BigTV English

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Amit Shah: సాయుధ పోరాటమే లక్ష్యం.. తుపాకీ ద్వారానే రాజ్యాధికారం.. ఇవీ మావోయిస్టుల మెయిన్ డైలాగ్ లు. అయితే మారుతున్న పరిస్థితులు.. చేజారిపోతున్న క్యాడర్.. లొంగిపోతున్న మావోలతో కథ టోటల్ గా మారిపోతోంది. అసలు బలగాలతో పోరాటం చేయలేని పరిస్థితి. అడవుల్లో స్థావరాలు లేని సిచ్యువేషన్. వరుసగా అగ్రనేతల ఎన్ కౌంటర్లు.. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్.. ఇవన్నీ మావోయిస్టులను కంగారెత్తిస్తున్నాయి. అందుకే కాల్పుల విరమణ పాటిద్దాం.. చర్చలకు సిద్ధం అని చెప్పడం సంచలనంగా మారింది. ఇది మావోయిస్టుల మరో వ్యూహమేనా?


ఇకపై ప్రజాపోరాటాల్లో పాల్గొంటామన్న మావోలు

మావోయిస్టు పార్టీ తీసుకున్న సంచలన నిర్ణయం చుట్టూ పెద్ద కథే నడుస్తోంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రజా పోరాటాల్లో పాల్గొంటామనడం వెనుక ఏం జరిగిందన్నదే కీలకం. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో లేటెస్ట్ గా ఒక ప్రకటన రిలీజ్ అయింది. అభయ్‌ పేరుతో చలామణి అవుతున్న కిషన్‌ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్‌ ఫోటోను తాజా స్టేట్ మెంట్లో ప్రింట్ చేశారు. అంతే కాదు ప్రజాభిప్రాయాలు పంచుకునేందుకు ఫేస్ బుక్, ఈ మెయిల్ ఐడీలను జత చేశారు. నిజానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాల్లేవు. కానీ ఇది నిజమే అంటున్నారు.


నెల రోజుల తర్వాత బయటికొచ్చిన స్టేట్మెంట్

ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ స్టేట్ మెంట్ నెల రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 16న రాత్రి వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చకు సిద్ధమే అన్న సంకేతాలు పంపారు. ఈఏడాది మార్చి నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వంతో శాంతిచర్చలకు నిజాయతీగా ప్రయత్నిస్తోందని, మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌ పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా రియాక్ట్ కాలేదు. ఒకవైపు తుపాకులు చేతబట్టి ఇంకోవైపు చర్చలు అంటే ఎలా అని క్వశ్చన్ కూడా చేశారు. వీటికి తోడు 2024 జనవరి నుంచి బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేయించి దొరికితే ఎన్ కౌంటర్ అన్నట్లుగా వ్యవహారం నడిపిస్తోంది. చాలా మంది ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. ఇందులో పార్టీ అగ్రనేతల నుంచి కామన్ మావోయిస్టుల దాకా ఉన్నారు. మే 21న గుండెకోట్‌ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధానకార్యదర్శి బస్వరాజ్‌తో పాటు 28 మంది చనిపోయారు.

