Gundeninda GudiGantalu Today episode November 19 th: నిన్నటి ఎపిసోడ్ లో .. రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని దినేష్ చెప్పడంతో వాళ్ళ అమ్మ రోహిణికి ఫోన్లు చేస్తుంది.. నా టెన్షన్స్ నాకుంటే మధ్యలో ఈవిడ ఒకటని రోహిణి వాళ్ళ అమ్మని బ్లాక్ చేస్తుంది.. ఇక మనోజ్ ప్రభావతి రోహిణి దగ్గరకు వస్తారు. మీ నాన్నతో పండగ పూట కూడా మాట్లాడుకున్నా ఉంటే ఏం బాగుంటుంది అమ్మ ఒకసారి ఫోన్ చెయ్ అనగానే రోహిణి ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తుంది. ఏమైంది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆంటీ అంటే ఇంకా నాన్న రాలేదు అక్కడ సిగ్నల్స్ లేవు అని చెప్పాను కదా అనేసి అంటుంది. అవునా అమ్మ అయితే ఇంకొకసారి ఫోన్ చేస్తే మీ నాన్నని దీపాలు పండుగకి ఇక్కడికి రమ్మని చెప్పు ప్రభావతి అంటుంది. రోహిణి విద్యకు కాల్ చేసి మలేషియా డ్రామా మళ్ళీ మొదలైంది అని చెప్తుంది. నీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చెయ్యి పండగ అయిపోయేంతవరకు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి మా నాన్న చేశాడని మా నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఏదో ఒకటి చెప్పేస్తానని రోహిణి అంటుంది. ఇప్పటికైతే ఈ గండం నుంచి బయట పడాలని అనుకుంటుంది రోహిణి. బాలు తాగేసి ఇంటికి వస్తాడు. నా కారు పోయిందన్న విషయం నువ్వు అబద్ధం చెప్పావు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తావా అసలు అబద్ధాలు ఎందుకు చెప్పావు ఇంటి ఓనర్ కి నేను అసలు నిజం చెప్పాలి నాకు కారు సర్వీస్ కి ఇవ్వలేదు సేటు డబ్బులు కట్టలేదని తీసుకెళ్లాడని చెప్తానని అంటాడు. ఆ గొడవతో మీనా కుటుంబం మొత్తం బాధ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు ఉదయం లేవగానే పార్వతి సుమతి హాడావిడి చేస్తారు. బాబు లేచావా టీ ఇవ్వమంటావా అని టీ తీసుకొచ్చి ఇస్తారు. అత్తయ్య గారు నేను రాత్రి ఏమైనా తప్పుగా మాట్లాడానా అంటే ఏం మాట్లాడలేదు బాబు అని అంటాడు ఏం సుమతి నువ్వైనా చెప్పు అంటే లేదు బావ అదేం లేదు మీరేం తప్పుగా మాట్లాడలేదు అని. ఇక శివుని అడిగితే శివ కూడా మీరేం తప్పుగా మాట లేదు బావ అనేసి అబద్ధం చెప్తాడు. స్నానానికి వేడి నీళ్లు పెట్టాను బాబు మీరు స్నానం చేసి రండి మీకు టిఫిన్ చేసి పెడతానని పార్వతి అంటుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను అన్ని మీరే చేస్తున్నారు ఆ పూలకంప ఏది కనిపించలేదు పూలు కోసుకోడానికి వెళ్లిందా అనేసి అడుగుతాడు. దానికి లేదు బాబు మీరు రాత్రి అన్న మాటలకి బాధపడి మీ ఇంటికి వెళ్ళింది అనేసి అంటారు. నన్ను ఇక్కడ వదిలేసి మా ఇంటికి వెళ్లడమేంది ఎవరైనా అత్తింట్లో తిడితే పుట్టింటికి వెళతారు.. దానికి శివ కౌంటర్ ఇస్తాడు మీరు పుట్టింట్లో తిట్టారు కదా బావ అందుకే అత్తింటికి వెళ్లిందని చెప్తాడు..
