Bellamkonda Sreenivas : రీసెంట్ టైమ్స్ లో ఏం మాట్లాడినా కూడా అవి వైరల్ గా మారడం కామన్ అయిపోయింది. ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. చాలామంది స్టేజ్ పై కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత పర్సనల్ గా వీడియో పెట్టి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా వేదికల పైన కొన్నిసార్లు పొలిటికల్ డైలాగ్స్ మాట్లాడటం వలన సినిమా పై ఎఫెక్ట్ పడుతుంది. ఇక ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భైరవం. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈవెంట్లో దర్శకుడు ధర్మాన్ని కాపాడ్డానికి సరిగ్గా సంవత్సరం క్రితం ఒకరు వచ్చారు అంటూ మాట్లాడారు. అయితే అది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నారు అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ దర్శకుడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
పెళ్లిళ్లపై కామెంట్స్
ప్రతి సినిమా ప్రమోషన్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ జరగటం అనేది కామన్ గా జరుగుతుంది. ఇక ఈ ముగ్గురు యంగ్ హీరోలు కలిసి సుమాకు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి గురించి ప్రశ్న ఎదురైనప్పుడు అన్ని నాన్నగారు చూసుకుంటారు అని పక్క నుంచి దర్శకుడు మాట్లాడారు. ఆ తర్వాత పెళ్లి గురించి మరికొన్ని విషయాలు మంచి మనోజ్ తెలిపారు. ఈ తరుణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ కొందరు హీరోలు చూసి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి అని ఇన్స్పైర్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చాలా సరదాగా చెప్పిన కూడా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నారు అంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అనడం మొదలుపెట్టారు. మరి కొంతమంది మాత్రం చాలామంది సీనియర్ హీరోల పేర్లను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇక దీనిపై కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది.
కాంట్రవర్సీయల్ ప్రమోషన్
ఇక ఈ సినిమాకు సంబంధించి అనుకోకుండా కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. విజయ్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ కొంతమంది నినాదాలు మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా 2011లో పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ గురించి కూడా దర్శకుడుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది, దీని గురించి నిన్ననే విజయ్ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు పెళ్లిళ్లపై సాయి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read : Vijay Kanakamedala: మెగా అభిమానులకు సారీ చెప్పిన భైరవం దర్శకుడు