BigTV English

Kejriwal : సీబీఐని నాకు అప్పగిస్తే.. సగం బీజేపీ నాయకులు జైల్లో ఉంటారు : కేజ్రీవాల్

Kejriwal : సీబీఐని నాకు అప్పగిస్తే.. సగం బీజేపీ నాయకులు జైల్లో ఉంటారు : కేజ్రీవాల్

Kejriwal : బీజేపీపై ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐని ఒక్కరోజు తనకు అప్పగిస్తే సగం బీజేపీ నాయకులు జైల్లోనే ఉంటారని అన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న కేజ్రీవాల్….ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కారు తనతోపాటు ఆప్‌కు చెందిన ఎమ్మెల్యేలందరినీ ఏదో కేసులో ఇరికించాలని చూస్తున్నదని ఆరోపించారు.


ఇప్పటికి తమ ఎమ్మెల్యేలపై 167 అవినీతి కేసులు పెట్టిందని…. అందులో 135 కేసులు కొట్టేశారని చెప్పారు. సీబీఐ అధికారులు ఇప్పటికీ 400 ఫైళ్లను పరిశీలించారని… అయినా తనను ఎందులోనూ ఇరికించలేకపోయారని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రతి ఫైల్‌ను కావాలని తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీనే మెజార్టీ సాధిస్తుందన్నారు.


Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×