ఆపరేషన్ కగార్‌ను స్పీడప్ చేసిన కేంద్రం

పైగా కేంద్రం ఆపరేషన్ కగార్ ను స్పీడప్ చేసింది. 2026 మార్చి నాటికి మావోయిస్టుల అంతమే పంతంగా ముందుకెళ్తోంది. మొన్నటికి మొన్న కర్రెగుట్టల్ని జల్లెడ పట్టి కథ ముగించారు. ఇంకా కూంబింగ్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లు ఇలా అన్ని చోట్లా గాలింపు పెరగడంతో మావోయిస్టులకు షెల్టర్ కరువైంది. దీంతో బస్వరాజ్‌ ఆలోచనలకు తగ్గట్లుగా శాంతిచర్చలను ముందుకు తీసుకెళ్లాలని తాము నిర్ణయించుకున్నామంటోంది మావోయిస్టు పార్టీ. ఆయుధాలు విదలి జనజీవన స్రవంతిలో కలవాలన్న ప్రధాని సూచనతో తాము వెపన్స్ వదిలేయాలని డిసైడ్ చేసుకున్నామంటున్నారు. హోంమంత్రి లేదంటే ఆయన ప్రతినిధి ఎవర్ని నియమించినా చర్చలకు సిద్ధమంటున్నారు. అయితే తమ అభిప్రాయం చెప్పడానికి తమ ఇతర సహచరులు, అలాగే జైళ్లలో ఉన్న మావోయిస్టు నేతలను సంప్రదించి నిర్ణయం ప్రకటిస్తామని, ఇందుకోసం నెల రోజుల టైం ఇవ్వాలన్నారు. ఆ లోపు కూంబింగ్ వద్దు.. బలగాల కాల్పులు వద్దు అని కోరుకుంటున్నారు. చర్చల విషయంలో ప్రభుత్వంతో వీడియోకాల్‌ ద్వారానైనా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి రెడీ అంటున్నారు. సో ఇప్పుడు అసలు గేమ్ షురూ కాబోతోంది. 2026 మార్చి నాటికి మావోయిస్టుల్ని నామరూపాల్లేకుండా చేయాలని, పూర్తిగా రెడ్ కారిడార్ అన్నదే లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉంది. అయితే మావోయిస్టులను లొంగిపోయేలా చేయడం, లేదంటే ఎన్ కౌంటర్లలో హతమార్చడం ఈ రెండే టార్గెట్. మధ్యలో చర్చలకు తావు లేదని కేంద్రం అంటోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది కీలకంగా మారింది.

మావోయిస్టుల్లో ఇప్పుడు అగ్రనేతలంతా చాలా వరకు ఎన్ కౌంటర్ అయ్యారు. కొందరే మిగిలారు. అందులో చాలా మంది లొంగిపోవడానికి రెడీగా లేరు. చావో రేవో అంటున్నారు. అటు మరికొందరు కగార్ తో ఏ ఒక్కరు కూడా బతికే పరిస్థితి లేదంటున్నారు. అందుకే ఆయుధాలు వదిలి చర్చలకు ప్రయత్నిద్దామని చెప్పి ఇలా లేఖ రిలీజ్ చేశారా? అసలు ఈ లేఖ నిజమా కాదా అన్నది కూడా మరో డౌట్ గా మారింది. మరిప్పుడు గేమ్ ఎలా మారబోతోంది?

జనంలోనే ఉండి పోరాటాలు చేస్తారా?

కేంద్ర ప్రభుత్వం అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సామాన్యులకు ఇబ్బందులు వస్తున్నాయని, కోవర్టులని, మరొకటని సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో ఏ ప్రజల కోసమైతే అడవుల బాట పట్టారో ఇప్పుడు జనంలోనే ఉండి ప్రజాపోరాటాలు చేయాలన్న నిర్ణయానికి మావోలు వచ్చారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ మావోయిస్టులు నిజంగానే తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలోకి వస్తే వెనుకబడిన ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందంటున్నారు. నిజానికి కేంద్రం ప్రభుత్వం మావోయిస్టులతో అసలు చర్చలే లేవంటోంది. అయితే లొంగిపోవడం, లేదంటే ఎన్ కౌంటర్ అవడం రెండే ఆప్షన్లు ఇచ్చింది. సో నెల రోజులు కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అన్నది కూడా పెద్ద డౌటే. తెలంగాణ, ఏపీ, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర ఇలా రెడ్ కారిడార్ ఏరియాల్లో అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా వచ్చి డీజీపీలు, ఐజీలు ఇలా పోలీస్ ఆఫీసర్ల ముందు లొంగిపోతున్నారు. ఇటీవలే తెలంగాణలో డీజీపీ ముందు సుజాతక్క సరెండర్ అయ్యారు.

