కొద్ది రోజుల క్రితం.. ప్యారిస్‌లోని లూవ్ మ్యూజియంలో జరిగిన చోరీ.. మొత్తం ప్రపంచాన్నే షాక్‌కి గురిచేసింది. అత్యంత భద్రత కలిగిన మ్యూజియంలోకి చొరబడి.. నిమిషాల వ్యవధిలోనే విలువైన ఆభరణాలు దొంగిలించారు దుండగులు. వాళ్లు చోరీ చేసిన నగల విలువ దాదాపు 900 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ.. అదే మ్యూజియంలో అత్యంత విలువైన రీజెంట్ డైమండ్‌ని కనీసం టచ్ కూడా చేయలేదు. ఎందుకని.. దొంగలు ఆ డైమండ్‌ని తాకే సాహసం చేయలేదు? దాని హిస్టరీ ఏంటి?
డైమండ్ అంటే.. ఇండియన్స్ అందరికీ గుర్తొచ్చేది ఒక్క కోహినూర్ మాత్రమే. అదొక్కటే.. ఈ ప్రంపంచంలో ఉన్న అన్ని వజ్రాల కంటే తోపు డైమండ్ అనే విషయం.. అందరికీ తెలుసు. కానీ.. కోహినూర్ ఒక్కటే.. ఇండియన్ డైమండ్ కాదు. ఈ ఫ్రెంచ్ రీజెంట్ డైమండ్ కూడా ఇండియాదే. ముఖ్యంగా.. మన గోల్కొండది. ఎప్పుడైతే.. ప్యారిస్‌లోని ప్రఖ్యాత లూవ్ మ్యూజియంలో భారీ చోరీ జరిగిందో.. అప్పుడే ఈ డైమండ్ మళ్లీ వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. వందల కోట్ల విలువ చేసే అత్యంత విలువైన ఆభరణాలను దోచుకెళ్లిన దుండగులు.. అదే మ్యూజియంలో ఉన్న ఈ వజ్రాన్ని ఎందుకు అలా వదిలేసి వెళ్లిపోయారనేదే ఇప్పుడు బిగ్ డిబేట్‌కు దారితీసింది. అలా.. మరోసారి ఫ్రెంచ్ రీజెంట్ డైమండ్‌పై చర్చ మొదలైంది. లూవ్ మ్యూజియంలో చోరీ న్యూస్ ఎంత హైలైట్ అయిందో.. ఈ డైమండ్‌ని దొంగలు టచ్ కూడా చేయలేదన్న వార్త కూడా అంతే పాపులర్ అయింది. ఎందుకోసం.. దుండగులు ఈ వజ్రాన్ని టచ్ చేయలేదు? ఇది.. శాపగ్రస్తమైందా? చరిత్రలో.. ఈ వజ్రాన్ని టచ్ చేసిన వాళ్లంతా.. మట్టికొట్టుకుపోయారా? గోల్కొండలో బయటపడిన రీజెంట్ డైమండ్.. ఫ్రెంచ్ దాకా ఎలా వెళ్లింది? లూవ్ మ్యూజియంలో చోరీ జరిగే దాకా.. దీని గురించి చాలా మంది భారతీయులకు ఎందుకు తెలియదు? గోల్కొండ గనుల్లో బయటపడిన ఈ విలువైన డైమండ్.. ప్యారిస్‌లోని లూవ్ మ్యూజియం దాకా ఎలా చేరింది? అసలేంటి.. రీజెంట్ డైమండ్ జర్నీ? హిస్టరీలో దీనికున్న పేజీలెన్ని?
