Big Stories

Dwarampudi Vs Kondababu: ఆ దెబ్బతో ద్వారంపూడి ఓటమి ఫిక్స్! సేనాని పంతం నెగ్గే!

Kakinada Assembly Constituency Dwarampudi Vs Kondababu: కాకినాడ కోట ఎవరికి కైవసం కాబోతుంది? సిటీ తన కోట అంటూ ద్వారంపూడి వేసుకున్న కంచెలు తెగబోతున్నాయా.. కొండబాబుకు ఆ కోటను ఓటర్లు కానుకగా ఇవ్వబోతున్నారా..? అసలు అక్కడ ఏం జరగబోతోంది? . కాకినాడ నగర నియోజకవర్గం లో 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, కూటమి టిడిపి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు మధ్య గట్టి పోటీ జరిగింది. ఎన్నికలు రోజు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5. 30 నుండి ఓటర్లు క్యూ లైన్లు లో బారులు తీరారు. ప్రచారంలో ద్వారంపూడిని ఒక రేంజ్లో టార్గెట్ చేసిన జనసేనాని.. ఆయన్ని ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితంలపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

కాకినాడ సిటీకి ఒక చారిత్రక నగరంగా పేరుంది. పెన్షనర్స్ పేరడైజ్‌గా కాకినాడని పిలుచుకుంటారు. అంటే వృద్దులకు స్వర్గసీమ లాంటిదన్నమాట. అటువంటి ప్రశాంత కాకినాడ గత కొన్ని సంవత్సరాలుగా భూ కబ్జాలు, సెటిల్మెంట్‌లు, గంజాయి విక్రయాలు, డ్రగ్స్ రవాణా, పోర్ట్ ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా, రౌడీయిజాలతో అల్లాడుతుంది. కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన నిధులు సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేశారని వైసీపీ పాలకులపై ఆరోపణలున్నాయి.

- Advertisement -

ప్రధానంగా 2019 లో వైసిపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సీబీసీఎన్సీ ఆస్తులు ఆక్రమణ కు గురి అవటంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి .. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు అయిన ద్వారంపూడి మాట వినాల్సిందే అన్నట్టు ఆయన పెత్తనం చెలాయించారు.అందుకే ద్వారంపూడికి వైసీపీ నేతలు సెకండ్ సిఎం అన్న ట్యాగ్ లైన్ తగిలించారు. పెద్దాపురంలో మైనింగ్ ఆరోపణలతో ద్వారంపూడి వివాదాల్లో కూరుకున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గం లో ద్వారంపూడి ముద్ర కనపడేది అని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా అంటుంటారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఒక మీడియా సమావేశం లో కొండబాబు నీ ఉద్దేశించి మీ జాతి అంత ఇంతే అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబుకు పార్టీలకు అతీతంగా మత్స్యకార నాయకులు అందరు మద్దతు తెలియజేశారు.

కొండబాబు నీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మత్స్యకారులు ద్వారంపూడి పై నిప్పులు చెరిగారు. యానాం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావు సైతం ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడ నియోజకవర్గం లో ఉన్న మత్స్యకారుల తో మల్లాడి కృష్ణారావు రహస్య సమావేశాలు నిర్వహించి ద్వారంపూడికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని కోరారు. దీంతో మత్స్యకారులు మూకుమ్మడిగా కూటమి వైపు నిలిచారంటున్నారు.

Also Read: బొబ్బిలి యుద్ధం తప్పదా? హిస్టరీ రిపీట్స్?

కాకినాడ మార్కెట్ లో ద్వారంపూడి అనుచరుల దందాలు, మామూళ్ల వసూలుతో విసిగి పోయిన వ్యాపారస్తులు ద్వారంపూడి నీ వ్యతిరేకంగా ఏకమయ్యారంట. కూటమి అభ్యర్థి కొండబాబుకు మద్దతు తెలియజేశారంట. మత్సకారుల లో ద్వారంపూడి పై నెలకొన్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు ఎన్నికలు ముందు ఓఎన్‌జీసీ తీరంలో చమురు నిక్షేపాలు గుర్తించిన నేపద్యంలో  తీర ప్రాంత మత్స్యకారులకు నష్ట పరిహారం ఇవ్వాలని హడావుడి చేసి.. ఓఎన్‌జీసీ కార్యాలయం వద్ద ద్వారంపూడి, కన్నబాబు, వంగా గీత లు ధర్నా నిర్వహించారు.

కాకినాడ నగర్ అభివృద్ది , స్మార్ట్ సిటీకి వచ్చిన నిధులు సక్రమంగా వినియోగించకపోవటం, వర్షాలకు రోడ్లు జలమయమవటం, నగర అభివృధి కుంటి నడకపై ప్రజల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. వైసీపీ కాపు నాయకులతో పవన్ కళ్యాణ్‌ని తిట్టించడంతో  కాపుల్లో ద్వారంపూడిపై వ్యతిరేకత పెరిగింది. ద్వారంపూడిపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, ఓడించాలని ఇచ్చిన పిలుపు నేపధ్యంలో  ప్రజలు, కాపు నాయకులు అందరు ఒకే విధమైన ఆలోచనతో ఎన్నికల్లో కూటమి వైపు నిలిచారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఈ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం కొండబాబు ను ఖచ్చితంగా విజయతీరాలకు చెరుస్తుందని, ద్వారంపూడి పై ఉన్న వ్యతిరేకతతో ఇటు మత్సకారుల అటు కాపు నాయకులు, వ్యాపారస్తులు అందరు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. కాకినాడ అర్బన్ లో ఉంటున్న వారికి కాకినాడ రూరల్ బీచ్ దగ్గర ఇంటి స్థలం పేరులో సెంటు భూమి మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వం  మెజార్టీ లబ్దిదారులు నగరం విడిచి వెళ్ళలేక.. పట్టాలు తీసుకున్నా అవి ఎందుకు పనికి రాని భూములు ఇచ్చారని పెదవి విరిచారు. ఏది ఏమైనా కాకినాడ నగర అభివృద్ధి విషయంలో , భూ కబ్జాలు అరికట్టడంలో ద్వారంపూడి విఫలం చెందారని అందుకే ఈసారి కూటమి అభ్యర్థి కొండబాబు గెలిచే అవకాశాలు ఉన్నట్లు పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. మరి కాకినాడ ప్రజలు ఈ కోట తాళాలు ఎవరికిచ్చారో? తెలుసుకోవాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News