మావోలకు బలగాలపై తిరగబడే పరిస్థితి ఉందా?

సో కేంద్ర ప్రభుత్వం సిగ్నల్స్ ప్రకారం చూస్తే మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వదులుకోవడమే మార్గంగా కనిపిస్తోంది. బలగాలపై తిరగబడే పరిస్థితి అసలే లేదు. సామాజిక సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా పోరాటాలే చేయడం మార్గం ఉంది. సో ఫైనల్ గా మావోయిస్టు ఉద్యమంలో బిగ్ ట్విస్ట్ వచ్చినట్లైంది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో కథ మారిపోతోంది. పెద్ద ఎత్తున సరెండర్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 600 మంది వరకు మావోయిస్టులు అరెస్ట్ అవడం లేదంటే లొంగిపోవడం జరిగాయి. గత 16 నెలల్లో 1600 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ పూర్తి సరెండర్‌కు రెడీ అని ప్రకటించడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది 192 మంది ఎన్ కౌంటర్ అయ్యారు. గత 9 నెలల్లో 210 మంది, గత 15 నెలల్లో 400 మంది హతమయ్యారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే సైనిక బలగాలు డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లక్ష మంది పారా-మిలిటరీ బలగాలతో హైటెక్ ఆపరేషన్లు చేస్తున్నాయి. దీంతో మావోయిస్టులు ఎక్కడా తలదాచుకోలేపోతున్నారు. వారి జాడను ఈజీగా పసిగట్టేస్తున్నాయి. దొరికినవారిని పట్టుకుంటున్నారు. పారిపోయిన వారిని కాల్చేస్తున్నారు. 606 ఆయుధాలు, 916 IEDలు స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 31 మంది హతం

2025 మేలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. సో ఇప్పుడు కాల్పుల విరమణ, అలాగే చర్చలు అంటూ మావోలు ప్రతిపాదన పెట్టడం వెనుక భారీ వ్యూహమే ఉందంటున్నారు. ఒక నెల రోజులు ఆపరేషన్ కగార్ ఆగితే.. రీ గ్రూప్ అవ్వొచ్చని, బలపడేలా రిక్రూట్ చేసుకోవడం, అడవుల్లో కాకుండా జనంలో కలిసి తిరగడం ఇలాంటి నయా స్ట్రాటజీల కోసం వ్యవహారం నడుపుతున్నారా అన్నది కూడా డౌట్ ఫుల్ గా మారుతోంది. మరోవైపు కాల్పుల విరమణ అన్నది కరెక్ట్ కాదని, షరతులతో చర్చలు అంటే కుదరని పని అని చత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అంటున్నారు. ఫైనల్ గా భారత రాజ్యాంగాన్ని అంగీకరించి సరెండర్ అవుతామంటే వెల్కమ్ అంటున్నారు.

మరోవైపు 2026 మార్చి నాటికి మావోయిస్ట్ ఫ్రీ ఇండియా అని హోంమంత్రి అమిత్ షా పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. చెప్పాలంటే మావోయిస్టుల విషయంలో కేంద్రం జీలో టాలరెన్స్ తో ఉంది. మొత్తంగా మావోయిస్టులను క్లియర్ చేయాలనుకుంటోంది. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం 40 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 18 జిల్లాలకు తగ్గింది. అగ్రనాయకత్వం ఎన్ కౌంటర్ అయింది. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు మావోలతో చర్చలు జరిగాయి. అయితే అవి విఫలమయ్యాయి. ఆ టైంలో మావోయిస్టులు అఫీషియల్ గా రీగ్రూప్ అయ్యారు. దీంతో కేంద్రం చర్చలకు నో అన్న పాలసీతో ఉంది. సో రెడ్ కారిడార్ అంటే ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలోని అడవి ప్రాంతాల్లో ఇక వైట్ ఫ్లాగ్ ఎగరేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎండ్‌గేమ్‌కు టైం చాలా దగ్గర పడింది.

Story By Vidya Sagar, Bigtv

Related News

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×