గోల్కొండ గనుల్లో బయటపడిన దగ్గర్నుంచి ఫ్రాన్స్ కిరీటం దాకా.. రీజెంట్ డైమండ్ స్టోరీ.. విప్లవాలు, సామ్రాజ్యాలు, ద్రోహాల దాకా విస్తరించి ఉంది. మొదట్లో.. ఓ కార్మికుడి కాలి గాయాల్లో దాగి.. ఆ తర్వాత ఓ బ్రిటీష్ అధికారి కుమారుడి బూటులో అక్రమంగా బ్రిటీష్ చేరి.. చివరికి నెపోలియన్ కత్తిలో అమర్చేదాకా సాగింది ఈ డైమండ్ జర్నీ. ఈ డైమండ్ చరిత్ర మొత్తం.. దురాశ, మోసాలతో నిండిపోయి ఉంది. ఇటీవల ప్యారిస్‌లోని లూవ్ మ్యూజియంలో జరిగిన దోపిడీతో.. వరల్డ్ అటెన్షన్ మొత్తం మరోసారి ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటైన.. ఈ రీజెంట్ డైమండ్ వైపు మళ్లింది. అమూల్యమైన ఈ డైమండ్‌ని.. దొంగలు కనీసం తాకకుండా వదిలేసి.. శతాబ్దాల నాటి వారసత్వాన్ని, భవిష్యత్ ప్రమాదాల నుంచి కాపాడారు. ఇప్పుడు లూవ్ మ్యూజియంలో సేఫ్‌గా ఉన్న రీజెంట్ డైమండ్ స్టోరీ.. 17వ శతాబ్దంలో ఆనాటి గోల్కొండ సామ్రాజ్యంలో.. కృష్ణానది తీవరం వెంబడి ఉన్న కొల్లూరు గనుల్లో మొదలైంది. చరిత్ర ప్రకారం.. 1687లో ఔరంగజేబు గోల్కొండని ముట్టడించిన సమయంలో.. ఓ బానిస కార్మికుడికి.. కొల్లూరు గనుల్లో ఈ వజ్రం దొరికింది. అతను.. ఈ వజ్రాన్ని తన కాలిలో ఉన్న ఓ గాయంలో దాచిపెట్టాడట. అలా.. వజ్రం బయటపడకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ.. అది ఎక్కువకాలం నిలవలేదు. ఆ కార్మికుడిని.. ఓ బ్రిటీష్ షిప్ కెప్టెన్ మోసగించాడు. అతన్ని చంపేసి.. ఈ రీజెంట్ డైమండ్‌ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఈ వజ్రాన్ని.. జామ్ చంద్ అనే వ్యాపారికి విక్రయించాడు.
1701లో.. అప్పటి మద్రాస్ గవర్నర్ థామస్ పిట్.. జామ్ చంద్ నుంచి ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత.. థామస్ పిట్ లండన్‌లోని తన ఏజెంట్‌కి రాసిన లేఖలో.. ఇదెంత విలువైన వజ్రమో తెలియజేశాడు. ఎలాంటి లోపాలు లేని అద్భుతమైన క్రిస్టల్ క్లియర్ డైమండ్‌గా దీనిని వర్ణించాడు. అప్పటికి.. దీని బరువు.. 426 క్యారెట్లు. ఇంత విలువైన వజ్రాన్ని.. అప్పుడు 48 వేల పగోడాలకు కొన్నాడు. ఆ సమయంలో.. ఇది చాలా పెద్ద మొత్తంగా చెబుతారు. అలా.. ఈ వజ్రాన్ని.. రహస్యంగా ఇంగ్లాండ్‌కు తరలించేందుకు.. తన కుమారుడి షూ హీల్‌లో దాచి బ్రిటన్‌కి తీసుకెళ్లాడు థామస్ పిట్. లండన్‌లో.. డైమండ్ కట్టర్ హారిస్.. రెండేళ్ల పాటు శ్రమించి.. ఈ వజ్రాన్ని 141 క్యారెట్ కుషన్ బ్రిలియంట్‌గా రూపొందించారు. అప్పట్లో.. కటింగ్‌కు మాత్రమే 5 వేల పౌండ్లు ఖర్చయింది. 18వ శతాబ్దపు ప్రారంభంలో.. రత్నాల చేతిపనులకు చెల్లించే మొత్తంలో.. ఇది చెలా ఎక్కువ. అయితే.. థామస్ పిట్ రహస్యంగా ఈ డైమండ్‌ని బ్రిటన్ తీసుకెళ్లిన వార్త.. త్వరగానే వ్యాపించింది. అయితే.. పిట్ ఎపిసోడ్.. వలసవాద దురాశని, నైతికతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఇది.. థామస్ పిట్ ఖ్యాతిని తగ్గించేసింది.
