BigTV English

IAF C-130J Night Landing : మరో సారి సత్తా చాటిన ఐఏఎఫ్.. కార్గిల్ ఎయిర్‌బేస్‌లో నైట్ ల్యాండింగ్ సక్కెస్

IAF C-130J Night Landing : సీ130జే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ బాహుబలి లేదా సూపర్ హెర్క్యూలస్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ మిలటరీ కార్గో ఎయిర్‌ప్లేన్‌ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

IAF C-130J Night Landing : మరో సారి సత్తా చాటిన ఐఏఎఫ్..  కార్గిల్ ఎయిర్‌బేస్‌లో నైట్ ల్యాండింగ్ సక్కెస్

IAF C-130J Night Landing : సీ130జే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ బాహుబలి లేదా సూపర్ హెర్క్యూలస్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ మిలటరీ కార్గో ఎయిర్‌ప్లేన్‌ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అటు చైనా, ఇటు పాకిస్థాన్‌కు వెన్నులో వణుకు పుట్టించేలా నేవర్ బిఫోర్‌ టాస్క్‌ను కంప్లీట్ చేసి చూపించింది. ఇంతకీ ఏంటా టాస్క్‌? దీని వల్ల ఇండియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌కు ఉన్న లాభాలేంటి?


హిమాలయాలు.. చుట్టూ మంచుకొండలు.. భూమికి 8 వేల 800 అడుగుల ఎత్తులో ఉంది కార్గిల్‌ ఎయిర్‌బేస్‌లోని ఎయిర్‌స్ట్రిప్‌. మాములు సమయాల్లోనే ఆ ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. ప్రతికూల వాతావారణం.. చుట్టు మంచుకొండల మధ్య విమానాన్ని నడపడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా చిన్నగా ఉండే ఫైటర్ జెట్ కూడా కాదు. అత్యంత భారీగా సరుకులు, సైనికులను తరలించే సూపర్ హెర్య్కూలస్ అని ముద్దుగా పిలుచుకునే సీ-130జే యుద్ధ విమానాన్ని నడపడం అంటే ఆషామాషీ కానే కాదు.

అలాంటి సూపర్ హెర్క్యూలస్‌ను కళ్లు పొడుచుకొని చూసినా ఏం కనిపించనంత చిమ్మ చీకటిలో కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండ్‌ చేయాలంటే.. ఆలోచిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఆ ఫీట్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేసి చూపించింది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌. ఈ ట్రైనింగ్ మిషన్‌లో టెర్రైన్‌ మాస్కింగ్‌ను కూడా ఉపయోగించినట్లు వెల్లడించింది.


స్పెషల్ ఫోర్స్‌ యూనిట్‌ గరుడ్‌ కమాండోలు కూడా ఈ ల్యాండింగ్ మిషన్‌లో పాల్గొన్నారు. అయితే నైట్‌ ల్యాండింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించలేదు. నిజానికి హిమాలయాల్లో 8 వేల 800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌లో విమానాలను ల్యాండ్‌ చేయడం పైలట్లకు సవాళ్లతో కూడుకున్న టాస్క్‌. అత్యంత ఎత్తుతో పాటు ప్రతికూల వాతావరణంలో విమానాలను ల్యాండ్‌ చేయాలంటే పైలట్లకు ప్రత్యేక స్కిల్స్‌ ఉండాల్సిందే.

ఈ ల్యాండింగ్‌కు చాలా ప్రత్యేకతలున్నాయని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్‌. ఈ ఫీట్‌తో అటు పాకిస్థాన్, ఇటు చైనాకు ఓ వార్నింగ్ పంపించినట్టే అనేది వారి వాదన. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు సి-130జే అనేది అత్యంత నమ్మకమైన విమానం. ఇటీవల ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే పనిలో కూడా సీ130జే సేవలు మరిచిపోలేనవనే చెప్పాలి. ఆ సమయంలో రెండు సి-130జే విమానాలను విజయవంతంగా ఉత్తరాఖండ్‌ ఎయిర్‌ స్ట్రిప్‌పై ల్యాండ్ చేశారు. కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఇవి భారీ ఇంజినీరింగ్‌ పరికరాలను అక్కడికి తరలించాయి.

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ వద్ద మొత్తం 12 సి-130జే మిలటరీ ట్రాన్స్‌పోర్ట్‌ విమానాలు ఉన్నాయి. ఇవి హిండన్‌లోని 77 స్క్వాడ్రన్‌, 87 స్క్వాడ్రన్‌లో విధులు నిర్వహిస్తున్నాయి. బలగాలు, సామగ్రి తరలింపులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో అటు చైనా, ఇటు పాకిస్థాన్‌కు చెక్‌ పెట్టేందుకు ఈ విమానాల పాత్ర కీలకమని ఆర్మీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. సరిహద్దుల్లో తోక జాడిస్తే ఇక రాత్రైనా, పగలైనా అత్యంత వేగంగా సరిహద్దులకు సైన్యాన్నే కాదు.. భారీ యుద్ధ పరికరాలను కూడా తరలించేందుకు వీలుంది.

ఈ బాహుబలి విమానం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నమ్మినబంటు. 2011 ఫిబ్రవరి 5న మన వైమానిక దళంలో అడుగుపెట్టిన ఈ లాక్‌హిడ్ మార్టిన్ యుద్ధ రవాణా విమానాలు అప్పటి నుంచి సేవలందిస్తూనే ఉన్నాయి. వీటికి సంబంధించి 2008లో అమెరికాతో ఒప్పందం కుదిరింది. నాలుగు టర్బో ఇంజిన్లతో పాటు రగ్డ్‌ డిజైన్ వీటి సొంతం. ఎత్తైన పర్వతాలు, తక్కువ పొడవున్న రన్‌వేలపై కూడా చాలా ఈజీగా ల్యాండ్‌ అయ్యేలా వీటిని డిజైన్ చేశారు. అందుకే వీటి ఆపరేషన్ ఎఫిషియన్సీ ఎక్కువని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతారు. అనేక యుద్ధ సమయాల్లో అమెరికన్ ఆర్మీకి ఇవి సేవలందించాయి.

కేవలం కార్గోను మాత్రమే రవాణా చేయడం కాదు.. ఎరియల్ రిఫ్యూయలింగ్.. సెర్చ్ అండ్ రెస్క్యూ, పారా డ్రాప్, ఎలక్ట్రానిక్‌ సర్వైలెన్స్‌కు కూడా ఈ విమానాలు ఉపయోగపడుతాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా పనిచేయడం వీటి సొంతం. అందుకే భారత ప్రభుత్వం వీటి సంఖ్యను పెంచుతూ వస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×