UP Crime News: ఆ మహిళకు 30 ఏళ్లు. ఆమెకు పెళ్లి అయ్యింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రహాల ప్రభావం వల్ల ఏమోగానీ ఆమె మనస్సు కాస్త పరాయి పురుషుడిపై పడింది. హర్యానాకు చెందిన పని నిమిత్తం ఆ మహిళ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత యువకుడితో పరిచయం పెరిగింది. అది కాస్త ఫ్రెండ్ షిప్‌గా మారింది. చివరకు పెట్రోల్ పోసి ఆమెని తగులబెట్టాడు మాజీ ప్రియుడు. అసలేం జరిగింది.. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం.
యూపీ లవ్ స్టోరీ
యూపీలోని మథుర జిల్లాలోని కోహ్ గ్రామానికి చెందిన రేఖకు మూడు పదుల వయస్సు. ఆమెకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఏడు సంవత్సరాలు, మరొకరికి ఐదేళ్లు. స్థానిక పాఠశాలలో వీరిద్దరు చదువుతున్నారు. రేఖ భర్త రైతు కావడంతో నిత్యం పొలం పనుల్లో బిజీగా ఉండేవారు. పని మీద ఎవరైనా ఇంటికి వస్తే చూడాలని ఆ బాధ్యతను భార్యకు అప్పగించాడు.
ఇదే క్రమంలో హర్యానాలోని హస్నాపుర్‌కు చెందిన 28 ఏళ్ల ఉమేశ్ పనుల నిమిత్తం యూపీలో కోహ్ గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో రేఖతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేక పోయేవారు. ఇంకాస్త వెనక్కి వెళ్తే.. గతేడాది ఆగస్టు చివరలో రేఖ-ఉమేష్ పారిపోయారు. వారిద్దరు ఎక్కడకు వెళ్లారో తెలీదు. చివరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాకు వీరిద్దరిని గుర్తించారు పోలీసులు.
తిరిగి రేఖను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేసిన తప్పును తెలుసుకుంది రేఖ. చాలా తప్పు చేశానని ఆలస్యంగా గుర్తించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఉమేశ్ రేఖ ఇంటికి రావడం కంటిన్యూ చేశారు. రేఖ మాత్రం అందుబాటులో ఉండగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. రేఖ వ్యవహారశైలిని గమనించి ఉమేష్, ఆమె లేకుండా ఉండలేనని నిర్ణయించుకున్నాడు. అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది.
ALSO READ: చిత్తూరులో కాల్పుల కలకలం, అసలేం జరిగింది?
మహిళ గెటప్‌తో ఉమేష్ ఎంట్రీ
ఈ నేపథ్యంలో రేఖతో ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాడు ఉమేష్. మంగళవారం లెహంగా దుస్తులు ధరించి మహిళ మాదిరిగా తయారై రేఖ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పిల్లలిద్దరు పాఠశాలకు వెళ్లారు. రేఖ భర్త పొలం పనులకు వెళ్లాడు. పైకప్పు మీద నుంచి రేఖ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఉమేశ్. ఇద్దరు ఇక్కడి నుంచి పారి పోదామని ఆమెను బలవంతం చేశాడు. అందుకు రేఖ ససేమిరా అంది. ఇద్దరు మధ్య కాసేపు గొడవ జరిగింది.
ఉమేష్‌తో వెళ్లేందుకు ఆమె అంగీకరించకలేదు. పట్టరాని కోపంతో రేఖపై తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు ఆమెని చుట్టుముట్టాయి. రేఖ కేకలను విన్న ఇరుగు పొరుగువారు వెంటనే అక్కడి వచ్చారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఉమేశ్ ఇంటి పైకప్పు నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరు ఆగ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రేఖ 70 శాతం వరకు కాలిపోయింది. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మరి రేఖ ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.