ఈ గోల్కొండ డైమండ్.. ఇంగ్లాండ్‌లో అమ్ముడుపోకపోవడంతో.. థామస్ పిట్ 1717లో ఈ వజ్రాన్ని.. ఫ్రాన్స్ రీజెంట్ ఫిలిప్-2కి.. లక్షా 35 వేల పౌండ్లకి విక్రయించాడు. ఇప్పటి కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు 26 మిలియన్ పౌండ్లు. అప్పుడే.. ఈ డైమండ్‌కి.. లె రీజెంట్‌గా పేరు మార్చి.. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్‌లో చేర్చారు. ఆ తర్వాత.. రీజెంట్ డైమండ్ మూడు కిరీటాలపై మెరిసింది. లూయిస్ 15, లూయిస్ 16, లూయిస్ 18, చార్లెస్ టెన్, మేరీ ఆంటోయినెట్ టోపీపై.. ఈ డైమండ్ జర్నీ కొనసాగింది. 1792లో.. క్రౌన్ జ్యువెల్స్ దోపిడీకి గురైనప్పుడు.. ఫ్రెంచ్ రెవల్యూషన్ సమయంలో.. ఈ డైమండ్ బయటకొచ్చింది. 1801లో నెపోలియన్ బోనపార్ట్.. దీనిని కొనుగోలు చేసి.. తన కత్తిలో అమర్చుకున్నాడు. మూడో నెపోలియన్ కిరీటంపైనా ఈ డైమండ్ మెరిసింది. నెపోలియన్ పతనం తర్వాత.. అతని భార్య ఆస్ట్రియాకు చెందిన మేరీ లూయిస్.. ఈ డైమండ్‌ని వియన్నాకు తీసుకెళ్లింది. ఆమె తండ్రి.. దీనిని ఫ్రాన్స్‌కి తిరిగి తీసుకొచ్చే దాకా అది.. అక్కడే ఉంది. 1887 నుంచి ఈ రీజెంట్ డైమండ్.. ప్యారిస్‌లోని లూవ్ మ్యూజియంలోనే ఉంది. దీనిని.. ఎంప్రెస్ యూగ్నీ కోసం సృష్టించిన గ్రీకు డిజైన్ కిరీటంలో అమర్చారు. ఇంటర్నేషనల్ జెమ్ సొసైటీ శాస్త్రవేత్తలు.. అత్యంత స్వచ్ఛమైన వజ్రాల్లో ఇదొకటని చెబుతారు. రాజ రత్నాల్లో సాటిలేని ప్రాముఖ్యతని కలిగి ఉన్న వజ్రాల్లో.. మన రీజెంట్ డైమండ్ కూడా ఒకటి.
భారత భూమి లోతుల్లో నుంచి ఫ్రెంచ్ రాచరికపు ఖజానాలా దాకా.. రీజెంట్ డైమండ్ జర్నీ చాలా పెద్దది. సామ్రాజ్యాలు, ఆశయాలు, ప్రకాశించే ఈ అరుదైన వజ్రాన్ని సొంతం చేసుకోవాలనే తపనని దాటి.. ఈ డైమండ్ ప్యారిస్ లూవ్ మ్యూజియం దాకా చేరింది. ఇటీవల జరిగిన చోరీలో.. దీనిని దొంగిలించకుండా ఎందుకు వదిలేశారు? ఫ్రెంచ్ రీజెంట్ డైమండ్ శాపగ్రస్తమైందా? ఈ డైమండ్ విలువ ఇప్పుడు ఎంత ఉంటుంది?
మ్యూజియం అంటేనే.. విలువైన వస్తువులకు వేదిక. అందులోనూ.. ప్యారిస్‌లోని ప్రఖ్యాత లూవ్ మ్యూజియంలో.. ఎన్ని విలువైన వస్తువులు ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. అలాంటి చోటే.. మన గోల్కొండ డైమండ్ కూడా ఉంది. భారత గనుల్లో పుట్టి.. ఫ్రెంచ్ రీజెంట్‌గా మారిన ఈ డైమండ్.. నిజంగానే శాపగ్రస్తమైందా? దొంగలు.. దీనిని వదిలేసి.. మిగతా ఆభరణాలను ఎందుకు చోరీ చేశారనేదే.. ఇప్పుడు వినిపిస్తున్న బిగ్ క్వశ్చన్. చాలా మంది.. ఫ్రెంచ్ రీజెంట్ డైమండ్ శాపగ్రస్తం అయినట్లుగా భావిస్తారు. ఎందుకంటే.. దీనికి ఉన్న హిస్టరీ అలాంటిది.
