BigTV English

Jagadishwar Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు జగదీష్ రెడ్డి షాక్

Jagadishwar Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు జగదీష్ రెడ్డి షాక్

Jagadishwar Reddy: ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌లో గ్రూప్ తగాదాలతో నేతలు సతమతమవుతున్నారట. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఒంటెద్దు పోకడలు తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఇంకా మంత్రి తరహాలోనే పార్టీ నేతలపై పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానం కూడా జగదీశ్‌కే ప్రాధాన్యత ఇస్తుండటంతో జల్లా పార్టీ శ్రేణులు మింగలేక కక్కలేక సతమతమవుతున్నాయంట.


నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి

ఉమ్మడి నల్లగొండ లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నుంచి నామమాత్రపు మెజారిటీతో గెలిచిన జగదీశ్‌రెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ ఉనికి చాటారు. అంతవరకు బాగానే ఉంది కాని అసలు సమస్య ఇప్పుడే మొదలైందట. పదేళ్లు జిల్లా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఇపుడు అధికారం పోయినా అదే రీతిలో పార్టీలో పెత్తనం చేస్తున్నారట. ఇప్పటికి జిల్లా మంత్రి గా ఉన్నప్నుడు పార్టీ పరంగా ఎలా వ్యవహారించారో.. ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తున్నాంట.


మాజీ మంత్రిని కాదనలేక పోతున్న జిల్లా బీఆర్ఎస్ నేతలు

గులాబీ బాస్ కేసీఆర్‌కు జగదీశ్‌రెడ్డి దగ్గర వ్యక్తి అవ్వడంతో మొదటి నుంచి జిల్లాలో ఆయన్ని కాదని ఏ నాయకుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందంట. జగదీష్ ని కాదని ఎవరైనా ముందుకు వెళ్లాలని చూస్తే ఎలా చెక్ పెట్టాలో మాజీ మంత్రి కి బాగా తెలుసంటున్నారు. ఆ క్రమంలో నకిరేకల్, భువనగిరి, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు జగదీశ్‌ రెడ్డి తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారట. ఆ మాజీ ఎమ్మెల్యేలని కాదని ఆయా సెగ్మెంట్లలో జగదీశ్‌రెడ్డి తన అనుచరగణాన్ని వారికి పోటీగా తయారు చేస్తున్నారంట. దాంతో ఆ మాజీలు దిక్కుతోచలేని స్థితిలో ఉన్నారంటున్నారు.

భువనగిరిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పైళ్ల శేఖర్ రెడ్డి

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి క్యాడర్‌ని కాపాడుకుంటూ మొన్న ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవకపోయినా.. పార్టీ కోసం పనిచేస్తుంటే జగదీశ్‌రెడ్డి తన వారిని ఎంకరేజ్ చేస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. భువనగిరిలో రెండు సార్లు పైళ్ల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచారు. మొన్న జిల్లాలో ఎక్కువ ఖర్చు పెటింది కూడా శేఖర్ రెడ్డే అంటారు. అయితే స్థానిక నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి , జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ప్రతి నిత్యం జగదీశ్ రెడ్డి వెనకాల ఉంటూ పైళ్ల శేఖర్‌రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారంట.

మాజీ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా జగదీష్ రెడ్డి వర్గం ఆందోళనలు

భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పైళ్ల శేఖర్‌రెడ్డికి కేటీఆర్, హరీష్ రావు లు ఎప్పటికపుడు ఫోన్ లు చేస్తూ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు . అదే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ చేయడం కాదు కదా.. అక్కడ పైళ్ల కు సంబంధం లేకుండా తన అనుచరులతో ఆందోళనలు చేయించారన్న టాక్ ఉంది.

లింగయ్యకు చెక్ పెట్టాలని చూస్తున్న మాజీ మంత్రి

నకిరేకల్ లోను అదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ను కాదు అని.. లింగయ్య ఒక దళితుడు అని కూడా చూడకుండా వేధిస్తున్నారంట. నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వేషన్ లు మారే అవకాశం ఉంది. మీరే ఎమ్మెల్యే అభ్యర్లులు అంటూ జగదీశ్‌రెడ్డి కొంత మందిని తెర మీదకు తీసుకొస్తున్నారట. మాజీ ఎంపీపీలు రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి , నరేందర్‌రెడ్డి లు చిరుమర్తి లింగయ్యకి వ్యతిరేకంగా నకిరేకల్‌లో మాజీ మంత్రి పేరు చెప్తూ పెత్తనం చేస్తున్నారంట. నియోజకవర్గంలో చక్కెర్లు కోడుతుందట. ఇక మునుగోడు లోను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా జగదీష్‌రెడ్డి తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారంట.

మాజీమంత్రి వైఖరితో గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ నేతలు

కష్టకాలంలో పార్టీ ఇన్చార్జులుగా క్యాడర్ని కాపాడుకుంటుంటే.. మాజీ మంత్రి రాజకీయాలతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక మాజీలంతా లోలోపల కుమిలిపోతున్నారంట. పదేళ్లు మాజీ మంత్రిని కాదని ఎప్పుడూ గీత దాటలేదని.. ఇప్పుడు కూడా ఆయనను కాదని తాము ఎం చేయడం లేదని.. మరి ఆయన ఎందుకు అలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని మాజీలు అనుచరుల వద్ద వాపోతున్నారంట. ఎన్నికల నాటికి సర్వే ఆధారంగా బీ ఫామ్‌లు ఇవ్వాలి కాని.. ఇప్పటి నుంచే పొమ్మన లేక పొగబెట్టడం ఏంటని మాజీలు గగ్గోలు పెడుతున్నారంట. మొత్తానికి మాజీ మత్రి పెత్తనం ఆలా సాగిపోతోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×