Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ అసలు కథ ఢిల్లీలో మొదలుకానుంది. కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్ఠానం దగ్గరకు చేరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడంతో అందరి చూపూ అటువైపే ఉంది. అటు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సురేఖ భేటీలో ఏం తేలుతుందన్నది కూడా ఉత్కంఠగా మారింది.
సురేఖపై వేట తప్పదన్న ప్రచారం గట్టిగానే ఉంది. అదే జరిగితే .. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయ్. ఇదే సమయంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం కూడా షికార్లు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా విస్తరణ మంచిదేగా అని చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
Also read: బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షనలు
అంటే ఢిల్లీలో ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలా..? కొండా సురేఖ వ్యవహారానికి ముగింపు పలకడంతో పాటు.. మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు కూడా అధిష్ఠానం పచ్చజెండా ఊపుతుందా..? ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరి పదవి ఉంటుందో.. ఎవరి పదవి ఊడుతుందో తేలనుంది.
Also read: సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్