నేను తప్పుగా ఏమైనా మాట్లాడానని బాలు అడుగుతాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు మీరేం అనలేదు బాబు అనేసి అంటారు. చూశారా నేను ఇక్కడ ఉంటే మీ అమ్మాయి ఎక్కడికెళ్ళింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తప్పు ఎవరిది అనేసి నన్ను ఊరికే మీరు అపార్థం చేసుకుంటున్నారు అనేసి బాలు అక్కడి నుంచి వెళ్లాలని అనుకుంటాడు మా ఇంట్లో ఏ కుంపటి పెట్టిందో మీ కూతురు వెళ్లి కనుక్కుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదని బాలు అనుకుంటాడు. మీరు లేచారని మీనా అక్కకు ఫోన్ చేసి చెప్పాను బావ మీరు వెళ్లొచ్చు ఏం కాదు అనేసి అంటుంది సుమతి. ఇక బాలు వెళ్లబోతుంటే శివను పార్వతి అది తీసుకచ్చి బావకి ఇవ్వు అనేసి అంటుంది. పండక్కు మీరు వచ్చారని మా తృప్తి కోసం ఈ ఉంగరం మీకు పెడుతున్నామని అంటుంది పార్వతి. మీరు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా అత్తయ్య గారు వద్దులేండి అనేసి అన్నా కూడా మా తృప్తి కోసం తీసుకోండి బాబు మీరు ఇంటికి వచ్చారు కాబట్టి ఏదో మాకు ఉన్నంతలో మేము తీసుకొచ్చాం అనేసి అంటుంది.
ఇక మీనా అత్తింటికి వెళ్ళగానే మౌనిక షాక్ అవుతుంది. నేను ఇంకా బెడ్ మీద పడుకున్నానా కలగంటున్నానా అనేసి అనగానే మీనా అండి నువ్వు లేచావు బ్రష్ చేస్తున్నావ్ నేను నీ ముందర ఉన్నాను అనేసి అంటుంది. దానికి అవునా ఎందుకు వదిన మీరు వచ్చారు ఏమైంది అన్న ఎక్కడ అనేసి అంటుంది. మౌనిక వాళ్ళ నాన్నను పిలుస్తుంది. ఏమైందమ్మా వచ్చావు వాడు ఎక్కడ అంటే మూల దగ్గర టీ తాగుతున్నాడు మామయ్య అనేసి అంటుంది మీనా. మీరు మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని మీ అబ్బాయి టెన్షన్ పడుతున్నాడు టైంకి మీరు మందులు వస్తున్నారా లేదా అనేసి టెన్షన్ పడుతుంటే మేము వచ్చేసాము మావయ్యని మీనా అబద్ధం చెప్తుంది.
పండగ పూట కూడా మీరు అక్కడ ప్రశాంతంగా లేకపోతే మాకు ఎలా ఉంటుంది మీరు రావడమే తప్పు మీ వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో అని మీనాను అంటాడు. ఇక ప్రభావతి మీనాను సూటి పోటీ మాటలతో ఇబ్బంది పెడుతుంది. పండగ పూట పని చేసుకోవాలని అనుకున్న వచ్చేసావు కదా ఇదంతా చెయ్యు అని అంటుంది. మౌనిక కౌంటర్ వేస్తుంది. ఇక అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. ఏమే నన్ను మీ పుట్టింట్లో పెట్టేసి నువ్వు ఇక్కడికి వస్తావా అని అడుగుతాడు. మీరు రాత్రి ఫుల్లుగా తాగేసి వాగిన విషయం అంతా మావయ్యకి చెప్పాను మీరన్న మాటలు మావయ్యతో అన్నాను ఓనర్ తో మీరు ఏం చేశారు ఎలాంటి మాటలు అన్నారు అవి కూడా మామయ్యతో చెప్పాననేసి మీనా చెప్తుంది. నాకు నా మొహం ఎలా చూపించాలి ఇంకా నువ్వు చెప్పినవన్నీ మా నాన్న వినే ఉంటాడు అని బాలు ఆలోచిస్తాడు. అప్పుడే బామ్మ ఇంటికి వస్తుంది. ఏమైందమ్మా వాటిని మీద అరుస్తున్నాడని మీనాను అడుగుతుంది. షీలా డార్లింగ్ అనగానే బాలును తిడుతుంది.. ఇంట్లోకి వెళ్ళగానే ప్రభావతి షాక్ అవుతుంది. ప్రభావతిని ఆమె తిడుతుంది. అందరికి పండగకు తలకు నూనె పెట్టుకొని స్నానం చెయ్యాలని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..