Trains Canceled: రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్ మరమ్మతులు, లోకో షెడ్యూలింగ్, అలాగే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మూడో లైన్ పనులు జరుగుతున్న తరుణంలో నేటి (మే 23) నుంచి 29 వరకు ఖమ్మం రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయని.. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ జాఫర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు.
రద్దు అయిన రైళ్లలో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్ రైళ్లు, కొన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఖాజీపేట్-కొండవల్లి రైల్వేస్టేషన్ల మధ్య పలు ట్రైన్లను తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. మరికొన్ని దారిమళ్లించనున్నారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని ప్రయాణికులకు తాత్కాలిక అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించి రైల్వే ప్రయాణికులు తమ రాకపోకలను సాగించాలని రైల్వే శాఖ సూచించింది. మరిన్ని వివరాలు.. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
రద్దు అయిన ట్రైన్ల వివరాలు ఇవే.. మే 23 నుంచి 29 వరకు..
⦿ డోర్నకల్-విజయవాడ(రైలు నం.67767)
⦿ విజయవాడ-డోర్నకల్(రైలు నం.67768)
⦿ విజయవాడ-భద్రాచలం రోడ్(రైలు నం.67215)
⦿ భద్రాచలం రోడ్-విజయవాడ(రైలు నం.67216)
⦿ గుంటూరు- సికింద్రబాద్(రైలు నం.12705)
⦿ సికింద్రాబాద్-గుంటూరు(రైలు నం.12706)
⦿ విజయవాడ- సికింద్రాబాద్(రైలు నం.12713)
⦿ సికింద్రబాద్- విజయవాడ(రైలు నం.12714)
⦿ మే 24- కొచ్చివెళ్లి-ఇండోర్(రైలు నం.22646)
⦿ 25-గాంధీధామ్-విశాఖపట్నం(రైలు నం.20804)
⦿ మే 26- ఇండోర్-కొచ్చివెల్లి(రైలు నం.22645)
⦿ మే 26-తిరువునంతపురం-కోర్బా(రైలు నం.22648)
⦿ మే 28-కోర్బా-తిరువనంతపురం(రైలు నం.22647)
⦿ 23,25-గోరఖ్ పూర్-కొచ్చివెల్లి(రైలు నం.12511)
⦿ 24-హిస్సార్-తిరుపతి(రైలు నం.04717)
⦿ 26-సికింద్రాబాద్-తిరుపతి(రైలు నం.07482)
⦿ 25, 27, 28- కొచ్చివెల్లి-గోరఖ్ పూర్(రైలు నం.12512)
⦿ 26-తిరుపతి-హిస్సార్(రైలు నం.04717)
⦿ 27, 28-విశాఖపట్నం-ఢిల్లీ(రైలు నం.20805)
⦿ 27, 28-ఢిల్లీ-విశాఖపట్నం(రైలు నం.20806)
పాక్షికంగా రద్దు అయిన రైళ్ల వివరాలు..
⦿ గుంటూరు-సికింద్రాబాద్(రైలు నం.17201) మే 23 నుంచి 29 వరకు
⦿ సికింద్రాబాద్-గుంటూరు(రైలు నం.17202)మే 23 నుంచి 28 వరకు
దారి మళ్లించిన ట్రైన్ల జాబితా..
దారిమళ్లింపు మార్గం: తెనాలి-గుంటూరు-పగిడిపల్లి-సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించిన రైళ్లు
⦿మే 28 (12522) ఎర్నాకులం-బరౌని
దారిమళ్లింపు మార్గం: విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి-చర్లపల్లి–అమ్ముగూడ
మే 28 (17207) షిర్డీ-మచిలీపట్నం
దారిమళ్లింపు మార్గం: అమ్మగూడ-చర్లపల్లి-పగిడిపల్లి-గుంటూరు-విజయవాడ
⦿మే28 (17206) కాకినాడ పోర్ట్-షిర్డీ
దారిమళ్లింపు మార్గం: విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి-చర్లపల్లి-అమ్ముగూడ
⦿ మే27 (17205) షిర్డీ-కాకినాడ పోర్ట్
దారిమళ్లింపు మార్గం: విజయవాడ-గుంటూరు-నల్గొండ-పగిడిపల్లి
⦿ మే 27, 28 (11020)-భువనేశ్వర్-ముంబై
దారిమళ్లింపు మార్గం: పగిడిపల్లి-నల్గొండ-గుంటూరు-విజయవాడ
⦿ మే27,28 (11019) ముంబై-భువనేశ్వర్
దారిమళ్లింపు మార్గం: సికింద్రాబాద్-పగిడిపల్లి-గుంటూరు-విజయవాడ
⦿ మే 28,29 (18046) హైదరాబాద్-షాలీమార్
దారిమళ్లింపు మార్గం: విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి-సికింద్రాబాద్
⦿ మే 27,28 (18045) షాలీమార్-హైదరాబాద్
రైలు టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు.. తాము ఎదుర్కొంటున్నసమస్యలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. “రాత్రి సమయానికి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తాం అనుకుని టికెట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు రైలు రద్దయ్యిందని ఎస్‌ఎంఎస్ వచ్చింది. అలాంటి సమయంలో మేము ఏం చేయాలి అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులకు సూచనలు:
ప్రయాణానికి ముందు మీ ట్రైన్ స్టేటస్‌ను IRCTC వెబ్‌సైట్ లేదా 139 హెల్ప్‌లైన్ ద్వారా నిర్ధారించుకోండి.
ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు గురించి ముందుగానే ప్రణాళిక రూపొందించండి.
అధికారిక సమాచారం కోసం South Central Railway వెబ్‌సైట్ ను సంప్రదించండి
ప్రయాణికులకు విజ్ఞప్తి: రద్దు అయిన రైళ్ల కారణంగా తలెత్తే ఇబ్బందులను కలగకుండా ఉండాలంటే.. ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. అత్యవసరమైన వారికి రైల్వే శాఖ తిరిగి ప్రయాణం చేసే అవకాశం కల్పించవచ్చు.