E-Paper
Advertisement

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!
Advertisement

లీ క్వాన్ యూ..! ఇత‌న్ని సింగ‌పూర్ పితామ‌హుడిగా పిలుస్తారు. ఇప్పుడీయ‌న గురించి టాపిక్ ఎందుక‌నుకుంటున్నారా? ఈ పితామ‌హుడి పేరును యాది చేసుకున్నాడు కేటీఆర్‌. ఇవాళ ఈయ‌న పేరును గుర్తు చేసి.. ఇదే స్థాయి కేసీఆర్‌ది అని కూడా క్లారిటీ ఇచ్చాడు. సింగ‌పూర్‌ను ప్ర‌పంచ పటంలో పెట్టిన ఆయ‌నను ఆ దేశం అత్యున్న‌తంగా గౌర‌వ, మ‌ర్యాద‌లిచ్చిన విష‌యాన్ని కూడా గుర్తు చేశారు.

ఇవ‌న్నీ ఎందుకు చెప్పాడంటే.. రేవంత్ స‌ర్కార్ కేసీఆర్‌ను రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చిన ఉదంతంపై ఇలా స్పందించారు. కేసీఆర్‌ది లీక్వాన్‌యూ స్థాయి.. ఆయ‌న‌లా కేసీఆర్‌ను గౌర‌వించాల్సింది పోయి.. రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తారా? అని స‌ర్కార్‌ను నిల‌దీసే ప్ర‌య్న‌తం చేశాడు కేటీఆర్‌.

Advertisement

అక్క‌డ సింగ‌పూర్‌లో లీ క్వాన్ యూను జాతిపిత‌గా కీర్తిస్తారు. అంటే ప్రాణాలొడ్డి  తెలంగాణ‌ను తెచ్చిన కేసీఆర్‌ను కూడా తెలంగాణ జాతిపిత‌గా పిల‌వాల‌నే త‌న ఆకాంక్ష‌ను ఇలా మ‌రోసారి గుర్తు చేశాడ‌న్న‌మాట‌. అంతే కాదు.. సింగాపూర్‌ను లీ .. ప్ర‌పంచ‌పటంలో పెట్టిన‌ట్టుగానే తెలంగాణ‌ను కూడా కేసీఆర్ త‌న పాల‌న ద్వారా ప్ర‌పంచంలోనే నెంబ‌ర్‌గా నిలిపాడ‌ని చెప్ప‌క‌నే చెప్పాడ‌న్న‌మాట‌.

స‌రే, ఈ ముచ్చ‌ట కాసేపు ప‌క్క‌న బెట్టి.. అస‌లు ఈ లీక్వాన్ యూ ఎవ‌రు..? ఆయ‌న నేప‌థ్యం.. ? ల‌భించిన ప్ర‌త్యేక గుర్తింపు గురించి కూడా చెప్పుకుందాం. లీ క్వాన్ యూ (Lee Kuan Yew) ను ఆధునిక సింగపూర్ పితామహుడు (Founding Father of Singapore) గా పిలుస్తారు. 1959 నుండి 1990 వరకు సుమారు 31 సంవత్సరాల పాటు సింగపూర్ తొలి ప్రధానమంత్రిగా పనిచేసి, ఒక వెనుకబడిన చిన్న ద్వీపాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మార్చార‌ని చ‌రిత్ర చెబుతోంది.

Advertisement

1965లో మలేషియా నుండి విడిపోయినప్పుడు సింగపూర్‌లో నిరుద్యోగం, పేదరికం ఎక్కువగా ఉండేవి. అలాంటి దేశాన్ని కేవలం ఒకే ఒక్క తరంలో ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఆయ‌న మార్చారు. సింగాపూర్‌లో అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేసి, అవినీతిని పూర్తిగా నిర్మూలించ‌గ‌లిగార‌ని చెబుతారు.

ఈ కార‌ణంగా.. సింగపూర్ ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలు లీ క్వాన్ యూను దేవుడిలా భావిస్తారు. అందుకే ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ.. ఆయన కోసం ప్రత్యేకంగా ‘సీనియర్ మినిస్టర్’, ఆ తర్వాత ‘మినిస్టర్ మెంటర్’ (మంత్రిత్వ సలహాదారు) పదవులను సృష్టించి 2011 వరకు ప్రభుత్వంలో కొనసాగించారు.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పబ్లిక్ పాలసీ విభాగానికి ఆయన గౌరవార్థం Lee Kuan Yew School of Public Policy అని పేరు పెట్టారు. సింగపూర్ అధ్యక్షుడితో పాటు లీ క్వాన్ యూ చిత్రపటాన్ని అధికారికంగా గౌరవిస్తారక్క‌డ‌. ఆయన మార్చి 23, 2015న మ‌ర‌ణించారు. అప్పుడు వారం రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు.

ఆయన 100వ జయంతి (2023) సందర్భంగా సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేక స్మారక నాణేలను (LKY100 Coins) విడుదల చేసి గౌరవించింది. ఇదీ ఆయ‌న నేప‌థ్యం. ఘ‌న‌మైన చ‌రిత్ర‌. అయితే ఇక్క‌డో విష‌యం చెప్పాలి. కేటీఆర్ అన్న‌ట్టుగానే .. చాలా సార్లు… కేసీఆర్ కూడా అంత‌ర్గ‌త స‌మావేశాల్లో త‌న‌ను మ‌హాత్మాగాంధీతో పోల్చుకునేవారట. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ ఫోటోల‌తో స‌మానంగా త‌న ఫోటోను కూడా తెలంగాణ‌లో పెట్టుకోవాల‌ని, కానీ రాజ‌కీయాల్లో  ఉన్నందుకు .. అంద‌రితో తిట్లు ప‌డుతున్నాన‌ని కూడా చెప్పుకుని బాధ‌ప‌డేవార‌ట‌.

Tags

Related News

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

Big Stories

Advertisement
×