BigTV English

Sri Bharat Vs GVL Narasimha Rao : బాలయ్య అల్లుడికి జీవీఎల్ చెక్!

Sri Bharat Vs GVL Narasimha Rao : బాలయ్య అల్లుడికి జీవీఎల్ చెక్!

Sri Bharat Vs GVL Narasimha Rao newsSri Bharat Vs GVL Narasimha Rao(Andhra politics news): విశాఖ ఎంపీ సీటు పంచాయతీ ఢిల్లీకి చేరింది. బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు విశాఖ ఎంపీ సీటు కేటాయించాలని, కూటమితో చర్చించి జీవీఎల్ ను ప్రతిపాదించాలని విశాఖ జిల్లా బీజేపీ నాయకులు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ అల్లుడు భరత్ పేరు ఖరారైంది. భరత్ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. విశాఖ సీటు ఆశిస్తూ రెండేళ్ల నుంచి విశాఖలో మకాం వేసిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఈ మధ్య పెద్దగా కనిపించడంలేదు.  అయితే జీవీఎల్ అనుచరులు మాత్రం బీజేపీకే విశాఖ సీటు కేటాయించాలని డిమాండ్లు మొదలుపెట్టారు.


జీవీఎల్‌కు ఛాన్స్ లేదని తెలిసినా ఆయన టీం ఢిల్లీ వెళ్లి వినతిపత్రాలు ఇస్తుండటం వెనుక లెక్కలేంటి? బీజేపీ కొత్తరాగం విశాఖ ఎంపీ స్థానంపై బీజేపీ నేతల కొత్తరాగం కొత్త డిమాండ్ వినిపిస్తున్న జీవీఎల్ అనుచరులు జీవీఎల్‌ని ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలని లేఖలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్న బీజేపీ విశాఖ రైల్వేజోన్, తదితర హామీలపై మొండిచేయి విశాఖలో బీజేపీకి బలముందంటున్న స్థానిక నేతలు బీజేపీ నేతల డిమాండ్‌ను కొట్టిపారేస్తున్న టీడీపీ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తై అభ్యర్ధులు కూడా ఖరారయ్యారు.

Also Read: టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు.. పోటీ ఎక్కన్నుంచో మరి..?


బీజేపీ విశాఖ సీటు ఆశించినప్పటికీ. అనకాపల్లి ఎంపీ సీటు ఆ పార్టీకి దక్కడంతో..  విశాఖపట్నం నుంచి మతుకుమిల్లి భరత్ పేరును టీడీపీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయంపాలైన భరత్ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. అయితే ఇప్పుడు విశాఖ బీజేపీ నాయకులు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ను జాతీయ నాయకుడ్ని చేసేస్తూ కొత్త గళం ఎత్తుకున్నారు. విశాఖ ఎంపీ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయాలని  జీవీఎల్‌ నరసింహరావుకి ఆ సీటు కేటాయించాలని డిమాండ్లు మొదలుపెట్టారు.

తమ డిమాండ్‌ని లేఖ రూపంలో ఇటు రాష్ట్ర బీజేపీ పెద్దలకు ఇచ్చిన విశాఖ నేతలు.. ఆ లేఖలతో నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పోటీ చేసే స్థానాలు, అక్కడి అభ్యర్ధులను బీజేపీ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. ఆ టైంలో తనకు సీటు దక్కకపోయినా బాధలేదని చివరి వరకు విశాఖ అభివృద్ధికి పాటుపడతానని జీవీఎల్ స్వయంగా ప్రకటించారు.

జీవీఎల్ ఆలా చెప్పి ఇలా విశాఖ సిటీ వదిలి వెళ్లారో లేదో.  ఆయన అనుచరులు తమ డిమాండ్లు మొదలుపెట్టారు. విశాఖ ఎంపీ స్థానాన్ని జీవీఎల్‌కు రిజర్వ్ చేయాలని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ తతంగం వెనక జీవీఎల్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు.. టీడీపీ అభ్యర్ధి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు అయిన భరత్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి… ఎంపీ స్థానం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్ధులను సమన్వయం చేసుకుంటూ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం కూడా పూర్తి చేశారు.

