్దరిల్లాల్సిందే. అవును ఈ బడ్జెట్ సెషన్ ఎండలతో పాటే హీటెక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన టైమ్ చాలు అని కేసీఆర్ స్వయంగా సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంటే.. ఏదైనా సభకు వచ్చి మాట్లాడాలని సీఎం సవాల్ చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య హైడిబేట్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. ఏడాదిన్నర పాలన వర్సెస్ పదేళ్ల పాలన చుట్టూ హైవోల్టేజ్ పొలిటికల్ పంచ్ లు పేలబోతున్నాయి.


అసెంబ్లీలో హైవోల్టేజ్ వార్ కు అంతా రెడీ

రైట్.. ఈ బడ్జెట్ సెషన్ హైవోల్టేజ్ పొలిటికల్ డిబేట్ కు కేరాఫ్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సెషన్ 12 నుంచి 27 వరకు జరగనుండడం.. ఈసారి సభకు వస్తానంటూ కేసీఆర్ వరుసగా లీకులు ఇవ్వడంతో అసెంబ్లీలో ఎలాంటి వాతావరణం ఉండబోతోందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. గ్రౌండ్ క్లియర్ గా ఉంది. రెండువైపులా అస్త్రాలున్నాయ్. శస్త్రాలున్నాయ్. వాటిని ప్రయోగించడమే మిగిలింది. కౌంటర్ కు ఎన్ కౌంటర్.. మాటకు మాట, ఫేస్ టూ ఫేస్ ఇలా సభా సమరం గరంగరంగా సాగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.


గత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజే హాజరు

ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని లీడ్ చేయకుండా ఇన్నాళ్లూ సభకు దూరంగానే ఉండిపోయారు. ఎంత ముఖ్యమైన బిల్లులున్నా ఫాంహౌజ్ నుంచి కాలు బయటకు పెట్టలేదు. గతేడాది జులై 23న జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ మీడియాపాయింట్ దగ్గర మాట్లాడి వెళ్లిపోయారు. ఇక అంతే అటువైపు రాలేదు. కనీసం గత బడ్జెట్ చర్చల్లోనూ పాల్గొనలేదు. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై జరిగిన చర్చకు హాజరు కాలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపంగా డిసెంబర్ 30న నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కూ డుమ్మా కొట్టారు. ఇప్పుడు మాత్రం లేటెస్ట్ గా సభకు వస్తానంటూ గత కొన్ని రోజుల నుంచే లీకులు, సిగ్నల్స్ ఇస్తూ వస్తున్నారు. అంతకు ముందు ఫాంహౌజ్ లో జరిగిన ఓ మీటింగ్ లో తాను కొడితే మామూలుగా ఉండదంటూ మాట్లాడారు. దీనికి రేవంత్ కౌంటర్ కూడా ఇచ్చారు. సరిగా నిలబడితే చాలు అన్నారు.

కారు హారన్ మోగిస్తూ యుద్ధమే అని ప్రకటనలు

కేసీఆర్ అసెంబ్లీకి ఉన్నట్లుండి ఎందుకు రావాలని డిసైడ్ అయ్యారు? ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతే జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయనుకున్నారా.. లేదంటే అనర్హత వేటు పడుతుందని ఆలోచన చేశారా.. కారణమేదైనా కేసీఆర్ కారు హారన్ మోగించారు. ఇక యుద్ధమే అంటున్నారు. సభ దద్దరిల్లాల్సిందే అని లీకులిప్పిస్తున్నారు. సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటూ జరిగిన ప్రచారానికి ముందు చాలా జరిగాయి. అటు కేటీఆర్, ఇటు సీఎం రేవంత్ చిట్ చాట్ లో చెప్పిన విషయాలతోనే మ్యాటర్ హీటెక్కింది. ఇక అసెంబ్లీ సెషన్ మొదలయ్యాక ఎలా ఉండబోతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.

కేసీఆర్ చెల్లని రూపాయి అంటూ సీఎం ఫైర్

కేసీఆర్ అసెంబ్లీకి హాజరుపై కేటీఆర్ తన మనసులో మాటలు చెప్పుకొచ్చారు. గవర్నర్‌ ప్రసంగానికి కేసీఆర్ వస్తారని, బడ్జెట్‌ ప్రసంగంలోనూ పాల్గొంటారన్నారు. అయితే కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడమే మంచిదని ఒక కొడుకుగా, అభిమానిగా తన అభిప్రాయమన్నారు. కేసీఆర్‌ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరితూగరని కూడా మాట్లాడారు. వాళ్ల మాటలు, దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్‌ సభకు రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమన్నారు. అంటే ఈ లెక్కన తాము చేస్తే సద్విమర్శలు, ఇతరు చేస్తే కారు కూతలా అన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. గతంలో మాట్లాడిన మాటల సంగతేంటని గుర్తు చేస్తున్నారు.

అప్పుల రిపోర్ట్ ను అసెంబ్లీలో పెడుతామని కామెంట్

కేసీఆర్ స్థాయి కాంగ్రెస్ లో ఎవరికీ లేదన్న కేటీఆర్ కామెంట్లపై హస్తం నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ చెల్లని రూపాయి అని.. ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ స్థాయిపై కేటీఆర్ చేసిన కామెంట్లకు సీఎం కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదని సెటైర్లు వేశారు. జీతభత్యాలు తీసుకుని పని చేయని వ్యక్తి కేసీఆర్ అని సీఎం విమర్శించారు.

పదేళ్ల పాలనలో కేసీఆర్ వన్నీ అప్పులు, తప్పులే: రేవంత్

పదేళ్ల పాలనలో అప్పులు, తప్పులు తప్ప కేసీఆర్ ఇంకేమీ చేయలేదన్నారు. అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చూపారని, కేసీఆర్ చేసిన అప్పుల రిపోర్ట్ ను అసెంబ్లీలో బయటపెడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అసెంబ్లీకి కేసీఆర్ రావాలనే తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడే అవకాశం ఇస్తున్నామన్నారు. సో ఓవైపు కేసీఆర్ హాజరు చుట్టూ మ్యాటర్ వేడెక్కితే.. ఇష్యూ బేస్డ్ గా సభలో సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచే ఛాన్స్ కనిపిస్తోంది.

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిజంగానే హైవోల్టేజ్ డిబేట్ ఉంటుందా? అంటే కచ్చితంగా అవునన్న సమాధానమే వస్తోంది. తాజాగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌ జరిగింది. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చారు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు సర్కార్‌పై సంధించాల్సిన ప్రశ్నలు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీపై గైడ్ చేశారు. డైరెక్షన్ ఇవ్వడమే కాదు డైరెక్ట్ గా సభకు వస్తానన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా టైం ఇచ్చాం-కేసీఆర్

అంతే కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓపికగా ఎదురుచూశామని, కాంగ్రెస్‌ సర్కారు ఏమీ చేయకపోగా.. రైతులు, ప్రజలకు ఇబ్బంది కలిగించే అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోందని కేసీఆర్ కామెంట్ చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్‌ను తానే స్వయంగా ఎండగడుతానని నాయకులతో చెప్పారు కేసీఆర్. నిజానికి గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఉంటారు.

ఇటీవలే ఫాంహౌజ్ లో అత్యవసర మీటింగ్

అయితే సభకు వచ్చి అధికార పార్టీ వైఫల్యాలపై మాట్లాడాలంటే గతంలో తాము చేసినవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ బ్యాలెన్స్ ఎలా చేస్తారన్నది కీలకంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించుకున్నారు. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావదినోత్సవం, అలాగే బడ్జెట్ సమావేశాలపైనా చర్చించారు. ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ దీనికి అదనం.

