BigTV English

Kangana Controversy Comments: కాంట్రవర్సీల కంగనా.. తొలి ప్రధానినే మార్చేసిందిగా.. ఈమెకా ఎంపీ సీటు..?

Kangana Controversy Comments: కాంట్రవర్సీల కంగనా.. తొలి ప్రధానినే మార్చేసిందిగా.. ఈమెకా ఎంపీ సీటు..?
Kangana Ranuat
Kangana Ranuat

Kangana Ranuat Controversy Comments on 1st Prime Minister of India: కంగనా రనౌత్‌.. కాంట్రవర్సీకి కేరాఫ్. తెలిసి చేస్తుందో.. తెలియక చేస్తుందో లేక తెలిసినా తెలియనట్టు చేస్తుందో. ఎలా చేసినా ఆమె చుట్టూ ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ. ఈసారి మన ఇండియా ఫస్ట్‌ ప్రైమ్‌ మినిస్టర్ ఎవరన్న విషయంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నేషనల్ వైడ్‌గా డిస్కషన్ జరుగుతోంది.


దేశానికి తొలి ప్రధాని ఎవరు అంటే.. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు జవహార్ లాల్‌ నెహ్రూ అని. కానీ ఇదే ప్రశ్నకు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. అని గుక్కతిప్పుకోకుండా చెప్పేసింది కంగనా. దీంతో ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారింది. ఇంత చిన్న క్వశ్చన్‌కు కంగనాకు ఆన్సర్ తెలీదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తికి బీజేపీ పిలిచి కండువా కప్పి.. హిమాచల్‌లోని మండి పార్లమెంట్‌ టికెట్ ఇప్పించిందా? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం కంగనా మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మామూలుగానే కంగనా కామెంట్స్‌పై నెటింట్లో చిచ్చు మొదలైంది. సమర్థిస్తూ కొందరు.. విమర్శిస్తూ మరికొందరు.. మాటల యుద్ధం చేసుకుంటున్నారు.


Also Read: సోమిరెడ్డి కాకాణికి కష్టమేనా?

అసలు ఆ వీడియోలో కంగనా ఏం మాట్లాడిందంటే.. “భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు.. తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లారు? దేశం కోసం పోరాడిన సుభాష్ చంద్రబోస్‌ను భారతదేశంలోకి అడుగుపెట్టనివ్వలేదు.” ఇవీ ఆమె చేసిన వ్యాఖ్యలు. దీంతో కంగనాకు మినిమమ్ కామన్‌సెన్స్‌ లేదంటూ.. ఈ నాలెడ్జ్‌తో ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తావ్ ? సినిమాలు చేసుకునేవారు పాలిటిక్స్‌లోకి వస్తే ఇలానే ఉంటుంది అంటూ.. ఇలా రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు అసలు ఇలాంటి వారంతా ఎక్కడ చదువుకున్నారు? కాస్తంత జనరల్ నాలెడ్జ్‌ పెంచుకోవాలంటూ కౌంటర్లు వేశారు.

అయితే వీటన్నింటిని గమనించినా కంగనా అస్సలే తగ్గేదేలే అంటున్నారు. తాను మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పు లేదంటున్నారు. దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారామె. అక్టోబరు 21, 1943లో నేతాజీ అని పిలవబడే ఫ్రీడమ్ ఫైటర్ సింగపూర్‌లో ఆజాద్ హిందు ప్రభుత్వాన్ని ప్రకటించాడు. ఈ దేశానికి ప్రధానిగా సుభాష్ చంద్రబోస్ తనకు తానే ప్రకటించుకున్నారు. ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిందంటూ తెలిపారు. సో టెక్నికల్‌గా నేతాజీనే ఫస్ట్‌ ప్రైమ్ మినిస్టర్ అని ఆమె డిక్లేర్ చేశారు.

సో కంగనా క్లారిటీ చూస్తుంటే.. ఆమె ఈ కాంట్రవర్సీని కావాలనే క్రియేట్ చేశారని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. మాములుగా రాజకీయాల్లోకి రాకముందు నుంచే రాజకీయాలు, రాజకీయ నేతలపై చేసే వ్యాఖ్యలతో నిత్యం న్యూస్‌లో ఉండేవారు కంగనా. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో ఆ డోస్‌ను కావాలనే పెంచుతున్నారని అర్థమవుతోంది.

Also Read: బాలయ్య అల్లుడికి జీవీఎల్ చెక్!

దీనికి బీజేపీ మద్ధతు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ నేతలు మాములుగానే పటేల్‌ను, నేతాజీని ఆకాశానికెత్తుతారు. నెహ్రూను డిగ్రేడ్ చేస్తుంటారు కదా… లెటెస్ట్‌గా బీజేపీ పెద్దలే నెహ్రూ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఇప్పుడా లిస్ట్‌లో ఆఫిషియల్‌గా చేరిపోయారు కంగనా.. సోషల్ మీడియాలో కూడా కంగనాకు బీజేపీ నుంచి బాగానే మద్ధతు వచ్చినట్టు కనిపిస్తోంది.

నిజానికి కంగనా చెప్పిన విషయాలు నిజాలే. నేతాజీ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నిజమే. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజా ప్రభుత్వంలో ఎవరు ప్రధాని అవుతారో.. వాళ్లనే మనం ప్రధాని అంటాం కదా. మరి కంగనా ఈ లాజిక్‌ను ఎలా మిస్ అయ్యారు. కానీ ఇదంతా కంగనాకు అనవసరం. ఆమెకు కావల్సింది బీజేపీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం. చర్చకు పెట్టడం.. తనకు తాను ప్రచారం చేసుకోవడం. తను అదే చేసింది.. సక్సెస్ అయ్యింది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×