Also Read: భక్తులకు అలర్ట్.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పటివరకంటే

ఇప్పుడు కొత్తగా బీజేపీ లోకల్ లీడర్లు విశాఖ ఎంపీ సీటుని జీవీఎల్ నరసింహారావుకి కేటాయించాలని కోరుతుండడం టీడీపీ శ్రేణులను చికాకు పరుస్తోందంట.. గత రెండు సంవత్సరాలుగా జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా విశాఖలో ఉంటూ జీవీఎల్ ఫర్ వైజాగ్ నినాదంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఆయన రాజ్యసభ ఎంపీ కావడంతో అనేక మంది కేంద్ర మంత్రులను విశాఖకు రప్పించి బిజెపి కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వ స్కీముల ప్రారంభోత్సవాలతో హడావుడి చేశారు.

విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తానని. పొత్తులపై క్లారిటీ రాకముందే ప్రకటించుకున్నారు. బీజేపీ అధిష్టానం కూడా తనకే విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తుందని నమ్మకంతో కనిపించారు. ఆ క్రమంలో పొత్తు కుదరకపోతే బీజేపీ నుంచి కచ్చితంగా జిపిఎల్ నరసింహారావు పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే జనసేన, టీడీపీలతో కలిసి పోటీ చేయడానికి బీజేపీ ముందుకురావడంతో జీవీఎల్‌కు సీటు లేకుండా పోయింది… గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం 4,500 ఓట్ల తేడాతో ఓటమి పాలైన భరత్ ఈసారి బరిలో నిలవడం… అప్పుడు 2 లక్షలకు పైగా ఓట్లు చీల్చుకున్న జనసేన ఇప్పుడు మిత్రపక్షంగా మారడంతో. జీవీఎల్‌కు టికెట్ అడిగే ఛాన్స్ లేకుండా పోయింది.

Also Read: ఏపీ పాలిటిక్స్ లో లేఖ చిచ్చు.. పురందేశ్వరి లెటర్ లో ఏముంది ?

ముఖ్యంగా విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చే పరిస్థితే కనిపించడం లేదు.  గత ఎన్నికల్లో విశాఖ సిటీలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుంది. దానికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తానంటున్న బీజేపీపై విశాఖ వాసులు ఆగ్రహంతో ఉన్నారు .. విశాఖ రైల్వే జోన్ ఇతర అభివృద్ధి పనులకు బీజేపీ సహకరించలేదనేదన్న అసంతృప్తి ఉంది. ఇలాంటి తరుణంలో బిజెపికి విశాఖ ఎంపీ సీట్ ఇస్తే కూటమిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ ఓటమి పాలవుతారని.. చంద్రబాబు బీజేపీ పెద్దలకు స్ఫష్టంగా చెప్పారంటున్నారు.

అయితే బిజెపికి విశాఖలో బలం ఉందని జీవీఎల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారని స్థానిక నాయకులు బిజెపి జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అదేమంటే అప్పుడెప్పుడో పొత్తుల్లో భాగంగా బీజేపీ గెలిచిన ఉదంతాలను చెప్పుకొస్తున్నారు. విశాఖలో బీజేపీని బతికించుకోవాలంటే ఎంపీగా తమ పార్టీ అభ్యర్ధే పోటీలో ఉండాలంటున్నారు.

బీజేపీ నేతలు డ్రామా ఆడుతున్నారని.. నాలుగు ఓట్లు వేయించలేని వారంతా లీడర్లలా మాట్లాడుతున్నారని టీడీపీ కేడర్ ఫైర్ అవుతోంది. ఈ హై డ్రామాని డైరెక్ట్ చేస్తుంది జీవీఎల్ అని ఆరోపిస్తోంది. లేఖలు పట్టుకుని ఢిల్లీ వెళ్లినంత మాత్రాన వారికి బీజేపీ బాస్‌ల అపాయింట్‌మెంట్ కూడా దొరకదని తెలుగు తమ్ముళ్లు యద్దేవా చేస్తున్నారు. మరి చూడాలి సదరు బీజేపీ నేతలు ఏం ఆశిస్తున్నారో? ఏం సాధిస్తారో?

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×