IND Vs PAK: పీవోకే మాది.. పీవోకే మాకే సొంతం అంటూ.. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తెగ గొంతు చించుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటే పాకిస్తాన్‌కు ఎంత ప్రేమో అనుకునేలా ఉంటాయ్ పాకీ వేషాలు. కానీ.. పీవోకే వెనుక అసలు స్టోరీ వేరే ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై.. పాక్ చూపేదంతా కపట ప్రేమే. కేవలం.. ఆదాయం కోసమే.. పీవోకేని వాడుకుంటోంది పాక్ ప్రభుత్వం. ఇందుకు.. గిల్గిట్-బాల్టిస్టాన్‌లో జరుగుతున్న ఆందోళనలే లేటెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడి ప్రజలు దేనికోసం నిరసన తెలుపుతున్నారు? చైనా ఏం చేయబోతోంది? పీవోకేని.. పాక్ ఎలా క్యాష్ చేసుకుంటోంది?
పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై పాక్ దొంగ ప్రేమ!
ఆదాయం కోసమే పీవోకేని వాడుకుంటోందా?
ఎస్.. ఇదే.. బయటకు కనిపించని నిజం. ప్రపంచంలోని మిగతా దేశాలకు అర్థంకాని వ్యవహారం కూడా ఇదే. పీవోకే తమకే సొంతమని.. తమది మాత్రమేనని పాక్ ఎంత గొంతు చించుకున్నా.. అసలు విషయమేంటో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటే.. ఇండియాకు ఓ ఎమోషన్. అది ఎప్పటికీ.. భారత్‌దేననే భావోద్వేగం కనిపిస్తాయి. వాస్తవం కూడా అదే. కశ్మీర్ ఎప్పటికీ మనదే. ఇది.. పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. కానీ.. పాకిస్తాన్‌కు అలా కాదు. పీవోకే అంటే.. అసలు పాక్‌కు ప్రేమే లేదు. ఆ ప్రాంతాన్ని.. కేవలం ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తోంది పాక్ ప్రభుత్వం.
పీవోకేలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు
అందుకోసమే.. పీవోకే కోసం ఇంత గొడవ చేస్తోంది. దశాబ్దాలుగా.. భారత్‌తో కయ్యానికి దిగుతోంది. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ గనక భారత్‌లో కలిసిపోతే.. ఇక పాక్ పనైపోయినట్లే. ఇప్పటికే బిచ్చమెత్తుకునే స్థితిలో ఉన్న పాకిస్తాన్‌కు.. ఇక బతుకుదెరువు అనేదే లేకుండా పోతుంది. ఇందుకు.. అక్కడ తాజాగా జరుగుతున్న పరిణామాలు, పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ జరుగుతున్న ఆందోళనలే.. పీవోకేని ఏ విధంగా పాక్ వాడుకుంటోందనే విషయాన్ని.. ప్రపంచం కళ్లకు కడుతున్నాయి. ఇప్పుడిప్పుడే.. పాక్ దృష్టిలో.. పీవోకే అంటే ఏమిటో, దానికి ఎలాంటి స్థానం ఉందో.. క్లియర్‌గా అర్థమయ్యేలా చేస్తున్నాయి.
ఇటీవలే.. గిల్గిట్-బాల్టిస్తాన్ అసెంబ్లీలో మైనింగ్ బిల్లు
ఇటీవలే.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ అసెంబ్లీలో.. ఓ బిల్లుని ప్రవేశపెట్టారు. అదేమిటంటే.. చైనా కంపెనీలకు గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని ఖనిజ వనరులైన.. బంగారం, యురేనియం, మాలిబ్డినం, రాగి, రత్నాల వంటి గనుల తవ్వకం కోసం స్వేచ్ఛాయుతమైన అనుమతులు ఇచ్చేందుకు ఆ బిల్లుని రూపొందించారు. ఈ బిల్లు.. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్.. సీపీఈసీలో భాగంగా.. చైనా పెట్టుబడుల్ని సులభతరం చేసేందుకు, పాకిస్తాన్ ఆర్థిక రుణభారాన్ని తగ్గించేందుకు తీసుకొచ్చారు.
పీవోకేలో సమృద్ధిగా యురేనియం, ఇతర అరుదైన ఖనిజాలు
గిల్గిట్-బాల్టిస్తాన్‌లో గనుల తవ్వకం కోసం 2 వేల కంటే ఎక్కువ లీజుల్ని.. చైనా కంపెనీలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. హుంజా, నగర్, చపుర్సన్ వ్యాలీ లాంటి ప్రాంతాలు.. యురేనియం, ఇతర అరుదైన ఖనిజాలకు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి.. అణు బాంబులు, స్పేస్ టెక్నాలజీలో వినియోగిస్తారు. అంతేకాదు.. చైనా మొదలుపెట్టిన.. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. సీపీఈసీ కోసం గిల్గిట్ -బాల్టిస్తాన్ ఓ కీలకమైన రవాణా మార్గం. కరకోరం హైవే.. ఈ ప్రాంతం గుండానే వెళుతోంది. ఇది.. చైనా, పాకిస్తాన్ మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.
వివాదాస్పద ప్రాంతంగా గిల్లిట్-బాల్టిస్తాన్
గిల్గిట్-బాల్టిస్తాన్.. ఓ వివాదాస్పద ప్రాంతంగా ఉంది. ఇది.. భారత్‌లోని జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భాగం. కానీ.. 1947 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది. ఈ బిల్లు.. స్థానిక ప్రజల సమ్మతి లేకుండా అక్కడున్న వనరుల్ని దోచుకునేందుకు ఓ ప్రయత్నమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది.. అంతర్జాతీయ చట్టాలను సైతం ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు ఉన్నాయ్. పాక్ తీసుకొచ్చిన ఈ బిల్లు.. స్థానికులకు ఎలాంటి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందించకుండా, చైనా, పాకిస్తాన్ ఆర్మీకి లాభం చేకూర్చే విధంగా రూపొందించారని.. గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.
భూములు, పర్వతాలు, ఖనిజాలను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు
ముఖ్యంగా.. స్థానికుల అనుమతి లేకుండా భూములు, ఖనిజ వనరుల్ని.. చైనా కంపెనీలకు కేటాయించడం పట్ల ఆ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో.. అక్కడ తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. మళ్లీ.. మళ్లీ ఆక్రమణల్ని తిరస్కరిస్తాం అనే నినాదాలతో వీధుల్లోకి వస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం.. తమ భూముల్ని, పర్వతాల్ని, ఖనిజాలను అక్రమంగా ఆక్రమిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
టూరిజం, వ్యవసాయం ఆధారపడిన గిల్లిట్-బాల్టిస్తాన్
పీవోకేలో.. చైనా మైనింగ్ కార్యకలాపాలు.. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి.. గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతం.. టూరిజం, వ్యవసాయం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. గనుల తవ్వకం వల్ల స్థానిక నీటి వనరులు కలుషితమవుతాయని, వ్యవసాయ భూములు నాశనం అవుతాయని చెబుతున్నారు. ఈ కార్యకలాపాలు.. స్థానిక జీవనోపాధిని కూడా దెబ్బతీస్తుందని అంటున్నారు. చైనాకు గనుల్ని అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వారిని.. పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది. నిరసనల్ని అణచివేసేందుకు.. పాక్ ఆర్మీ కఠిన చర్యలు తీసుకుంటోంది.
చైనా కంపెనీలే ఎక్కువ లాభం పొందుతున్నాయనే ఆరోపణలు
గతంలోనూ.. చైనా, పాకిస్తాన్ కంపెనీలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వందలాది మంది స్థానికులను అరెస్ట్ చేసి.. వారిపై దేశద్రోహం ఆరోపణలు మోపారనే సమాచారం ఉంది. స్థానికులు.. ఈ బిల్లుని.. పాకిస్తాన్ తన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకే.. చైనాకు గిల్టిట్-బాల్టిస్తాన్‌ని అమ్మేసినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా.. సీపీఈసీ ప్రాజెక్టుల నుంచి ఈ ప్రాంతానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లభించలేదని అంటున్నారు. బదులుగా.. చైనా కంపెనీలే ఎక్కువ లాభం పొందుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇలా.. పాకిస్తాన్ పీవోకేని ఓ ఆదాయ వనరుగా చూస్తుందే తప్ప.. ఆ ప్రాంతంపై ఎలాంటి ప్రేమలేదనే విషయం ఈ పరిణామాలను చూస్తే క్లియర్‌గా అర్థమవుతోంది.
