BigTV English

Israel Iron Dome: ఫ్యూచర్ స్టార్ వార్స్.. తగ్గేదేలేదంటున్న అమెరికా

Israel Iron Dome: ఫ్యూచర్ స్టార్ వార్స్.. తగ్గేదేలేదంటున్న అమెరికా

Israel Iron Dome: ఇజ్రాయిలీ ఐరన్ డోమ్, భారత సుదర్శన్ చక్ర, తలదన్నేలా అమెరికన్ గోల్డెన్ డోమ్? వాటీజ్ ద గోల్డెన్ డోమ్? ఏంటి దీని టార్గెట్ కమ్ బడ్జెట్? ఫ్యూచర్ STAR WARS ఎలా జరగబోతున్నాయ్? ఇప్పుడు చూద్దాం.


భారత్ సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ

ఇప్పటికే ఈ దిశగా ఇజ్రాయెల్ ఈ వార్ గేమ్ ప్లాన్ చేసింది. దీన్నే ఐరన్ డోమ్ అంటారు. భారత్ సైతం.. సుదర్శన చక్ర అంటూ తనదైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేసుకుంది. మొన్నటి ఆపరేషన్ సిందూర్ లో ఈ ప్రపంచమంతా కలసి ఈ రక్షణ గోడ ఆకాశాన్ని కాపుకాచిన స్కై షీల్డ్ ని చూసి ఆశ్చర్యపోయింది. భలేగుందే అంటూ నివ్వెర పోయింది. చైనా టర్కీ దేశాల నుంచి పాక్ అరువు తెచ్చుకున్న విజ్ఞానమంతా దీని ముందు దిగదుడుపేనని తేలింది. పైపెచ్చు వారి గుండెల్లో అణుబాంబులు మోగించడం చూసి.. అమెరికా సైతం షాకై పోయింది. దీంతో ట్రంప్ కి ఎప్పుడో రొనాల్డ్ రీగన్ హయాంలోని స్టార్ వార్స్ ఫార్ములా గుర్తుకొచ్చింది. వెంటనే దానికి గోల్డెన్ డోమ్ అన్న నామకరణం చేసి.. తన వరుస సంచలనాల్లో దీన్ని కూడా ఈ ప్రపంచం మీదకు వదిలారు.


OP సింధూర్ లో చైనా శాటిలైట్ టెక్నాలజీ

ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఫ్యూచర్ వార్ డైనమిక్స్ కమ్ డైమన్షన్స్ బొత్తిగా మారిపోయాయి. మొన్నటి ఆపరేషన్ సిందూర్ లోనూ చైనా తన శాటిలైట్ పరిజ్ఞానం వాడి పాకిస్థాన్ కి సాయం చేయాలని చూసిందన్న కథనాలు వెలువడ్డాయ్. ఇప్పటికే చైనాతో యూఎస్, యూకే తదితర దేశాలకు ఒక సైనిక సమస్య ఉంది. ఆదేశానికున్న జనాభా సంఖ్య ఆధారంగా చూస్తే దానికున్న ఆర్మీ పవర్.. యూఎస్, యూకే వంటి దేశాలకు ఉండే ఛాన్సే లేదు. దీంతో సైబర్ వార్, స్పేస్ వార్, స్మార్ట్ వార్, ఏఐ రిలేటెడ్ వార్ అంటూ రకరకాల యుద్ధ, ఆయుధ ప్రయోగాలకు సిద్ధ పడుతున్నాయి.. యూఎస్ నేతృత్వంలోని యురోపియన్ దేశాలు. అందులో భాగంగా ట్రంప్ గోల్డెన్ గ్లోబ్ ప్రతిపాదన చేశారు.

