MG Windsor EV Pro: ఎంజీ మోటార్ కార్ల గురించి చెప్పనక్కర్లేదు. టెక్నాలజీ పరంగా కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంది ఈ కంపెనీ. మిగతా కార్ల కంపెనీ కంటే ఈ విషయంలో ఓ అడుగు ముందు ఉంటుందని కస్టమర్ల మాట. అందుకే ధర ఎక్కువైనా దీనివైపు వినియోగదారులు మొగ్గు చూపుతారు.
తాజాగా ఎంజీ మోటార్ ఇండియా భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారు డెలివరీలను మొదలుపెట్టింది. కొద్దిరోజుల కిందట ప్రారంభించిన ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో కారు 24 గంటల్లో 8,000 బుకింగ్స్ సొంతం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక రికార్డు. విండ్సర్ లైన ప్లో కొత్త టాప్-ఎండ్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. స్టాండర్డ్ విండ్సర్ ఈవీ కంటే కొత్త ఫీచర్లు దీని సొంతం. ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ధర ఎంత? ఎలక్ట్రిక్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.18.10 లక్షలు నిర్ణయించారు కంపెనీ నిర్వాహకులు. మొదట రూ.17.49 లక్షల ధరతో ప్రారంభించారు. అయితే ఈ ధర కేవలం తొలుత బుక్ చేసుకున్న 8 వేల మంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి ఉంది.
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో బ్యాటరీ ప్యాక్ ఎంత? MG విండ్సర్ ప్రో EV కి 52.9 kWh బ్యాటరీ ఉంటుంది. స్టాండర్స్ విండ్సర్ EV కి 38 kWh యూనిట్ లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలో మీటర్ల వరకు వెళ్లుందని కంపెనీ వర్గాల మాట.
ALSO READ: ఇస్రో 101 రాకెట్ ఫెయిల్, వెంటాడిన సాంకేతిక సమస్యలు
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో స్పెసిఫికేషన్ విషయానికి వద్దాం. విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ మోటారులో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం 134 బీహెచ్పీ పవర్, 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేయనుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో అదనపు ఫీచర్లు విషయానికి వెళ్దాం. ఎంజీ విండ్సర్ ఈవీతో పరిశీలిస్తే.. ప్రో వేరియంట్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, ఏడీఏఎస్ లెవల్ 2తో రానుంది. దీంతోపాటు ఇంటీరియర్ లేత గోధుమ రంగు, నలుపు రంగుల డ్యూయల్-టోన్ థీమ్‌లో ఉండనుంది.
15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పానోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 9-స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ దీని సొంతం. అలాగే 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోలో కాస్మెటిక్ మార్పులు విషయానికి వద్దాం. ఎంజీ మోటార్ ఇండియా మూడు రంగులను ఎంపిక చేసింది. వీటిలో సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్. అదనంగా పెర్ల్ వైట్, స్టార్‌బర్స్ట్ బ్లాక్-టర్కోయిస్ గ్రీన్ అందుబాటులో ఉంటుంది. హెక్టర్ నుండి తీసుకోబడిన కొత్త 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ దీని సొంతం.