BigTV English

Joe Biden: బైడెన్ షాకింగ్ నిర్ణయం.! ప్రమాదంలో భారత్?

Joe Biden: బైడెన్ షాకింగ్ నిర్ణయం.! ప్రమాదంలో భారత్?

Joe Biden: మరో రెండు నెలల్లో అమెరికాలో అధికారం మారబోతోంది. ఇదే తరుణంలో మూడో ప్రపంచ యుద్ధానికి మార్గాలు పడుతున్నాయి. కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రాకముందే.. జో బైడెన్ తన ముద్రను ప్రపంచంపై వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ట్రంప్ ఆపేస్తానని హామీ ఇవ్వగా.. ఈ యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంగా మార్చడానికి బైడెన్ అడుగులేస్తున్నారు. అయితే, ఈ చర్య మూడో ప్రపంచ యుద్ధాన్ని ఖాయం చేస్తుందని రష్యా చెబుతోంది. ఇంతకీ, ఏం జరుగుతుంది..? బైడెన్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటీ..? దీనికి, రష్యా ఎలాంటి సమాధానం ఇవ్వనుంది..? ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందా..? వరల్డ్ వార్ తప్పదా..?


రష్యా బెదిరింపులను పక్కనపెట్టి బైడెన్ సంచలన నిర్ణయం

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారనుందా..? బైడెన్ వెళ్లబోతూ వెళ్లబోతూ.. ఆఖరి చిచ్చు రగిల్చారా..? అమెరికా ఒక్క డెసిషన్ ప్రపంచాన్ని బూడిద చేస్తుందా..? ఆగుతుందనకున్న యుద్ధం అంతానికి దారితీస్తుందా..? పరిస్థితులన్నీ చూస్తుంటే ప్రపంచ యుద్ధం తప్పదన్నట్లే కనిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో గద్దె దిగబోతున్న జో బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయం వరల్డ్ వార్ ఆందోళనను మరింత పెంచింది. ఒక వైపు ట్రంప్ యుద్ధాలను ఆపుతానంటూ అమెరికా ఎన్నికల్లో గెలిస్తే.. జో బైడెన్ మాత్రం దానికి భిన్నంగా అడుగేశారు.


ఎప్పటి నుండో అదిమి పెట్టిన ఆఖరి అస్త్రాన్ని సెండ్ ఆఫ్ బహుమతిగా ఉక్రెయిన్‌కు ఇచ్చి, పెద్ద బాంబ్ పేల్చారు. మరో రెండు నెలల్లో అధికార పీఠం దిగబోతున్న సమయంలో ప్రపంచానికి కూడా షాక్ ఇచ్చారు. అమెరికా పంపించిన కీలకమైన ఆయుధాలను స్వేఛ్చగా వినియోగించుకోవచ్చని ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చారు. నిన్నటి వరకూ ఈ ఆయుధాలను ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చే రష్యా దళాలపై దాడికి మాత్రమే వినియోగించాలి. కానీ, ఇప్పుడు డైరెక్ట్‌గా రష్యా లోపల దాడి చేయడానికి బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పటి నుండో వస్తున్న రష్యా బెదిరింపులను పక్కనపెట్టి మరీ బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఆఖరి అంకం స్టార్ట్ అయ్యేటట్లే ఉంది.

రష్యాకి సాయంగా 11 వేల మంది ఉత్తర కొరియా సైనికులు

ఇప్పుడు అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను రష్యా లోపల దాడి చేయడాననికి ఉక్రెయిన్ ఉపయోగించనుంది. ఈ అవకాశం కోసం ఉక్రెయిన్ ఎప్పటి నుండో అమెరికాను బతిమాలుతోంది. కాగా, మరో రెండు నెలల్లో అధికారం నుండి దిగుతున్న బైడెన్ దీనికి మొదటిసారి అనుమతి ఇచ్చారు. పశ్చిమ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రేనియన్ దళాలతో యుద్ధం చేయడానికి ఇటీవల ఉత్తర కొరియా 11 వేల మంది సైనికుల్ని పంపగా.. ఈ చర్యకు వ్యతిరేకంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితేఈ అడుగు, అమెరికా విధానంలో పెద్ద మార్పుకు సూచనగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత, ఉక్రెయిన్‌కు ఇచ్చే సహకారాన్ని పరిమితం చేస్తానని చెప్పారు. అలాగే, యుద్ధాన్ని కూడా ఆపడానికి చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. అయితే, దానికి భిన్నంగా బైడెన్ నిర్ణయం ఉంది. బైడెన్ అనుమతితో.. ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ అని పిలిచే లాంగ్-రేంజ్ మిస్సైల్స్‌తో రష్యాలో దాడి చేయడానికి ఉక్రెయిన్ సిద్ధమయ్యింది.

ఇకపై రాకెట్లే మాట్లాడతాయంటూ బాంబ్ పేల్చిన జెలన్స్కీ

అమెరికా ఇచ్చిన అనుమతి గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటి వరకూ స్పష్టంగా స్పందిచనప్పటికీ, నర్మ గర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆయుధాలను ఉపయోగించే విషయంలో ఆంక్షలను ఎత్తివేయడం కంటే రష్యన్లను తరిమి కొట్టడానికి ఉపయోగించే క్షిపణుల సంఖ్య చాలా ముఖ్యమైందంటూ వ్యాఖ్యానించారు. మీడియా కథనాల్లో ఉక్రెయిన్‌కు అనుమతి వచ్చిందంటూ చాలా మంది మాట్లాడుతున్నారనీ.. కానీ, కేవలం మాటలతో దెబ్బలు తగలవు. ఇకపై, రాకెట్లే మాట్లాడతాయి అంటూ పెద్ద బాంబ్ పేల్చారు.