ఈ వ్యూహాత్మకమైన సరిహద్దు.. మన కంట్రోల్‌కి వచ్చేస్తే..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని.. భారత్ ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాల్సిందే! సంపూర్ణ జమ్మూకశ్మీర్‌గా మార్చాల్సిందే! ఆ ప్రాంతం ఎప్పటికైనా ఈ దేశంలో భాగం కావాల్సిందే! ఎప్పుడైతే పీవోకే మనదైపోతుందో.. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ భారీగా నష్టపోతుంది. అనుకోని విధంగా పతనమవుతుంది. చైనాకు, పాక్‌కు ఉన్న లింక్ తెగి.. భారత్-అప్ఘాన్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. ఆ ఒక్క పీవోకేని.. భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే.. ఇటు పాక్‌కు, అటు చైనాకు ఒకేసారి చెక్ పెట్టొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో.. ఆ 108 కిలోమీటర్ల బోర్డరే కీ పాయింట్‌గా ఉంది. అదే.. పాక్‌కు లైఫ్ లైన్‌గా మారింది. ఈ వ్యూహాత్మకమైన సరిహద్దు.. మన కంట్రోల్‌కి వచ్చేస్తే..
పీవోకే భారత్‍లో కలిసిపోతే పాక్ పనైపోయినట్లే!
ఆ 108 కిలోమీటర్ల వ్యూహాత్మక సరిహద్దే కీలకం!
కీ పాయింట్ మనకొస్తే పాక్ కిస్సా ఖల్లాస్..
భారత్‌కు ఉత్తరాన.. కేవలం పాకిస్తాన్, చైనాతో మాత్రమే సరిహద్దు లేదు. అప్ఘానిస్తాన్‌తో కూడా మనకు 108 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కానీ.. అది పీవోకేలో ఉండటంతో పాకిస్తాన్‌కు వరంగా మారింది. ఇండియా గనక పీవోకేని స్వాధీనం చేసుకుంటే.. పాకిస్తాన్‌కు ఇంక నిద్రలేని రాత్రులే మిగులుతాయి. అందుకోసమే.. పీవోకేపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ.. ఆ ప్రాంతంలోని వనరుల్ని దోచేస్తూ.. పాకిస్తాన్ లాభపడుతోంది. చైనా ఇచ్చిన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని తాకట్టు పెడుతోందనే ఆరోపణలు, వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా.. పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్తాన్.. చైనాకు కూడా వ్యూహాత్మక ప్రాంతంగా మారింది.
భారత్ కు వ్యాహాత్మక పాయింట్‌గా 108 కిలోమీటర్ల సరిహద్దు
ఇది.. పాకిస్తాన్, ఇరాన్, అప్ఘానిస్తాన్, అరేబియా సముద్రతీరంలోని ఓడరేవులకు రవాణా మార్గాలను అందిస్తుంది. అదనంగా.. ఈ ప్రాంతంలోని ఖనిజ సంపంద.. చైనా అణు, అంతరిక్ష పరిశ్రమలకు కీలకంగా మారింది. అందుకోసమే.. పాకిస్తాన్‌కు ఆర్థికసాయం చేస్తూ.. చైనా మొత్తం వనరుల్ని కొట్టేస్తోంది. అందుకే.. పీవోకే చైనా, పాకిస్తాన్‌కు ఇంత కీలకంగా మారింది. ఇలాంటి కీలక ప్రాంతాన్ని.. భారత్ గనక స్వాధీనం చేసుకుంటే.. అప్ఘాన్‌తో ఉన్న 108 కిలోమీటర్ల సరిహద్దు భారత్‌లోకి వచ్చేస్తుంది. అప్పుడు.. ఆ ప్రాంతం.. ఇండియాకు వ్యూహాత్మక పాయింట్‌గా మారుతుంది.