భారత్ బ్రహ్మోస్, చైనా పీఎల్- 15

ఇంతకీ ఏంటి గోల్డెన్ గ్లోబ్ అని చూస్తే…. ఇప్పుడు ఎటు చూసినా విపరీతమైన క్షిపణి వ్యవస్థ పెరిగిపోయింది. భారత్ బ్రహ్మోస్ తో విరుచుకుపడుతుంటే.. చైనా పీఎల్- 15 అంటూ అల్ట్రా మోడ్రన్ మిస్సైళ్లతో చెలరేగుతోంది. ఇక ఉత్తర కొరియా సంగతి సరే సరి. కిమ్ అధ్వర్యంలో మోడ్రన్ మిస్సైళ్ల వ్యవస్థ విస్తృతంగా పెరిగింది. అత్యాధునిక రాఫెల్ తరహా విమానాలు సైతం.. ఈ క్షిపణుల దెబ్బకు జడుసుకుంటున్నాయ్. ఇలాంటి అధునాతన విమానాలను సైతం క్రాస్ చేసుకుని.. వాషింగ్టన్ డీసీ, ఇతర అమెరికా ప్రధాననగరాలను ప్రత్యర్ధి దేశాలమిస్సైళ్లు తాకితే. ఊహించడానికి కూడా ఇఫ్టపడ్డం లేదు అమెరికా. దీంతో ఏం చేయాలన్న మథనం చేసిన అమెరికాకు దగ్గర్లోని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, తమ పాతతరం నాయకుడు రొనాల్డ్ రీగన్ ప్రతిపాదన స్టార్ వార్స్ ని మిక్స్ చేయాలని ట్రై చేస్తోంది అమెరికా. అందులో భాగంగా.. ఒక కొత్త క్షిపణి రక్షణ గోడ.. తన అంతరిక్షం మీద నిర్మించాలనుకుంటోంది. ఈ గోల్డెన్ డోమ్ ను మూడేళ్లలోగా అభివృద్ది చేయడం కోసం.. 175 బిలియన్ డాలర్ల బడ్జెట్ ని ప్రకటించింది ట్రంప్ సర్కార్. అయితే ఇది సరిపోయే అవకాశం లేదంటోంది అమెరికన్ కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్. ఎంత లేదన్నా ఈ ప్రాజెక్టుకు 500 బిలియన్ డాలర్ల మేర ఖర్చేయ్యేలా ఉందని అంచనా వేస్తోంది.

ఒక క్షిపణి వస్తుందని తెలియగానే పేల్చి వేత

ఈ ఆకాశ రక్షకుడి పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మనం ఇజ్రాయలీ ఐరన్ డోమ్ ఎలా పని చేసిందో తెలుసుకోవాలి. బేసిగ్గా ఇది బూస్ట్, మిడ్ కోర్స్, టెర్మినల్, ఇన్ కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడానికి, వాటిని ట్రాక్ చేయడానికి, అడ్డగించడానికి,, ఇంటర్ లాక్ చేయబడిన వివిధ వ్యవస్థలను కలిగి ఉంటుంది. టార్గెట్ సింపుల్. ఒక క్షిపణి మనవైపు వస్తుందని తెలియగానే అది లక్ష్యం చేరక ముందే పేల్చి వేయడం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ 2011లోనే అందుబాటులోకి వచ్చింది. వేలాది రాకెట్లు, మిస్సైళ్లను అడ్డుకుంది. గతేడాది ఏప్రిల్, అక్టోబర్ లో ఇరాన్ ప్రయోగించిన వందకు పైగా రాకెట్లలో అధిక భాగాన్ని.. ఈ రక్షణ వ్యవస్థ తునాతునకలు చేసింది. హమాస్ ప్రయోగించిన రాకెట్లను కూడా ఇది అడ్డుకుంది. ఇక రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సిందూర్ లో మన S- ఫోర్ హండ్రెడ్స్ ఎంతటి ప్రతిభ చూపాయో ప్రపంచమంతా చూసింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి సర్వత్రా ప్రశంసలు లభించాయి. దీంతో అమెరికా తాను ఇప్పటి వరకూ తయారు చేసుకుంటూ వచ్చిన టెక్నాలజీ సరిపోదని గ్రహించి.. అందరికన్నా హై ఎండ్ లో తన యుద్ధ సాంకేతికత ఉండాలన్న ఆలోచన చేసింది. వెంటనే గోల్డెన్ డోమ్ సిస్టమ్ ని వెలుగులోకి తెచ్చింది.

