Telangana Sports: సీఎం రేవంత్ రెడ్డిది యంగ్ ఇండియా విజన్. డ్రగ్స్ వద్దు, మద్యం వద్దు.. స్పోర్ట్స్ ముద్దు అంటూ.. అందరినీ గ్రౌండ్ వైపు నడిపిస్తున్నారు. SAY YES TO SPORTS ఇదీ సర్కార్ లక్ష్యం. ఆ దిశగానే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ని ఆవిష్కరించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. మన దగ్గర ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అసలు స్పీర్ట్స్ ను లెక్కే చేయలేని పరిస్థితి నుంచి ఇప్పుడు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్ ఉంటుందన్న దిశగా యువతను నడిపిస్తున్నారు.
స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం పెంచిన ప్రభుత్వం
తెలంగాణను దేశంలోనే స్పోర్ట్స్ హబ్ గా మార్చాలి.. యంగ్ ఇండియా విజన్ ను ముందుకు తీసుకెళ్లాలి.. ఇదీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి తీసుకున్న సంకల్పం.
ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన క్రీడా రంగాన్ని పట్టాలెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ అంటే గతంలో చాలా లైట్ తీసుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు దాన్నే ప్రాధాన్యం అంశంగా ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే దాకా మధ్యలో చాలా జరిగాయి. యువతకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. వారు చెడు అలవాట్లవైపు మళ్లకుండా అందరినీ గ్రౌండ్ వైపు నడిపించే పని స్పీడప్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. యూత్ కు ఇన్ స్పిరేషన్ గా ఉండేలా విజయాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. భుజం తడుతున్నారు. స్పెషల్ కోచ్ లను రంగంలోకి దింపుతున్నారు. ఒలింపిక్ మెడల్స్ మనకు ఎందుకు రావు అన్న ప్రశ్నల నుంచి సమాధానాలు రాబట్టే పని చేస్తున్నారు సీఎం రేవంత్.
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025కి శ్రీకారం
స్పోర్ట్స్ అంటే కేవలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పించి వదిలేయకుండా, గ్రామీణ పట్టణాల మధ్య అంతరం తగ్గించి, యువతను ఒలింపిక్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా స్పోర్ట్స్ పాలసీ ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 2న హైదరాబాద్ HICCలో జరిగిన మొదటి తెలంగాణ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌లో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025 కి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. 2023-24లో 221 కోట్ల నుంచి 2025-26లో 465 కోట్లకు స్పోర్ట్స్ బడ్జెట్ పెంచారు. ఇది బీఆర్ఎస్ హయాం కంటే చాలా ఎక్కువ. గ్రాస్‌రూట్స్ నుంచి గ్లోబల్ అన్న థీమ్ తో స్పోర్ట్స్ బడ్జెట్ పెంచుతున్నారు.
స్పోర్ట్స్ హబ్ బోర్డులో హేమాహేమీలు
ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలతో 20 నెలల్లో స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లు, మారథాన్ లు అలాగే ఇతర స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్య పెరిగింది. గ్రామీణ యువతకూ అవకాశాలు పెరుగుతున్నాయి. క్రీడా అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ హబ్ బోర్డులో కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, పుల్లెల గోపిచంద్, భాటియా వాంటి దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించిన క్రీడాకారుల్ని సభ్యులుగా చేశారు. ఈ బోర్డు 3 ఏళ్లలో లక్ష్యాలను సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో సాధ్యమవుతోంది. తెలంగాణ యువతను స్పోర్ట్స్ లో టాప్ లో నిలిపేలా పనులు చేయిస్తున్నారు.
ప్రతి జిల్లాలో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సెంటర్లు
గ్రాస్‌రూట్స్ నుంచి గ్లోబల్ స్థాయి వరకు స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం, ప్రతి జిల్లాలో వరల్డ్-క్లాస్ ట్రైనింగ్ సెంటర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం, ప్రోత్సాహకాలు అందించడం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్శిటీతో స్పీడ్ పెంచడం, సౌత్ కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని రోల్ మోడల్‌గా తీసుకుని మనవాళ్లు ఒలింపిక్ మెడల్స్ సాధించేలా ట్రైనింగ్ ఇవ్వడం, ముచెర్లలో BCCI తో కలిసి వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం నిర్మాణం, గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్‌ను అందుబాటులోకి తీసుకురావడం, జిల్లా స్థాయి అకాడమీలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు ఇవన్నీ చకచకా జరుగుతున్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకూ సిద్ధమంటున్నారు. ఎందుకంటే యూత్ మైండ్ సెట్ స్పోర్ట్స్ వైపు మళ్లుతుంది కాబట్టి. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఆలోచన యువత కోసమే. మహ్మద్ సిరాజ్‌కు గ్రూప్-1 పోస్ట్ ఇచ్చారు. బాక్సర్ నిఖత్ జరీన్‌కు 2 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇలాంటివెన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న చాలా ప్రాజెక్టులు
