E-Paper
Advertisement

Jubilee Hills Bypoll: జూబ్లీ హిల్స్ లో ఆ పార్టీ కథ రివర్స్! గెలిచేది ఎవరంటే?

Jubilee Hills Bypoll: జూబ్లీ హిల్స్ లో ఆ పార్టీ కథ రివర్స్! గెలిచేది ఎవరంటే?
Advertisement

Jubilee Hills Bypoll:  జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో సెంటిమెంటునే నమ్ముకున్న బిఆర్ఎస్ ఓటింగ్ సరళితో సెంటిమెంట్ వర్కవుట్ కాదని నిర్ణయానికి వచ్చిందా? అందుకే మద్యాహ్నం నుంచి డ్రామా క్రియేట్ చేసిందా? బిఆర్ఎస్ అభ్యర్ధిని మాగంటి రోడ్డుపై ధర్నా చేపట్టి, రోడ్డు పై కూర్చుని కన్నీరు పెట్టడం సింపతీ కోసమేనా? ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్ పోలింగ్ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు? అంటే కౌంటింగ్‌కు ముందే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ బై పోల్ లో చేతులెత్తేసిందా?

అన్నీ తానై ప్రచారం నిర్వహించిన కేటీఆర్

జూబ్లీహిల్స్ బై పోల్ ప్రహసనం ముగిసింది. చలి ఎక్కువగా ఉండటంతో పోలింగ్ మందకొడిగా సాగి నిండా 50 శాతం మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. జూబ్లీహిల్స్ ఓటర్లు సగానికి పైగా మంది ఎప్పటిలాగే పోలీంగ్ కేంద్రాలకు దూరంగా ఉండిపోయారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ అందరికంటే ముందుగా.. గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ కేటాయించింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానై ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నారు.

కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు

Advertisement

మరోవైపు కాంగ్రెస్ తరుపున నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ముస్లిమ్స్ ఓటర్స్ ఆకర్షించడానికి ఏకంగా రేవంత్ రెడ్డి.. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ ను మంత్రి పదవి కట్టబెట్టి మైనారిటీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. దానిపై అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్‌లు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి.

కిషన్–బండి సంజయ్ ప్రచారం

అటు చివర్లో బీజేపీ గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో దీపక్ రెడ్డి తరుపున సికింద్రాబాద్ ఎంపీ .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చివర్లో ప్రచార రంగంలోకి దిగడంతో కాషాయపార్టీ రేసులోకి వచ్చినట్లు కనిపించింది. ఆ క్రమంలో గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి వరకు ప్రయత్నాలు

Advertisement

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీలతో సహా మొత్తం 58 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల్లో 226 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించి.. 139 ప్రాంతాల్లో డ్రోన్ లతో నిఘా పెట్టారు. ప్రధాన పార్టీలు చివరి వరకు ఓటర్లను ప్రలోభ పరుచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయన్న ప్రచారం జరిగింది. ఓటుకు వెయ్యి నుంచి 3 వేల వరకు పంపిణీ చేసినట్టు బరిలో ఉన్న మిగతా అభ్యర్ధులు ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించిందన్న టాక్

అదలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధానపోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే జరిగినట్లు విశ్లేషకకుల ముందు నుంచి చెప్పుకొచ్చారు. బీజేపీ గత ఎన్నికల్లో లానే మూడో స్థానానికి పరిమితమవుతుందని విశ్లేషించారు. పోలింగ్ సరళి చూస్తే ఆ విశ్లేషణలు నిజమైనట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పోలింగ్ రోజు మధ్యలోనే బీఆర్ఎస్ నేతలు కూడా గొడవ చేసి హంగామా సృష్టించడం ద్వారా ఓటమిని అంగీకరించినట్లైందన్న టాక్ వినిపిస్తోంది.

రోడ్డెక్కి ఆందోళన నిర్వహించిన మాగంటి సునీత

ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్ధిని మాగంటి సునీత కాంగ్రెస్‌పై అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ రోడ్డెక్కి ఆందోళన చేశారు. బోరబండ‌లోని పలు పోలింగ్ స్టేషన్‌‌లలో తమ పార్టీ కార్యకర్తలపై స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ దాడి చేశారని సునీత గోపీనాథ్ ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులపై బాబా ఫసియుద్దీన్ దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును ఆమె ఖండించారు. అధికార కాంగ్రెస్‌కి మద్దతుగా పోలీసులు పనిచేస్తున్నారని మాగంటి సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై కన్నీరు పెట్టుకున్న ఆమె సింపతీ గెయినింగ్ ప్రయత్నాలు చేశారు.

పోలింగ్ తర్వాత సైలెంట్ అయిపోయిన కేటీఆర్

ప్రచారంలో అంతా తనే అన్నట్లు గా వ్యవహరించిన కేటిఆర్ పోలింగ్ తర్వాత సైలెంట్ అయిపోయారు. పోలింగ్ సరళితో ఢీలా పడినట్లు కనిపించిన ఆయన మనమే గెలుస్తున్నామంటూ ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో గులాబీ నేతల పరోక్షంగా కాంగ్రెస్ విజయాన్ని అంగీకరించినట్లైందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ డెవలప్మెంట్ నినాదం ముందు బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి చూడాలి కౌంటింగ్ రోజున జూబ్లీ హిల్స్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో?

Story by Apparao, Big Tv

Related News

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త రూల్స్.. కేంద్రం కొత్త పోర్టల్.. ఇలా అప్లై చేయండి?

జీహెచ్‌ఎంసీలో డబుల్ బిల్లుల భారీ కుంభకోణం.. రూ. 70 కోట్ల నిధులు దారిమళ్లింపు!

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఏఐసీసీ సంచలన నిర్ణయం!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×