ఇంటర్ సెప్టర్ల నెట్ వర్కే అత్యంత కీలకం

గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగన తలంపై ఒక కన్నేసి ఉంచుతుంది. తమ దేశం వైపు వచ్చే మిస్సైళ్ల ముప్పును ముందుగానే పసిగడుతుంది. అవి తమ ఉపరితలాన్ని టచ్ చేయక ముందే.. మార్గమధ్యంలో వాటిని ధ్వంసం చేసేస్తుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్ సెప్టర్ల నెట్ వర్కే అత్యంత కీలక పాత్ర. వీటిలో లేజర్ ఆయుధాలు కూడా ఉండే ఛాన్సుంది. ఇది ఒక రకంగా రొనాల్డ్ రీగన్ ప్రతినాదించిన స్టార్ వార్స్ ని తలపిస్తోంది. అమెరికా అతి విశాలమైన దేశం. ఈ మొత్తం దేశంలోని వివిధ నగరాలు కవర్ కావాలంటే.. స్పేస్ లో ఇంటర్ సెప్టర్లతో భారీ నెట్ వర్క్ నిర్మించాల్సి ఉంటుంది. లేజర్లను స్పేస్ లోకి పంపడం అంత తేలిక కాదు. అందుకోసం భారీ ఇంధనం, అద్దాలు ఇతర సామాగ్రిని పెద్దమొత్తంలో అంతరిక్షంలోకి చేర్చాల్సి ఉంటుందని అంటారు బ్రూకింగ్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ మిషెల్ ఓహాన్.

మొన్నటి వరకూ ఉన్న ఇంటర్నేషనల్ డిమాండ్. అణ్వాయుధాలు. ఈ ప్రయోగాలు చేయాలి వద్దన్న చర్చ నడిచేది. అయినా సరే పాక్ లాంటి చిన్నా చితకా దేశం కూడా ఈ దిశగా ప్రయోగాలు చేసి.. ఇవాళ భారత్ తో ధీటుగా అణ్వాయుధ దేశంగా మారింది. వచ్చే రోజుల్లో ఇదే డిమాండ్.. సే నో టు స్పేస్ వార్ అన్న నినాదం వెలుగు చూడనుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఈ అంతరిక్ష యుద్ధం వల్ల ప్రయోజనాలేంటి? దీని వల్ల వ్యాప్తి చెందనున్న నష్టాలు ఎలాంటివి? చైనా, రష్యా తదితర దేశాలు అమెరికన్ గోల్డెన్ గ్లోబ్ ప్రాజెక్ట్ గురించి ఏమంటున్నాయ్?

చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా అభ్యంతరం

కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అభ్యంతరాల వేళ.. సాధ్యమేనా?ప్రశాంతంగా ఉన్న అంతరిక్షం కూడా ఒక యుద్ధరంగాన్ని తలపిస్తుంది. కాబట్టి గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ వద్దు- ఇదీ చైనా, రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా దేశాల అభ్యంతరం. చిత్రమైన విషయమేంటంటే.. అంతరిక్ష యుద్ధం గురించి ఇప్పుడు కాదు ఎప్పుడో ట్రంప్ కామెంట్ చేశారు. 2018 జూన్ 18న ఒక ప్రకటన చేశారు. దీని సారాంశమేంటంటే.. అమెరికా సైన్యంలో అంతరిక్ష దళం. కాలిఫోర్నియా యూఎస్ మెరైన్ సభ్యులను ఉద్దేశించి.. అధ్యక్షుడు ట్రంప్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. భూమి, గాలి, సముద్రంలాగా అంతరిక్షం కూడా ఒక యుద్ధ రంగం ఎందుకు కాకూడది అని అంటారాయన దీంతో ఒక్కొక్కరి మతి పోయింది. మనకు వైమానిక దళం ఉంది, అంతరిక్ష దళం ఎందుకుండకూడదన్నది ట్రంప్ ఆనాడే వ్యక్తం చేసిన అభిప్రాయం. ట్రంప్ చేసిన మరో కామెంట్ ఏంటంటే భూమిని దాటి మనం ఇంతగా ఆలోచించాల్సిరావడంలో జాతీయతకన్నా.. భద్రత అత్యంత ప్రధానమైంది. అందుకే మనం ప్రాతినిథ్యంతో సరిపెట్టకూడదు. ఆధిపత్యం కూడా సాధించాలని ఎప్పుడో చెప్పారు ట్రంప్. అంతే కాదు భవిష్యత్తులో అంతరిక్షం కూడా సైనికీకరణ చెందుతుంది. సరికొత్త యుద్ధరంగంగా మారుతుంది. అంతరిక్షంలో ఉపగ్రహాలు, క్షిపణులు ఇతర సైనిక నౌకల ద్వారా పెద్ద ఎత్తున స్పేస్ వార్స్ జరుగుతాయని అప్పట్లోనే అన్నారు ట్రంప్.

వచ్చే రోజులలో అంతరిక్షంలో సైనిక ఉప గ్రహాలు

ఇక గూగుల్‌లో అంతరిక్ష యుద్ధాలని సెర్చ్ చేయగానే కనిపించేదేంటంటే.. వచ్చే రోజుల్లో నిఘా, కమ్యూనికేషన్ శాటిలైట్స్ మాత్రమే కాదు.. సైనిక ఉపగ్రహాలు సైతం పెరుగుతాయని. ఫ్యూచర్ లో అంతరిక్ష ఆయుధాలు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఇండియా- పాకిస్థాన్ మధ్య వార్ జరిగింది. అంటూ ఆయా ప్రాంతాల గురించి చెప్పుకునేవాళ్లం. ఇకపై ఆకాశంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది అందుకే ఆ ఉరుములు, మెరుపులు అని చెప్పుకునే రోజులు రావచ్చు. అంతగా అంతరిక్ష ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. క్లియర్ కట్ మెసేజ్ ఏంటంటే.. ఫ్యూచర్లో అంతరిక్షం ఒక యుద్ధరంగంగ కానుంది. ఇది ప్రపంచ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతే కాదు అంతరిక్ష యుద్ధాలు ప్రమాదకరంగా ఉండొచ్చు. ఇవి ప్రపంచ శాంతికి ముప్పుగా మారవచ్చు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. గోల్డెన్ డోమ్ లోని మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే.. రీగన్ 1983లో చేసిన ప్రతిపాదన- స్టార్ వార్స్. ఇది కూడా ప్రస్తుతం ఒక డిబేటబుల్ పాయింట్ గా మారింది. దీన్నే వ్యూహాత్మక రక్షణ కార్యక్రమం లేదా SDI అంటారు. దీన్నే స్టార్ వార్స్ అనే వారు. అణుదాడి నుంచి దేశాన్ని రక్షించుకోవడం ఎలా? అన్న ప్రశ్నలోంచి పుట్టుకొచ్చిందీ స్టార్ వార్స్. అయితే ఇది ఎంత వరకూ సాధ్యం అన్న చర్చోప చర్చలు అప్పట్లోనూ జరిగాయి.