జనం బ్రహ్మరథం పడుతారంటూ ఆశలు

బీఆర్‌ఎస్‌ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని 15 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి రుజువైందని, కాంగ్రెస్‌ గ్యారెంటీలను నమ్మి గెలిపించిన ప్రజలు.. ఇప్పుడు ఆ పార్టీ నిజస్వరూపం తెలుసుకున్నారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఇలా ఎన్నెన్నో కేసీఆర్ చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని, ఆ తర్వాత బీసీల పక్షాన పోరాడదామని పార్టీ నేతలతో గులాబీ బాస్ చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం, ఎస్‌ఎల్‌బీసీ, అప్పులు, నీటివాటాలపై హాట్ డిబేట్

ఇవే కాదు రైతు రుణమాఫీ, రైతు భరోసా, కులగణన, బీసీ రిజర్వేషన్‌.. ఎస్పీ వర్గీకరణ బిల్లు, కాళేశ్వరం, ఎస్‌ఎల్‌బీసీ, రాష్ట్ర అప్పులు.. ఇలా కీలక అంశాలపై సభలో హాట్ డిబేట్ జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఏపీతో నీటి పంపకాలపై సభలో కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అయితే నీటి వాటాలపై టిట్ ఫర్ ట్యాట్ కు అధికార పక్షం కూడా రెడీ అవుతోంది.

కేసీఆర్ ను ఫిక్స్ చేసేలా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్

అటు సభా సమరంపై కాంగ్రెస్ కూడా పకడ్బందీ ప్లాన్ తో ఉంది. కేసీఆర్ ఎప్పుడు సభకు వచ్చినా ఫిక్స్ చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది. గత పదేళ్లలో ఏం జరిగింది. ఎంత అప్పులు చేశారు. ఎంత భారం వేసి వెళ్లారు. దక్షిణ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల సంగతి.. కృష్ణా, గోదావరి నీటి వాటాలపై గతంలో వ్యవహరించిన తీరు, ఢిల్లీలో పెట్టిన సంతకాలపై సభలోనే ఆధారాలతో సహా నిలదీసేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ ఏ టాపిక్ మాట్లాడితే ఆ టాపిక్ పై టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా డీల్ చేసేలా కాంగ్రెస్ సై అంటోంది. ఎంతైనా చర్చిద్దాం.. దేనిపైనైనా చర్చిద్దాం అంటున్నారు. సభలోనే తేల్చుకుందామంటున్నారు.

టాపిక్ ఏదైనా కౌంటర్ ఇచ్చేలా వ్యూహం

నిజానికి కేసీఆర్ ఈసారి కూడా ఫాంహౌజ్ దాటి బయటకు రారని చాలా మంది అనుకున్నారు. అయితే ఉన్నట్లుండి కేసీఆర్ మాత్రం ఫిక్స్ అయ్యారు. వస్తానన్నారు. వద్దని కేటీఆర్ అంటున్నారు. సభలో కేసీఆర్ ను దూషిస్తారని ముందుగానే ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆ తర్వాత 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే హాజరయ్యారు. మళ్లీ అసెంబ్లీవైపు రాలేదు. నిజానికి అసెంబ్లీ జరిగిన 60 పని దినాల్లో కచ్చితంగా ఒక్కసారైనా సభకు హాజరు కావాలన్న రూల్ ఉంది. లేదంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంది.

జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్లకుండా జాగ్రత్తలు

మరోవైపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని సవాల్ చేస్తూ గత నెలలో హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించి, కొత్త వారిని ఎంపిక చేసేలా ఆదేశాలివ్వాలన్నారు. సో ఈ వేటు నుంచి తప్పించుకోవడం ఒకటి, ఫాంహౌజ్ లోనే సుదీర్ఘకాలం ఉంటే జనానికి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్నది ఇంకొక రీజన్ తోనే బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో సభాధ్యక్షుడు, విపక్ష నేత మధ్య అసెంబ్లీ వార్ నెక్ట్స్ లెవెల్ లో ఉండడం ఖాయమే అంటున్నారు.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×