Narayana Murthy’s son : భారత ఐటీ దిగ్గజాల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఈ సంస్థ నికర మార్కెట్ వ్యాల్యూ.. దాదాపు 7.5 లక్షల కోట్లు. ఇంత విలువైన కంపెనీని స్థాపించిన దిగ్గజ బిలియనీర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఈ మధ్య తరచు పని గంటల విషయమై మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తున్నారు నారాయణ మూర్తి. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వారానికి ఐదు రోజుల పని విధానానికి వ్యతిరేకమని చెబుతూ.. అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే చాలా మంది నారాయణ మూర్తి కొడుకు రోహన్ మూర్తి గురించి చర్చించుకుంటున్నారు. వేల కోట్ల సంస్థలున్నా.. వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నాక… ఇన్ఫోసిస్ సంస్థకు రాజీనామా చేశాడు. దాంతో.. ఎందుకు అతను రాజీనామా చేశాడని మాట్లాడుకుంటున్నారు. తండ్రి ఆలోచనల్లో ఇమడలేక వెళ్లాడని, సంస్థ విధానాలతో సరిపడక వెళ్లాడని మరికొందరు చర్చించుకుంటున్నారు. కానీ.. అసలు విషయమ మాత్రం వేరు అంటున్నారు. అదేంటో.. మీరు తెలుసుకొండి.
నారాయణ మూర్తి సంస్థ విజయంలో ఎంత ప్రముఖంగా పనిచేశారో.. సుధా మూర్తి కూడా అలానే కష్టపడ్డారు. వారి కష్టం ఫలితంగానే.. లక్షల కోట్ల సంస్థగా.. ఇన్ఫోసిస్ నిలిచింది. అలాంటి.. సంస్థకు వారసుడిగా రోహన్ మూర్తి ఎంట్రీ ఇచ్చాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. సంస్థలో చేరాడు. క్రమంగా.. సంస్థ ప్రయాణంలో కీలక స్థానానికి చేరుకున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు స్వీకరించాడు.
చిన్నప్పటి నుంచి తల్లి ఆలోచనలు, తండ్రి పట్టుదలను అలవరుచుకున్న రోహన్.. భద్రమైన జీవితాన్ని కోరుకోలేదు. సవాళ్ల ప్రపంచంలో తానూ ఓ కొత్త సవాళును తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. తండ్రి పరిచిన బాటలో కాకుండా.. సొంత సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే.. ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసి తనదైన కొత్త సంస్థను స్థాపించాడు.
దేశంలో కోట్ల మందికి తన ఆలోచనలు, మాటలతో ఉత్సాహం కలిగించే సుధామూర్తి.. తన కొడుకుపైనా ప్రభావం చూపింది. తల్లి పోత్సాహం, ఏదైనా చేయాలనే సంకల్పంతో.. సోరోకో అనే సంస్థను స్థాపించాడు. దాని బరువు బాధ్యతలు చూస్తూ..కుటుంబ వ్యాపారానికి దూరంగా ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే.. రోహన్ ఇన్ఫోసిస్ బాధ్యతల నుంచి తప్పించుకున్నాడని, తండ్రిలో సరిపడలేదంటూ కామెంట్లు చేస్తుంటారు.
భవిష్యత్ టెక్ ప్రపంచంలో రానున్న సాంకేతికతలపై పనిచేస్తున్న రోహన్ మూర్తి.. ఏఐ ఆధారిత ఆటోమేష్ లో ప్రత్యేకత కలిగిన డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, టాస్క్ మైనింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. రోహన్ మూర్తిపై అతని తల్లి సుధామూర్తి ప్రభావంతో పాటు.. కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రోఫిజిక్స్ ఫ్రొఫెసర్ శ్రీనివాస కులకర్ణి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. ఈయన.. రోహన్ కు బంధువు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం అలవాటైన రోహన్… సైన్స్ అండ్ ఇన్నోవేషన్ పై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుండే వాడు. అందుకే.. తన ఆలోచనలకు అనుగుణంగా తన చేతిలో లక్షల కోట్ల సంస్థ ఉన్నా.. సొంత సంస్థ వైపు అడుగులు వేశాడు.
రోహన్ స్కూల్ అభ్యాసం అంతా.. బెంగళూరులోనే సాగింది. అక్కడి బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్లో చదువుకున్న రోహన్.. తర్వాత ఆమెరికాకు వెళ్లాడు. ప్రముఖ కార్నెల్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అందుకున్న రోహన్.. అక్కడి ర్వర్డ్ యూనివర్శిటీ నుంచి పీహెచ్ డీ సంపాదించాడు. అక్కడి నుంచి నేరుగా ఇన్ఫోసిస్ లో చేరిన రోహన్.. క్రమంగా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నాడు.
Also Read : తనకు మంటలు అంటుకున్నా.. 10 మందికి పైగా పిల్లలను కాపాడిన నర్సు, ఆమె సాహసానికి సెల్యూట్!
ఇతని సోదరి.. అక్షతా మూర్తి సైతం ఇలాంటి ప్రత్యేకమైన అభిరుచి కలిగిన మహిళగానే గుర్తింపు పొందింది. ఆమె కూడా స్వతహాగా విభిన్న ప్రయోగాలు, లక్ష్యాల వైపు అడుగులు వేస్తుంది. అయితే..ఆమె తన భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన తర్వాత బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది.