Nindu Noorella Saavasam Serial Today Episode : గార్డెన్ లో ఉన్న యముడు ఉలిక్కిపడి లేస్తాడు. గుప్ప ఆశ్చర్యంగా ఏమైంది ప్రభు అని అడుగుతాడు. అటు గుప్త అంటాడు యముడు. గుప్త ఆకాశం వైపు చూసి అంటే అమావాస్య గడియలు ప్రారంభం అయ్యాయి. ప్రభు ఇంతకీ ఆ బాలికను ఎలా తీసుకెళ్లాలి అని గుప్త అడగ్గానే యముడు యమపాశం చూపిస్తాడు. అమావాస్య గడియలు ముగియక ముందే ఆ బాలికను తీసుకుని పోవాలి అని చెప్తాడు యముడు.
పిల్లలందరూ రూంలో మీటింగ్ పెట్టుకుంటారు. మిస్సమ్మను గుర్రుగా చూస్తుంది అంజు. ఇంతలో అమ్ము మనం అందరం ఇక్కడ ఎందుకు మీట్ అయ్యామో మీకు తెలుసు కదా..? అని అడుగుతుంది. మిస్సమ్మ తెలుసు..అంటుంది. అంజు పలకకుండా ఉండటంతో అమ్ము ఏంటి అంజు నీకు తెలుసా..? తెలియదా..? అని అడగ్గానే మిస్సమ్మ వెటకారంగా నవ్వుతూ.. ఏంటి అమ్ము.. అంజుకు ఒక్కసారి చెబితే ఎప్పుడైనా ఏదైనా అర్థం అయిందా..? అంటుంది. దీంతో అంజు అవును అమ్ము.. అమ్మ తెలివి లేని వాళ్లకు ఏదో పేరు పెట్టి పిలుస్తారు అని చెప్పేది. ఏం పేరు అది అని అడుగుతుంది.
కోడిబుర్ర అని అమ్ము చెప్పగానే ఆ అవును ఆ పేరు అనడమే తప్పా అలాంటి పర్సన్ ను ఇప్పుడే చూస్తున్నాను అంటుంది. దీంతో మిస్సమ్మ, అంజు మధ్య గొడవ జరగుతుంది. అమ్ము వాళ్లిద్దరిని ఓదార్చి మనం ఈ మీటింగ్ పెట్టుకుంది కాంప్రమైజ్ కావడానికే కానీ మళ్లీ గొడవలు పడటానికి కాదు అని చెప్తుంది. దీంతో అంజు కోపంగా నేను ఎప్పటికీ కాంప్రమైజ్ కాను కావాల్సిన అవసరం నాకు లేదు అంటుంది అంజు. దీంతో అంజు ఫైనల్ గా బాగా ఆలోచించుకుని చెప్పు నాతో నీకు ఏ అవసరం రాదా..? అసలు స్కూల్ విషయంలో కూడా రాదా? అని అడుగుతుంటే ఆనంద్, ఆకాష్ కూడా మిస్సమ్మ వైపు వస్తారు.
అంజు మాత్రం మాకు ఎవరి హెల్ఫ్ అవసరం లేదని చెప్తుంది. దీంతో మిస్సమ్మ అంజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆ మాట చెప్పు అనగానే అంజు తిరిగి చూస్తుంది. తన వెనక ఉండాల్సిన ఆనంద్, ఆకాష్ మిస్సమ్మ పక్కకు ఉంటారు. అంజు షాక్ అవుతుంది. వెంటనే అయినా సరే నాకు ఎవరి హెల్ఫ్ అవసరం లేదని చెప్తుంది. దీంతో మిస్సమ్మ నీ కాన్పిడెంట్ చూస్తుంటే నాకు ముద్దోస్తుంది అంజు అంటూ కిస్ చేసి వెళ్తుంది.
