YCP Digital Book: వైఎస్ జగన్ ప్లాన్ ఛేంజ్ చేశారు. మొన్నటిదాకా బ్లూబుక్ అన్నారు. ఇప్పుడు డిజిటల్ బుక్ కు షిఫ్ట్ అయ్యారు. కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని ఫోటోలు, వీడియోలు, ఎవిడెన్సులతో అప్ లోడ్ చేయొచ్చన్నారు. ఇక కూటమి ప్రభుత్వానికి సినిమానే అంటున్నారు. రెయిజ్ యువర్ ఇష్యూ, రిక్లెయిమ్ యువర్ రైట్ అన్నారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్న సరే చట్టం ముందు నిలబెడుతామన్నారు. ఏంటి డిజిటల్ బుక్. యాక్షన్ ప్లాన్ మారిందా?
డిజిటల్ బుక్ లాంఛ్ చేసిన జగన్
వచ్చేసింది వైఎస్ జగన్ డిజిటల్ బుక్.. మొన్నటి బ్లూ బుక్ నుంచి ఇప్పుడు డిజిటల్ బుక్ అంటూ కథ నడుస్తోంది. అసలు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, రెడ్ బుక్ తప్పు అని వాదిస్తున్న వైసీపీ.. ఇప్పుడు డిజిటల్ బుక్ తప్పు కాదు అని చెప్పే పరిస్థితి ఉందా.. ఏంటి వైసీపీ లాజిక్ మిస్ అవుతోందనుకుంటున్నారా.. అలాంటి వాతావరణమే కనిపిస్తోంది.
బ్లూ బుక్ కాస్తా డిజిటలర్ బుక్‌గా మార్పు
జగన్ 2.0 ప్రభుత్వం ఇంతకు ముందులా కాదు.. ఇబ్బంది పెట్టిన వారిని.. అన్యాయంగా వ్యవహరించినవారిని వదిలేది లేదని పలు సందర్భాల్లో వార్నింగ్ ఇస్తూ వచ్చారు వైఎస్ జగన్. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ తీసుకొచ్చిన రెడ్ బుక్ కు పోటీగా.. బ్లూ బుక్ తీసుకొస్తామన్నారు. ఇప్పుడు అది కాస్తా డిజిటల్ బుక్ గా మారిపోయింది. సెప్టెంబర్ 24న డిజిటల్ బుక్ అంటూ తీసుకొచ్చారు జగన్. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వేధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలను ఇందులో డాక్యుమెంట్ చేయాలంటున్నారు. అయితే ఎప్పుడు కార్యకర్తల సంక్షేమం గురించి టాపిక్ వచ్చినా జగన్ ఇలాగే మాట్లాడతారని, కానీ ఏమీ చేయరు చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.
వేధింపుల ఎవిడెన్స్‌లు అప్‌లోడ్‌కు ఛాన్స్
ఫాల్స్ కేసులు, ఆస్తులపై దాడులు, వేధింపులు, ఇలాంటివన్నీ డిజిటల్‌గా రికార్డ్ చేయాలని సూచిస్తున్నారు. ఇది వెబ్‌సైట్, మొబైల్ యాప్ రూపంలో ఉంది. IVRS సిస్టమ్ కూడా అటాచ్ చేశారు. ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యాక ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ సైబ్ ఆరంభంలోనే మొరాయించింది. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదన్నట్లుగా పరిస్థితి మారింది. కూటమి పాలనలో మంచితనం నశించిపోతోందని, వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారంటున్నారు జగన్. ప్రజలను వెన్నుపోటు పొడిచారని, ఎవరూ ప్రశ్నించకూడని పరిస్థితులను తీసుకువచ్చారని అన్నారు. ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నారని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు కూడా సృష్టిస్తున్నారన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని కూడా జగన్ గుర్తు చేసిన సందర్భాలున్నాయ్. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి. కొడతానంటే.. కొట్టమనండి. కానీ ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తామన్నారు. రిటైర్ అయిునా లాక్కుని వస్తామని, దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే.. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే రప్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలు పెడుతామని చెప్పారు.
కార్యకర్తలను నమ్మించి రోడ్లపైకి తేచ్చే యత్నమా?
ఈ ఏడాది జులైలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో జగన్ బ్లూ బుక్ పేరుతో యాప్ లాంచ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి డిజిటల్ బుక్ లైబ్రరీ అంటున్నారు. రెడ్‌బుక్ తప్పని వాదిస్తున్నప్పుడు డిజిటల్ బుక్ తప్పు కాదా? అన్న చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఈ డిజిటల్ బుక్ పేరుతో వైసీపీ కార్యకర్తలను రోడ్డుమీదికి తెచ్చే ఉద్దేమే తప్ప మరొకటి కాదన్న చర్చ కూడా నడుస్తోంది. ఐదేళ్లు వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యం క్యాడర్ కు జగన్ ఇవ్వలేకపోయారని, ఇప్పుడు వారికోసం పెట్టాల్సింది డిజిటల్ బుక్ కాదని, వెల్ఫేర్ ఫండ్ పెట్టాలన్న సూచనలూ వస్తున్నాయ్. జగన్ వార్నింగ్స్ ప్రకారం డిజిటల్ బుక్ ను పొలిటికల్ టూల్ గా ప్రయోగిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చాక కథ మారుస్తామని, ఇబ్బంది పడ్డ కార్యకర్తలు నోట్ చేయాలంటున్నారు గానీ.. కార్యకర్తలను ఎలా ఆదుకుందాం అన్న మాట మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూపై టీడీపీ రియాక్షన్ ఏంటి?