ఫ్రెంచ్ రీజెంట్ చరిత్ర అంతా.. దొంగతనం, హత్య, మోసంతో పాటు దీనిని కొనుగోలు చేసిన వాళ్లందరి జీవితాల్లో దురదృష్టకర ఘటనలే జరిగాయ్. దీనిని కిరీటంలో ధరించిన కింగ్ ఛార్లెస్.. తన సింహాసనాన్ని కోల్పోయారు. నెపోలియన్.. బహిష్కరణలో చనిపోయారు. ఇలాంటి ఎన్నో కథలు దీని చుట్టూ ఉన్నాయ్. వాటివల్లే.. ఫ్రెంచ్ రీజెంట్ డైమండ్.. శాపగ్రస్తమైనదిగా భావిస్తారు. అయితే.. ఇప్పుడు దొంగలు కూడా అదే ఆలోచనతో దీనిని టచ్ చేయకుండా వెళ్లిపోయారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 1792లో, ఫ్రెంచ్ విప్లవం సమయంలో పారిస్‌లోని గార్డ్-మీయుబుల్‌లో ఉన్న ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్‌ని దొంగిలించారు. అందులో ఈ రీజెంట్ డైమండ్ కూడా ఉంది. ఈ దొంగతనం జరిగిన కొన్నాళ్ల తర్వాత.. దొంగలు రీజెంట్ డైమండ్‌ని, ఓ గోమేధిక రాయి పాత్రని.. ప్యారిస్‌లోని ఓ అటకపై దాచి ఉంచారు. అలా.. ఇవి మళ్లీ దొరికాయి. చోరీకి గురైన మిగతా ఆభరణాలు చాలా వరకు దొరకలేదు. అయితే.. ఇటీవల లూవ్ మ్యూజియంలో చొరబడిన దొంగలు.. చిన్న సైజు ఆభరణాలను, పెద్దగా గుర్తింపు లేని నగలను మాత్రమే టార్గెట్ చేసి ఉంటారనే టాక్ వినిపిస్తుంది. రీజెంట్ డైమండ్‌ని.. దానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతని గుర్తుంచుకొని.. దానిని మార్కెట్‌లో విక్రయించడం కష్టమవుతుందనే ఉద్దేశంతోనే.. లేక భద్రతా కారణాలతోనో.. దాని జోలికి వెళ్లి ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది.
ఈ రీజెంట్ డైమండ్.. ఫ్రెంచ్ ప్రభుత్వానికి సంబంధించిన జాతీయ సంపద. అందువల్ల.. దీనిని విక్రయించే అవకాశం కాలేదు. కానీ.. కొందరు వజ్రాల నిపుణుల అంచనా ప్రకారం.. 21వ శతాబ్దం ప్రారంభంలో 500 కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా వేశారు. 2015లో దీని విలువని అంచనా వేసినప్పుడు.. 650 కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. దీనికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా.. ఇది ఓ డైమండ్ కన్నా.. అత్యంత విలువైన రత్నంగా పరిగణిస్తారు. అందుకే.. ప్యారిస్‌లోని ప్రఖ్యాత లూవ్ మ్యూజియంలో దీనిని ప్రదర్శనలో ఉంచింది ఫ్రెంచ్ ప్రభుత్వం. భారతదేశంలో దొరికిన.. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన, స్వచ్ఛమైన వజ్రాల్లో ఇది కూడా ఒకటి. ఎంతో విలువైన ఫ్రెంచ్ రీజెంట్.. శతాబ్దాల కాలం నాటి విజయాలకు, విప్లవాలకు.. ఓ నిశ్శబ్ద సాక్ష్యంగా నిలుస్తోంది.
Story by Big Tv