మిస్సమ్ పాలు తీసుకుని అమర్ రూంలోకి వెళ్తుంది. అమర్ సైలెంట్ గా చూస్తుంటే దిండు దుప్పటి తీసుకుని మిస్సమ్మ వెల్లబోతుంటే అమర్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు అందుకే నేను కింద పడుకుంటా..? మీరు పైన పడుకోండి అని చెప్తుంది మిస్సమ్మ. అవసరం లేదు. నువ్వే పైన పడుకో.. నేను కింద పడుకుంటాను అంటాడు అమర్. దీంతో మిస్సమ్మ అంటే మీకు నా ముఖం చూస్తేనే కోపం వస్తుంది కదా..? లెఫ్టినెంట్ గారు. నేను పైన పడుకున్నాను అనుకోండి ఆ కోపం ఇంకా పెరిగిపోతే.. అంటూ ప్రశ్నించడంతో…
అమర్ నిజంగానే కోపంతో ఏయ్ లూజ్.. పోనీలే పాపం కింద పడుకోవడానికి ఇబ్బంది పడతావని.. పైన పడుకోమని చెప్పాను కదా..? నాదే తప్పు. నువ్వు చెప్పిందే కరెక్టు నువ్వు పైన పడుకుంటే నాకు ఇబ్బంది. నువ్వు కిందే పడుకో అంటాడు. దీంతో మిస్సమ్మ అంత పాస్ట్ గా డిసిజన్ చేంజ్ చేసుకుంటే ఎలాగమ్మా.. నేను పైనే పడుకుంటా..? అంటుంది. అయితే సైలెంట్ గా వెళ్లి పడుకో అంటాడు. మిస్సమ్మ పడుకోవడానికి వెళ్తూ.. అమర్ చూసి ఎప్పుడూ ముఖం ఉమ్మని అలా పెట్టుకోకపోతే కొంచెం నవ్వొచ్చుగా.. అంటుంది. మిస్సమ్మ మాటలు వింటూనే అమర్ వెళ్లి లైట్ ఆఫ్ చేస్తాడు. దీంతో లైట్ ఆన్ చేయమని మిస్సమ్మ గొడవ పడుతుంది. వెల్లి లైట్ ఆన్ చేస్తుంది. ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలై రొమాన్స్ గా మారుతుంటే అమరే సరే నీ ఇష్టం అని లైట్ ఆన్ చేసి వెళ్లి పడుకుంటాడు.
ఆరు కోసం వెతుకుతున్న గుప్త, యముడు ఇంట్లోకి వెళ్తారు. ప్రభు తమరు ఇచ్చటనే వేచి ఉందురు. ఆ బాలిక ఎచ్చట ఉన్నదో నేను వెళ్లి వెతికెద అని గుప్త చెప్పగానే.. గుప్త ఆ బాలిక కచ్చితముగా ఈ గృహములోనే ఉన్నదని నీకు ఎలా తెలియును అని యముడు అడుగుతాడు. దీంతో గుప్త ప్రభు ఆ బాలిక తన కుటుంబమును విడిచి దూరంగా వెళ్లలేదు అని చెప్పి వెళ్లి ఇంట్లో అంతా వెతుకుతాడు. ఆరు మాత్రం అమర్ వాళ్ల బెడ్ రూంలో అమర్, మిస్సమ్మ ల మధ్య కూర్చుని ఉంటుంది. గుప్త ఎక్కడ లేదని చెప్పగానే యముడు గుప్త అమర్ బెడ్ రూంలోకి వెళ్తారు. అక్కడ ఆరు కూర్చుని ఉండటం చూసి అవాకవుతారు. గుప్త వెంటనే యమపాశం సంధించండి ప్రభు అని కోరగానే యముడు వద్దని ఏదైనా తప్పిదము జరిగితే ఆక్కడ ఉన్న ఇద్దరి ప్రాణాలు పోతాయని అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తనరూంలో కూర్చున్న మనోహరి కోపంగా ఘోరను తిట్టుకుంటూ.. ఆరును బంధించడం కాదు మిస్సమ్మను ఇంట్లోంచి వెల్లగొట్టేలా ప్లాన్ చేయాలి అనుకుంటుండగానే వెనక నుంచి ఎవరో వచ్చి సౌండ్ విని ఆరు వచ్చిందని మనోహరి భయపడిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.