Honor Magic V3| ప్రపంచ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపేందుకు హానర్ (Honor) సిద్ధమవుతోంది. త్వరలో విడుదల కానున్న హానర్ మేజిక్ V3 ఫోల్డబుల్ ఫోన్ ద్వారా హానర్ కంపెనీ స్లిమ్ డిజైన్ ఫోన్ల రేంజ్ లో భారీ ప్రభావాన్ని చూపించాలనుకుంటోంది. ఈ ఫోన్‌ను ఇప్పటివరకు ఉన్న ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యంత పలుచగా ఉండేవిధంగా తీర్చి దిద్దనున్నట్లు కంపెనీ చెబుతోంది. దీంతో పాటు ఇటీవల విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ తో నేరుగా పోటీ పడి దాన్ని మించే ఫీచర్లు హానర్ మ్యాజిక్ లో ఉండబోతున్నట్లు టెక్ పరిశ్రమలో చర్చ సాగుతోంది.
సామ్‌సంగ్ ఇటీవల 5.8mm మందంతో తన అత్యంత పల్చనైన డివైస్ అయిన గెలాక్సీ S25 ఎడ్జ్‌ను ప్రవేశపెట్టింది. కానీ హానర్ ఇంకా ముందుకు వెళ్లనుంది. మేజిక్ V3 ఫోన్ అన్‌ఫోల్డ్ చేసినప్పుడు దాని మందం కేవలం 4.3mm మాత్రమే ఉండబోతుందని సమాచారం. ఇది ఇప్పటివరకు తయారైన స్మార్ట్‌ఫోన్లలోనే అత్యంత సన్నగా ఉంటుందని అంచనా.
ఈ డిజైన్ వల్ల హానర్ కంపెనీ హైఎండ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో టాప్ పొజిషన్ సాధింస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ముఖ్యంగా గెలాక్సీ సిరీస్ ద్వారా ఇప్పటికే మార్కెట్‌ను ఆధిపత్యంగా కలిగి ఉన్న సామ్‌సంగ్‌తో పోటీ పడబోతోంది.
ఇటీవల హానర్ తన అధికారిక X (మాజీ ట్విట్టర్) ఖాతాలో చేసిన ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో సామ్‌సంగ్ కంపెనీని నేరుగా టార్గెట్ చేసింది. “మీరు పలుచగా ఉండే ఫోన్లు తయారు చేస్తున్నారు. కానీ అందులో విషయం ఉండడం లేదు. మరి తయారు చేసి ఏం లాభం? పలుచగా ఉండే ఫోన్ కానీ పసలేదు. ” అని ట్యాగ్ లైన్ కూడా రాసింది. అందుకే హానర్ కంపెనీ.. స్లిమ్ ఫోన్ల తయారీలో ఫీచర్లు తగ్గకుండా వాటి పనితీరు బాగా ఉండేలా తయారు చేస్తున్నామని తెలిపింది.
ఒకవైపు సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 3900mAh బ్యాటరీని మాత్రమే కలిగి ఉండగా, హానర్ మేజిక్ V3 మాత్రం 5050mAh భారీ బ్యాటరీతో రానుంది. ఇది సన్నని ఫోల్డబుల్ ఫోన్‌ల్లో సాధారణంగా చూడని అద్భుతమైన ఫీచర్.ఫోన్ అన్‌ఫోల్డ్ చేసినప్పుడు మాత్రమే 4.3mm మందం ఉంటుందన్నది నిజమే అయినా, ఇంత పల్చనైన బాడీలో ఈ స్థాయి బ్యాటరీని ఏర్పాటు చేయడం హానర్ యొక్క ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం.
Also Read: ఫోన్ చోరి అయిందా? దొంగలు ఆ ఫోన్ ఉపయోగించకుండా ఉండేందుకు కొత్త ఫీచర్
హానర్ మేజిక్ V3 త్వరలో విడుదల కానుంది. ఇది ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. అల్ట్రా-థిన్ డిజైన్, ఫోల్డబుల్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో ఇది సామ్‌సంగ్‌తో పాటు ఇతర ప్రీమియం బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వబోతుంది.
ప్రముఖ బ్రాండ్లకు ధీటుగా నిలబడేందుకు హానర్ తన వ్యూహాలను పదునుపెట్టగా, ఫోల్డబుల్ ఫోన్‌లపై వినియోగదారుల అంచనాలను మార్చే అద్భుత ఆవిష్కరణగా మేజిక్ V3 నిలుస్తుందని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.