BigTV English
Advertisement

Greeting Cards : గ్రీటింగ్ కార్డ్ చరిత్ర తెలుసా?

Greeting Cards : గ్రీటింగ్ కార్డ్ చరిత్ర తెలుసా?
Greeting Cards History

Greeting Cards History(Latest telugu news):

కొత్త సంవత్సరం వేళ.. అందరూ తమ బంధుమిత్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఓ ఇరవై ఏళ్ల నాడు.. కొత్త ఏడాది వేళ అందరూ గ్రీటింగ్స్ కార్డ్స్ ఇచ్చి విషెస్ చెప్పుకునేవారు. మాటల్లో చెప్పలేని మధుర భావాలను ఓపికగా స్వహస్తాలతో గ్రీటింగ్ కార్డ్స్‌లలో రాసి.. ఆత్మీయులకు పంపేవారు. దుకాణాల్లోని వందలాది గ్రీటింగ్ కార్డుల్లో ఆయా సందర్భాలకు తగిన కార్డును ఓపిగ్గా ఎంపిక చేసుకుని, నచ్చిన వారికి పంపి.. వారికి తమ భావాలను వ్యక్తపరచేవారు.


గతంలో ఏళ్ల తరబడి స్నేహితులు, బంధువులు పంపిన గ్రీటింగ్ కార్డులను భద్రంగా దాచుకునేవారు. ప్రతి ఏటా వాటిని తీసి మరల ఒకసారి చూసుకుని మురిసిపోయేవారు. మొబైల్ రాకతో.. తూర్పు దేశాల్లో అవన్నీ మాయమయ్యాయి. అయితే.. నేటికీ పాశ్చాత్య దేశాల్లో నేటికీ గ్రీటింగ్ కార్డ్ తన వైభవాన్ని చాటుకుంటూనే ఉంది. ఇంతకీ గ్రీటింగ్ కార్డ్ చరిత్ర ఏమిటి? దీని వాడకం ఎలా మొదలైంది వంటి విశేషాలను తెలుసుకుందాం.

గ్రీటింగ్ కార్డ్స్‌ తొలి జన్మస్థలం చైనా. అప్పట్లో రంగు వస్త్రాలపై వీటిని రూపొందించేవారు. తర్వాత కొంత కాలానికి ఇవి ప్రాచీన ఈజిప్టులోనూ మొదలయ్యాయి. అక్కడ శుభాకాంక్షలు, సంతాప సందేశాలను పట్టు లేదా వెదురు బద్దెల మీద రాసి పంపేవారు. 1477 లో గుటెన్‌బర్గ్ ప్రింటర్‌ను రూపొందించటంతో 15 వ శతాబ్దం నాటికి జర్మనీలో కాగితం మీద ఇవి ప్రింట్ కావటం మొదలైంది.


1800 వచ్చేసరికి యూరోప్ దేశాల్లో టెక్నాలజీ మరింత పెరిగి, కొత్త ఏడాది వేళ.. వేలాది గ్రీటింగ్ కార్డుల ముద్రణ మొదలైంది. అయితే.. తొలి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు 1843 లో ఇంగ్లాండ్‌లో హెన్రీ కోల్ రూపొందించారు. ఈ కార్డులకు సౌత్ అమెరికాలో మంచి గుర్తింపు రావటంతో వాలెంటైన్స్ డే, ఈస్టర్ వంటికి కూడా గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకునే కల్చర్ మొదలైంది. 20 వ శతాబ్దం వచ్చేసరికి మిలియన్ల కొద్దీ గ్రీటింగ్ కార్డుల తయారీ, అమ్మకాలు జరగటం మొదలైంది.

దీంతో.. ఒకప్పుడు కేవలం న్యూఇయర్, క్రిస్మస్‌లకే పరిమితమైన గ్రీటింగ్ కార్డులు.. పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ప్రతి సందర్భంలోనూ భాగస్వాములుగా మారాయి. నేటి యువత డిజిటల్ కమ్యూనికేషన్‌కు అలవాటు పడినా.. నేటికీ గ్రీటింగ్ కార్డుల ద్వారా సందేశాలు పంపే పాత తరం ఇంకా మిగిలే ఉంది.

అందుకే శతాబ్దాల చరిత్ర గల గ్రీటింగ్ కార్డ్స్ పూర్తిగా మరుగున పడిపోకుండా ఉండాలంటే.. మళ్లీ వాటిని వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ న్యూఇయర్ వేళ.. భవిష్యత్తు తరాలకు వీటి గొప్పతనాన్ని తెలియజేద్దాం. మన ఆత్మీయులకు సర్ప్రైజింగ్ గిఫ్ట్‌లుగా వాటిని పంపిద్దాం.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×