BigTV English

Redmi A3x Launch: ఎవడ్రా వీడు.. రూ. 5వేలకే ఇన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్ లాంచ్ చేశాడు!

Redmi A3x Launch: ఎవడ్రా వీడు.. రూ. 5వేలకే ఇన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్ లాంచ్ చేశాడు!

Redmi A3x Launch: ప్రముఖ  చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రెడ్‌మీ తన సరికొత్త ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు రెడ్‌మీ ఎ3ఎక్స్‌గా తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో విడుదల చేసిన రెడ్‌మీ ఎ3 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా కంపెనీ ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఇది డిజైన్‌లో రెడ్‌మీ ఎ3ని పోలి ఉంటుంది. అయితే ఈ సరికొత్త ఫోన్ ప్రాసెసర్‌లో రెడ్‌మీ కొన్ని మార్పులు చేసింది. ఫోన్ ధర, స్పెసిఫికేషన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.


Redmi A3x ఫీచర్ల విషయానికి వస్తే డిజైన్ పరంగా Redmi A3x స్మార్ట్‌ఫోన్ రౌండ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్న గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. ఇది బ్లాక్, గ్రీన్ కలర్ మోడల్‌లపై గోల్డ్ రింగ్, వైట్ కలర్ మోడల్‌పై వెండి రింగ్ ఉంది. తాజా ఫోన్ Redmi A3x 6.71 అంగుళాల IPS LCD HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గించడానికి DC డిమ్మింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

Also Read: ఊరమాస్ డీల్.. సగం ధరకే సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. ఎక్కువసేపు ఉండదు!


భద్రత కోసం స్మార్ట్‌ఫోన్ ముందు, వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంది. కంపెనీ 3GB RAM+ 64GB స్టోరేజ్‌తో ఫోన్ వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TB వరకు పెంచుకోవచ్చరు. Redmi A3x ఫోన్‌లో కంపెనీ చేసిన అతిపెద్ద మార్పు దాని ప్రాసెసర్. Redmi స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G36 ప్రాసెసర్ స్థానంలో Unisoc T603 చిప్‌సెట్‌ని ఉపయోగించింది.

ఆప్టిక్స్ కోసం ఫోన్ 8MP డ్యూయల్ AI కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఫోన్ Android 14-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది.

Also Read: రూ. 9వేలకే నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూశారంటే కేకలే!

Redmi A3x స్మార్ట్‌ఫోన్ 3GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర $68 మరియు PKR 18,999 (సుమారు రూ. 5,647)కి సమానం. కంపెనీ ప్రస్తుతం ఈ ఫోన్‌ను పాకిస్థాన్‌లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ త్వరలో ఈ మిడ్‌రేంజ్ మోడల్‌ను భారతదేశం, యుఎఇలో కూడా పరిచయం చేయగలదని భావిస్తోంది.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×