108 కి.మీ.ల అప్ఘాన్ సరిహద్దుతో పాకిస్తాన్ ని క్లోజ్ చేసే ఛాన్స్
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని గనక భారత్ స్వాధీనం చేసుకుంటే.. ఆ 108 కిలోమీటర్ల అప్ఘాన్ సరిహద్దుతో.. పాకిస్తాన్‌ని పూర్తిగా క్లోజ్ చేయొచ్చు. ఇది.. పాకిస్తాన్‌కు కూడా బాగా తెలుసు. ఆ భయం పాక్‌లో ఉంది కాబట్టే.. పీవోకే తమదేనని అడ్డగోలుగా వాదిస్తోంది. పాక్ ఆయువుపట్టు అంతా.. పీవోకేలోనే ఉంది. అందుకోసమే.. కశ్మీర్‌పై ప్రేమ ఉన్నట్లు డ్రామాలాడుతుంది. చైనాతో వాణిజ్యానికి కూడా ఇదే కీలక పాయింట్. అందుకోసమే.. అక్కడున్న వనరుల్ని దోచేస్తూ.. పీవోకేని ఆదాయం కోసం గట్టిగా వాడేస్తోంది. అయితే.. పీవోకే గనక ఇండియాలో కలిసిపోతే.. భారత్‌కు, అప్ఘానిస్తాన్ వెళ్లేందుకు డైరెక్ట్ యాక్సిస్ దొరుకుతుంది.
పీవోకే భారత్‌లో కలిసిన రోజే పాక్ ఖేల్ ఖతం
అప్పుడు.. భారత్, అఫ్ఘాన్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఇదే సమయంలో.. పాక్‌కు, చైనాకు మధ్య ఉన్న లింక్ కూడా తెగిపోతుంది. ఇప్పుడు.. చైనాకు పీవోకేతో సరిహద్దు ఉంది కాబట్టే.. పాకిస్తాన్ ఆటలాడుతోంది. అదే.. పీవోకేని ఎప్పుడైతే భారత్‌లో కలిపేసుకుంటామో.. ఆరోజే పాక్ ఖేల్ ఖతమైపోతుంది. ఇది పాకిస్తాన్‌కు, చైనాకు బాగా తెలుసు. అందుకోసమే.. డ్రాగన్.. తన బీఆర్ఐ ప్రాజెక్టు కోసం పాక్‌కు ఆర్థికసాయం చేస్తోంది. సీపీఈసీ పేరుతో.. పీవోకేలోని వనరుల్ని దోచేస్తోంది.
పీవోకే స్వాధీనమైతే పాక్ కు చైనాకు మధ్యలో ఇండియా
పీవోకే.. భారత్‌లో భాగమైపోతే.. పాకిస్తాన్-చైనా మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుంది. అప్పుడు.. పాక్‌కు, చైనాకు మధ్యలో ఇండియా ఉంటుంది. పాక్ అటు వెళ్లలేదు. చైనా ఇటు రాలేదు. భవిష్యత్తులో.. పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా సైన్యం రావాలన్నా.. అంత సులువైన వ్యవహారం కాదు. చైనా వాడు పాక్‌కి రావాలంటే.. మొత్తం తిరిగి రావాల్సి ఉంటుంది. కింద నుంచి సముద్ర మార్గం గుండా రావాలంటే.. అటు వైపు ఇండియన్ నేవీ సిద్ధంగా ఉంటుంది. పోనీ.. పై నుంచి రావాలనుకుంటే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రెడీగా ఉంటుంది.
పీవోకే మన కంట్రోల్‌లోకి వస్తే.. పాక్ చాప్టర్ క్లోజ్ అయినట్లే
అలా కాదని.. కశ్మీర్ సరిహద్దు గుండా వచ్చేందుకు ప్రయత్నిస్తే.. ఇండియన్ ఆర్మీ అప్పటికే మోహరించి ఉంటుంది. సో.. పీవోకే గనక మన కంట్రోల్‌లోకి వచ్చేస్తే.. ఇక పాక్ చాప్టర్ క్లోజ్ అయినట్లేననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయ్. ఇప్పటికే.. గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతం భారత్‌లోని జమ్మూ-కశ్మీర్‌లో భాగమని ఇండియా క్లెయిమ్ చేస్తోంది. ఈ ప్రాంతం గుండా.. చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ వెళ్లడాన్ని అక్రమంగా భావిస్తోంది. అందువల్ల.. ఒక్క పీవోకే.. ఇండియాలో కలిసిపోతే.. ఒకే దెబ్బకు అటు చైనాకు, ఇటు పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పొచ్చనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయ్.