E-Paper
Advertisement

Karnataka: ఆ కోరికతో నలుగురిని పెళ్లాడిన యువతి.. చివరకు?

Karnataka : కర్నాటకలో దావణగెరె ప్రాంతానికి చెందిన స్నేహ(25) త్వరగా శ్రీమంతురాలిని కావాలన్న ఆశతో ఏకంగా నలుగురిని వివాహం చేసుకుంది. మోసపోయానని తెలుసుకున్న మూడో భర్త అయిన ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

Karnataka: ఆ కోరికతో నలుగురిని పెళ్లాడిన యువతి.. చివరకు?
Advertisement
today news paper telugu
Karnataka

Karnataka latest news(Today news paper telugu):

కర్నాటకలో దావణగెరె ప్రాంతానికి చెందిన స్నేహ(25) త్వరగా శ్రీమంతురాలిని కావాలన్న ఆశతో ఏకంగా నలుగురిని వివాహం చేసుకుంది. మోసపోయానని తెలుసుకున్న మూడో భర్త అయిన ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

మాండ్య జిల్లా పాండవపురకు చెందిన ఆమె రెండేళ్ల కిందట రైలు ప్రయాణంలో ప్రశాంత్‌ అనే యువకుడి కి పరిచయం అయింది. తర్వాత వారిద్దరు వివాహం చేసుకున్నారు. దావణగెరెలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. స్నేహ గర్భిణి అయ్యానని ప్రశాంత్ కు చెప్పి రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లిపొయింది. ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని అడిగితే అందుకు సుముఖత చూపలేదు. ప్రశాంత్ ఆమె ఇచ్చిన చిరునామాతో ఆమె ఇంటికి చేరుకున్నాడు. తీరా చూస్తే ఆమె అక్కడ లేదు. చివరకు తన భార్య కనిపించడం లేదని కేటీజే నగర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలించగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. స్నేహకు ఇంతకుముందే రెండు వివాహాలు జరిగాయని, ప్రశాంత్‌ మూడో భర్త అని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఆమె బెంగుళూరు లో ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బెంగళూరుకి చెందిన రఘు అనే యువకుడిని ఆమె నాల్గవ వివాహం చేసుకుంది. మొదట ఆమెకు పెద్దలు మాండ్యజిల్లా మేలుకోటె ప్రాంతానికి చెందిన మహేశ్‌తో వివాహం చేశారు. అతనితో వేరుగా ఉంటూ కొన్నాళ్ళకు వదిలేసి.. బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ను రెండో వివాహం చేసుకుంది. అతన్ని కూడా మోసం చేసి.. దావణగెరెకు చెందిన ప్రశాంత్‌ను, ఇప్పుడు రఘు వివాహం చేసుకుంది. మూడో భర్త ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను అరెస్టు చేశారు. శ్రీమంతురాలు అవ్వాలన్న కోరికతో.. నలుగురిని పెళ్లాడిన యువతి చివరకు జైలు పాలయింది.

Tags

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×