Also Read: లక్షల కోట్ల ఆస్తిని వదిలేసిన ఇన్పోసిస్ వారసుడు.. ఎందుకో తెలుసా.?

నిజానికి, ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో రష్యా సరిహద్దు దాడిని ప్రారంభించిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యాలో యుఎస్ ఇచ్చిన ఆయుధాల వాడకంపై పరిమితులను సడలిస్తూ వచ్చారు. ఖార్కివ్‌ను రక్షించడంలో భాగంగా.. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ హిమార్స్‌ను ఉపయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చారు. ఈ రాకెట్లు దాదాపు 50 మైళ్ల పరిధిని ఛేదించే సామర్థ్యం గలవి. ఇవి సరిహద్దులో ఉన్న రష్యన్ దళాలపై నేరుగా దాడి చేయడానికి సహాయపడతాయి. అయితే, ఖార్కివ్ రక్షణ కోసం దాదాపు 190 మైళ్ల పరిధి ఉన్న లాంగ్ రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్‌ని ఉపయోగించడానికి అనుమతివ్వలేదు. తాజాగా దీన్ని కూడా అనుమతించడంపై రష్యా కన్నెర్ర చేస్తోంది.

పుతిన్ బెదిరిస్తున్నట్లు అణ్వాయుధ దాడి తప్పదనే సందేహం

బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధ గమనాన్ని మారుస్తుందని అంతా ఆందోళన చెందుతున్నారు.సరిహద్దులో ఉక్రెయిన్ ఈ క్షిపణులను ఉపయోగించడం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటి నుండో బెదిరిస్తున్నట్లు అణ్వాయుధ దాడి తప్పదేమో అనిపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్, దాని సంకీర్ణ భాగస్వాములైన నాటోపై పుతిన్ ​​ప్రతీకారం తీర్చుకునేలా ఈ చర్య ప్రేరేపిస్తుందని కొందరు యూఎస్ అధికారులు చెబుతున్నారు.

ఈ ఆగస్టులో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న రష్యన్ భూభాగం మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే లక్ష్యంతో కుర్స్క్‌లోని ఉక్రేనియన్ స్థావరాలపై ఉత్తర కొరియా దళాలతో కలిపి, 50 వేల మంది సైనికులతో రష్యా సైన్యం భారీ దాడిని ప్రారంభించింది. ఇప్పుడు, బైడెన్ నిర్ణయంతో.. ఉక్రేనియన్లు ఆర్మీ టాక్టికల్ మిస్సైల్స్ ఉపయోగించి, రష్యా, ఉత్తర కొరియా దళాలున్న కీలకమైన సైనిక స్థావరాలు, లాజిస్టిక్స్ నోడ్‌లు, మందుగుండు గిడ్డంగులు, రష్యాలోని ఆయుధ సరఫరా మార్గాలపై దాడి చేసే అవకాశం కనిపిస్తోంది.

లాంగ్ రేంజ్ మిస్సైళ్లకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన పెంటగాన్

2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి చేసినప్పటి నుండి ఉక్రెయిన్‌ లాంగ్-రేంజ్ టాక్టికల్ మిస్సైల్స్‌ను వాడాల వద్దా అనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయ్. ఉక్రెయిన్ అనుమతి అడుగుతుంటే అమెరికా దాటేస్తూ వచ్చింది. పెంటగాన్ అధికారులు కొందరు వాటిని ఉక్రేనియన్లకు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఈ క్షిపణులను ఉక్రేయిన్‌కు ఇస్తే పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తారని కొంతమంది వైట్ హౌస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

దీనికి ముందు, బ్రిటీష్, ఫ్రెంచ్ మిలిటరీలు ఉక్రేనియన్లకు పరిమిత సంఖ్యలో స్టార్మ్ షాడో, స్కాల్ప్ క్షిపణులను అందించాయి. అయితే, అమెరికన్ క్షిపణి వ్యవస్థ కంటే తక్కువగా వీటికి 155 మైళ్ల పరిధిని మాత్రమే ఉంది. ఇక, ఇప్పుడు బైడెన్ అనుమతించిన 190 మైళ్ల పరిథి గల లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో రష్యన్ గడ్డపై ఉక్రెయిన్ దాడి ఖాయమయ్యింది. అందుకే, ఇప్పుడు బైడెన్ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆందోళన గురిచేస్తుంది.

మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందన్న రష్యా

అమెరికా లాంగ్ రేంజ్ మిస్సైళ్లను అనుమతి ఇస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పుతిన్ ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు, ఇదే హెచ్చిరికను రష్యా చట్టసభ సభ్యులు చేస్తున్నారు. అమెరికా ఆయుధాలు రష్యాలోపల పడితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని రష్యా చట్టసభ సభ్యులు మరియా బుటినా తాజాగా వెల్లడించారు. “బైడెన్ అధికారం మరో రెండు నెలలు మాత్రమే ఉండగా యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని” బుటినా పేర్కొన్నారు.

అయితే, “ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలా జరగకపోతే.. ఈ యుద్ధం కచ్ఛితంగా మూడవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించే ప్రమాదం ఉందని” చెప్పారు. ఇక, ఇదే అంశాన్ని మరో రష్యా అధికారి వ్లాదిమిర్ జబరావ్ కూడా ఖరారు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం మొదలు కావడానికి ఇదొక పెద్ద అడుగంటూ హెచ్చరించారు. ఉక్రెయిన్ రాజ్యం అంతం అవ్వడానికి పాశ్చాత్యులు తీసుకున్న ఈ నిర్ణయమే కారణం అవుతుందని పేర్కొన్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×