SID ని స్టార్ వార్స్‌గా పిలిచిన నాటి మీడియా

ఇంతకీ ఈ వ్యూహాత్మక రక్షణ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏంటంటే, అణు మిస్సైళ్లను అంతరిక్షంలోనే నిరోధించే వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందించారు. SID దీని సాంకేతిక నామం కాగా.. మీడియా మాత్రం దీన్ని స్టార్ వార్స్ అని పిలవడం మొదలు పెట్టింది. ఎందుకంటే ఇది అంతరిక్షంలోని నక్షత్రాల మధ్య చేసే యుద్ధం కాబట్టి. 1983లో రీగన్ ఓవల్ ఆఫీసు నుంచి చేసిన ప్రసంగంలో వెలికి వచ్చిందీ కాన్సెప్ట్. అప్పట్లో కూడా అంతే.. ఈ కార్యక్రమం ప్రకటించిన వెంటనే దీని సాధ్యాసాధ్యాలు, ఖర్చు గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అప్పట్లో జరిగిన కోల్డ్ వార్ లో.. స్టార్ వార్స్ ఒక బిగ్ డిబేట్. దీంతో ఆనాటి సోవియట్ యూనియన్ తన రక్షణ వ్యయం పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ట్రంప్ సేమ్ థియరీని ఫాలో అవుతూ.. దానికి తనకు బాగా కలసి వచ్చే గోల్డ్ అనే పేరు తగలించి ఈ ప్రాజెక్ట్ తెరపైకి తెచ్చారు. దీంతో నాటి స్టార్ వార్స్ కాస్తా ప్రస్తుతం గోల్డెన్ డోమ్ గా రూపాంతరం చెందినట్టు కనిపిస్తోంది.

స్టార్ వార్స్‌కి కారణం రష్యా ఖండాంతర క్షిపణి వ్యవస్థ

ఆనాడు స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ గా పిలిచే ఈ వ్యవస్థ పుట్టుకకు కారణం రష్యా.. దాని ఖండాంతర క్షిపణి వ్యవస్థ. దీన్ని తిప్పి కొట్టడానికి గానూ రీగన్ ఒక ఊహాజనితమైన ఈ వ్యవస్థ ప్రతిపాదన చేశారు. దీంతో అప్పట్లోనే ఇదొక బాధ్యతా రాహిత్యంతో కూడిన సిస్టమ్ గా పలువురు తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదే ఇప్పుడు ట్రంప్.. చైనా, రష్యా ద్వారా ఏర్పడే క్షిపణి ముప్పు ను ఢీ కొట్టడానికి ఈ గోల్డెన్ డోమ్.. ని వెలుగులోకి తెచ్చారు. ఈ సిస్టమ్ ద్వారా అంతరిక్షం కూడా ఒక రణరంగం అయిపోతుందని నీతులు చెప్పే చైనా.. సైతం అంతరిక్ష కేంద్రంగా ఎన్నో ప్రయోగాలను చేసింది. ఒక రోజుల్లో చైనా నకిలీ చంద్రుడ్ని ఆకాశంలో సృష్టించి.. తద్వారా కరెంటు ఖర్చు తగ్గించాలని చూసింది.

గోల్డెన్ గ్లోబ్ స్టార్ వార్స్‌లా మరుగున పడుతుందా?

ఇక్కడ ప్రధాన చర్చనీయాంశం ఏంటంటే.. గోల్డెన్ గ్లోబ్ కూడా.. స్టార్ వార్స్ లా మరుగున పడుతుందా? లేక అమల్లోకి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. అప్పట్లో స్టార్ వార్స్ పెద్ద గొప్పగా వెలుగులోకి రాలేదు. తన గత పాలనా కాలంలో కూడా ట్రంప్ అంతరిక్ష దళ ప్రతిపాదన చేశారు. అది కూడా ఇంతవరకూ వీలు కాలేదు. మరి ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటి? ఇప్పటికే దీని బడ్జెట్ పై కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అభ్యంతరాలు తెలుపుతున్నవేళ సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కొన్ని కొన్ని భయాల కారణంగా వెలుగులోకి వచ్చే ప్రాజెక్టులు. ఇలాంటి డేంజరస్ ప్రాజెక్టులు అమలు కాకూడదంటే అది చైనా రష్యాలాంటి సాటి దేశాల రక్షణ విధానాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×