గత ప్రభుత్వ హయాంలో క్రీడా రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు అవినీతి ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్నాయి. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీలో నిధుల దుర్వినియోగం, క్రీడా మైదానాల నిర్మాణం, నిర్వహణలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవకతవకలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. నిధులు పక్కదారి పట్టడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు హెచ్‌సీఏ ప్రతిష్ఠను దిగజార్చాయి. క్రీడా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 2014 – 2023 మధ్య ఎస్ఏటీజీ ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయని విమర్శలు వినిపించాయి. ఇప్పుడవేవీ లేవు. ప్రతి పైసా గ్రౌండ్ కు చేరాల్సిందే. క్రీడాకారుల ట్రైనింగ్ కు ఉపయోగపడాల్సిందే. ప్రతి క్రీడాకారుడిలో ప్రతిభను మరింతగా సానబట్టి విశ్వ వేదికపై మనవాళ్లు దేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసేలా వారికి అవసరమైన వసతులు, ప్రోత్సాహకాలు కల్పించేందుకు క్రీడా పాలసీని రెడీ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్శిటీకి శ్రీకారం, అలాగే గత పాఠాల నుంచి మార్పు తీసుకురావడం, స్పోర్ట్స్ మార్క్ చూపేలా కథ నడుస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడా పాలసీని ప్రకటిస్తామని చెప్పిన విధంగానే ఆవిష్కరించింది. గ్రామీణ స్థాయిలోని క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం, ప్రతి మండలంలో స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఏర్పాటు, అర్బన్ ఏరియాల్లోనూ మినీ స్టేడియాలను నిర్మించేందుకు సిద్ధమైంది. అందులో క్రీడాకారులకు కావల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించాలనుకుంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించింది. 2024 – 2025, 2025 – 26 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 830 కోట్లు కేటాయించింది. క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి, మౌలిక సదుపాయాలు కల్పించి, ఒలింపిక్‌లకు సిద్ధం చేయడం వంటి లక్ష్యాలతో పనులు సాగుతున్నాయి. ప్రధానంగా క్రీడా ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, టాలెంట్ ఐడెంటిఫికేషన్, చీఫ్ మినిస్టర్స్ కప్, సమ్మర్ క్యాంప్స్ వంటివి ఇప్పటికే చేశారు. మనవాళ్లను 2036 ఒలింపిక్స్‌కు రెడీ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Also Read: రాష్ట్రంలో మరో వారం రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలెర్ట్..!
స్పోర్ట్స్ పాలసీలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది. తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటు, ప్రభుత్వ గ్రాంట్లు, సీఎస్ఆర్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా సేకరణ చేపడుతున్నారు. అన్ని క్రీడా సంఘాల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ క్యాలెండర్ అమలు చేస్తోంది. ఫిజియోథెరపీ, ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. స్టేడియాల్లో కోచ్‌లు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినట్లు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రెడీ చేసింది. హకీంపేట్‌లో 200 ఎకరాల్లో 2025లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీతో వరల్డ్ క్లాస్ అథ్లెట్లను తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో చేర్చనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, ఓయూలోని వెలో డ్రోమ్ ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియాలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి స్పోర్ట్ హబ్‌గా మార్చబోతున్నారు.
ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధిస్తే రూ.6 కోట్లు నజరానా ప్రకటన
ప్రభుత్వం రూపొందించిన నూతన క్రీడా పాలసీలో 5 ప్రధాన అంశాలు ఉన్నాయి. క్రీడా విధాన నిర్వహణ, క్రీడా రంగంపై సానుకూలత పెంచడం, క్రీడాభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక విధానాల రూపకల్పన, స్పోర్ట్స్ అభివృద్ధికి అవసరమైన గ్రౌండ్స్ అభివృద్ధి, క్రీడాకారుల నైపుణ్యాలు పెంచేలా చర్యలు చేపడుతున్నారు. క్రీడాకారులు, పారా క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఒలింపిక్స్/పారాలింపిక్స్ గోల్డ్ సాధించిన 6 కోట్లు, సిల్వర్ మెడల్ పొందిన వారికి 4 కోట్లు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 2.5 కోట్లు, ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు 15 లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మరోవైపు, కోచ్‌లకు గుర్తింపు, భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. క్రీడాకారుల విజయాల్లో పాత్ర వహించిన కోచ్‌ల ప్రతిభకు గుర్తింపుతో పాటు భరోసా, ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. లాంగ్ టర్మ్ అథ్లెట్ డెవలప్ మెంట్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, గ్రామీణ స్థాయిలో స్పోర్ట్స్ నిర్వహణకు ప్రోత్సాహం, సీఎం కప్‌లో ప్రతిభ కనబరిచినవారికి అత్యుత్తమ శిక్షణ, స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
సీఎం కప్ ద్వారా గ్రామీణ ప్రతిభ గుర్తింపు
గతంలో నిర్వహించిన చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 ద్వారా 33 జిల్లాల్లో గ్రామీణ ప్రతిభను గుర్తించారు. 641 సెంటర్లలో ఈ ఏడాది సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేశారు. గతేడాది డిసెంబర్ లో 57 ఏళ్ల తర్వాత సంతోష్ ట్రోఫీ ఫైనల్స్ హైదరాబాద్‌లో జరిగాయి. అలాగే, 4వ KIO నేషనల్ కరాటే చాంపియాయన్‌షిప్, ఒలింపిక్ డే రన్ వంటి ఈవెంట్లు యువ క్రీడాకారులకు వేదిక అయ్యాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ కు ఇంపార్టెన్స్ పెంచి నిధులు ఇస్తోంది. అవి సక్రమంగా, పారదర్శకంగా క్రీడాకారులకు, క్రీడా సౌకర్యాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోని తప్పులు రిపీట్ కాకుండా, స్కాంలకు తావు లేకుండా పకడ్బందీగా వ్యవహారం సాగుతోంది.
Story By Vidya Sagar, Bigtv