కార్యకర్తలే ముఖ్యం అంటూ కామెంట్లు
11 అసెంబ్లీ సీట్లకు పడిపోయిన వైసీపీకి మళ్లీ అధికారం కావాలి. దెబ్బ తింటే తప్ప కార్యకర్తల ఇంపార్టెన్స్ వైఎస్ జగన్ కు, ఆ పార్టీ నాయకులకు తెలియలేదా అన్న చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా తాడేపల్లిలో నిర్వహించిన కీలక సమావేశంలో వైఎస్ జగన్ పదేపదే కార్యకర్తలే ముఖ్యమనడం, వారి జపం చేయడం బట్టి చూస్తే పెద్ద స్కెచ్చే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ఆందోళనలు జరగాలన్నా కార్యకర్తలు రోడ్డెక్కితే తప్ప పని జరగదు. అందుకే ఇలా డిజిటల్ బుక్ తీసుకొచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎన్ని రోజులకు జగన్ కార్యకర్తల సంక్షేమం కోసం ఈ మాట అన్నారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా కార్యకర్తల గురించి మాట్లాడలేదని గుర్తు చేసుకుంటున్నారంతా.
క్యాడర్ ను రోడ్డెక్కించేలా వ్యూహాలు..
డిజిటల్ బుక్‌లో ఎవరైనా నమోదు చేసుకుంటే వారి కేసులు తొలగిస్తారా అన్నది కీలకంగా మారుతోంది. ఓవరాల్ గా ఈ ఇష్యూ సూచిస్తున్నదేంటంటే.. కార్యకర్తలను మోటివేట్ చేసి, ప్రభుత్వానిపై పొలిటికల్ యుద్ధానికి ప్రిపేర్ చేయడమే అంటున్నారు. ఎన్నికల్లో ఈ డేటాను ఉపయోగించి ప్రచారం చేసుకోవడం మరో వ్యూహంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల ప్రచార సభల్లో ప్రతి సభలో లోకేశ్ ఈ రెడ్ బుక్ చూపిస్తూ క్యాంపెయిన్ చేశారు. అది చాలా వర్కవుట్ అయింది. ఇప్పుడు అదే రూట్లో వెళ్తేనే బెటర్ అని జగన్ ఆలోచిస్తున్నారా? రెడ్‌బుక్ అన్నది కేవలం లోకేశ్ మాత్రమే రాసుకున్నది. కానీ డిజిటల్ బుక్‌లో ప్రతి వైసీపీ కార్యకర్త కూడా రికార్డ్ చేయొచ్చు. దీన్ని పొలిటికల్‌గా ఎలా డీల్ చేస్తారో చూడాలి.
పొలిటికల్ యుద్ధానికి ప్రిపేర్ చేయడమా?
జగన్ తన పార్టీ కార్యకర్తల్ని రాజకీయంగా ప్రేరేపించేందుకు వాడుకుంటున్నారన్న చర్చ అయితే ఉంది. అసలు ఇంతలా డిజిటల్ బుక్ తీసుకొచ్చినప్పుడు కార్యకర్తల బాధను వినేందుకు పార్టీలో ఓ వ్యవస్థ అంటూ లేదంటున్నారు. బాధల్ని తప్పించేందుకు సాయం చేయాలి, అంతేగానీ మీ బాధలు బుక్కులో రాసుకోండి మనం వచ్చాక చించేద్దాం అని అనడం ఏంటా అన్నది పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. కనీసం కార్యకర్తలకు బీమా కూడా లేదంటున్నారు. కూటమి పాలనలో ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు, వేధింపులు జరిగినట్టు YSRCP ఆరోపిస్తోంది. డిజిటల్ బుక్ తో ఇలాంటివి ట్రాక్ చేసి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెప్పడం ద్వారా వారిలో ఆశ కల్పించేలా చూసుకుంటున్నారు. సో రాను రాను రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ డిబేట్లు మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ డిజిటల్ బుక్ వ్యవహారాన్ని TDP పొలిటికల్ డ్రామా అని విమర్శిస్తోంది. నిజానికి ఈ బుక్ లో కంప్లైంట్ చేసే వారే లేకపోతే జగన్ ప్లాన్ మొదటికే ఫెయిల్ అవుతుంది. లేకపోతే అనుకున్నన్ని కంప్లైంట్లు రాకపోయినా పార్టీకి ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే దాడులు చేస్తున్నారు.. వేధిస్తున్నారు.. ఇబ్బంది పెడుతున్నారు అని ఇన్నాళ్లూ జస్ట్ నోటి మాటగా చెప్పి.. డాక్యుమెంటేషన్ లెవెల్ లో చెప్పకపోయినా మ్యాటర్ రివర్స్ అవుతుందంటున్నారు. అటు వైసీపీ డిజిటల్ బుక్ పై హోం మంత్రి అనిత సెటైర్లు వేశారు. ఏపీ వైసీపీ కార్యకర్తలకు, కర్ణాటక వాసి జగన్.. తెలంగాణ నెంబర్ ఇచ్చారంటూ కామెంట్ చేశారు. విక్టిమ్ కార్డ్ ప్లే చేసేలా వైసీపీ పొలిటికల్ గేమ్ దిశగా ఈ డిజిటల్ బుక్ తీసుకొచ్చిందా.. అసలు ఈ పొలిటికల్ గేమ్‌లో ఎవిడెన్స్ రివెంజ్ ఎలా పని చేస్తుందో చూడాలి.
story By Vidya Sagar, Bigtv