BigTV English

Longest Hyperloop Tube: ఆసియాలో పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్.. ఎన్ని మీటర్లంటే..

Longest Hyperloop Tube: ఆసియాలో పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్.. ఎన్ని మీటర్లంటే..

Longest Hyperloop Tube: స్పీడ్.. ఫ్యూచర్ జనరేషన్స్‌ని మరో స్థాయికి తీసుకెళ్లే ఫ్యాక్టర్. నేటి తరంలో వేగానికి సంబంధించి వచ్చే ఆవిష్కరణే.. భవిష్యత్‌లో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొస్తుంది. అలాంటి ఇన్నోవేషనే.. హైపర్‌లూప్. ఒక చోటు నుంచి మరో చోటికి.. విమానాన్ని మించిన వేగంతో.. గాలికంటే వేగంగా దూసుకెళ్లే ఈ హైపర్‌లూప్ టెక్నాలజీని.. అందరికంటే ముందే అందుబాటులోకి తెచ్చే విషయంలో.. భారత్ మరో అడుగు ముందుకేసింది. ఇది గానీ సక్సెస్ అయితే.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు తిరిగి చూస్తుంది.


భూమి మీద విమాన వేగంతో ప్రయాణం

అరగంటలో 350 కిలోమీటర్ల జర్నీ


ఫిఫ్త్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌గా హైపర్‌లూప్

హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌పై పట్టువదలకుండా ప్రయోగాలు చేస్తున్న దేశాల్లో భారత్ ఇప్పటికే ముందు వరుసలో ఉంది. ఇప్పటికే.. ఆసియాలో అతి పొడవైన 410 మీటర్ల హైపర్‌లూప్ ట్యూబ్‌ని సిద్ధం చేశారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌పై తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. లాంగ్ డిస్టెన్స్ హైపర్‌లూప్ సిస్టమ్‌ని అభివృద్ధి చేసే క్రమంలో.. 40 కిలోమీటర్ల టెస్టింగ్ ట్రాక్‌‌ని అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనకు.. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాగ్నెటిక్ లెవిటేషన్‌ సహా 3 రకాల టెక్నాలజీలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.

40 కిలోమీటర్ల హైపర్‌లూప్ ట్రాక్ అభివృద్ధికి ప్రతిపాదన

దీనికోసం.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో.. ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని డెవలప్ చేయనున్నారు. దీనిని.. మద్రాస్ ఐఐటీ చేసిన పరిశోధనల ఆధారంగా రూపొందించారు. ఇంకొన్ని రోజుల్లోనే.. మద్రాస్ ఐఐటీలో ఇంక్యుబేట్ చేసిన డీప్ టెక్ స్టార్టప్.. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. 40 కిలోమీటర్ల హైపర్‌లూప్ ట్రాక్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు.. రైల్వే శాఖ ఓకే చెప్పిందనే న్యూస్.. హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఆత్మనిర్భర్ భారత్, వికాస్ భారత్ 2047 దిశగా సాగుతున్న ప్రయాణంలో.. ఇదో కీలక మైలురాయిగా నిలవబోతుందని చెబుతున్నారు.

త్వరలోనే ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్

ఇక.. 40 కిలోమీటర్ల హైపర్‌లూప్ ట్రాక్‌ని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిని గనక అభివృద్ధి చేస్తే.. ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ హైపర్‌లూప్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇటీవలే.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఐఐటీ మద్రాస్‌లోని హైపర్‌లూప్ ట్రాక్ టెస్టింగ్ సెంటర్‌ని సందర్శించారు. అక్కడ డెవలప్ చేస్తున్న.. హైపర్‌లూప్ ట్యూబ్‌ని పరిశీలించారు. భారత్‌లో త్వరలోనే.. ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్ సిద్ధమవుతుందని చెప్పారు.

అత్యాధునిక రవాణా వ్యవస్థను అభివద్ధి చేసే దిశగా కీలక అడుగు

స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి.. దీనిని డెవలప్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న హైపర్‌లూప్ ప్రాజెక్ట్ టెక్నాలజీ.. ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల్లో మంచి ఫలితాలనే ఇచ్చింది. త్వరలోనే.. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. దేశంలో 40 కిలోమీటర్ల హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ ప్రతిపాదన.. అత్యాధునిక రవాణా వ్యవస్థను అభివద్ధి చేసే దిశగా ఓ ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. దీని ద్వారా హైపర్‌లూప్ టెక్నాలజీని వాణిజ్యపరంగా పరీక్షించేందుకు రూట్ క్లియర్ కానుంది.

గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం

ఈ 40 కిలోమీటర్ల ట్రాక్ ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌గా నిలవనుంది. దీనిని ఐఐటీ మద్రాస్ సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే.. గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న హైపర్‌లూప్ సిస్టమ్ ద్వారా.. కేవలం అరగంటలోనే 350 కిలోమీటర్లు ప్రయాణించేందుకు వీలవుతుంది. ఇప్పటికే.. ఐఐటీ మద్రాస్‌లో 410 మీటర్ల పొడవైన ప్రోటోటైప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. అక్కడ పాడ్ టెస్టింగ్ విజయవంతం అయ్యాయి.

ఐఐటీ మద్రాస్‌లో 410 మీటర్ల పొడవైన ప్రోటోటైప్ టెస్ట్ ట్రాక్

దాని ఆధారంగానే.. ఈ 40 కిలోమీటర్ల ట్రాక్‌ని నిర్మించేందుకు రైల్వే శాఖ, సంబంధిత సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఈ హైపర్‌లూప్ ప్రాజెక్ట్ కోసం.. ఇప్పటికే ఐఐటీ మద్రాస్‌కు 20 లక్షల డాలర్ల గ్రాంట్ అందించగా.. మరో 10 లక్షల డాలర్లు కేటాయించే ప్రతిపాదనలున్నాయి. ఈ హైపర్‌లూప్ ప్రాజెక్ట్.. భారత రైల్వే వ్యవస్థలో ఆవిష్కరణలకు ఓ నిదర్శనం. ఇది దేశ రవాణా సామర్థ్యాన్ని అమాంతం పెంచుతుంది. ఈ హైపర్‌లూప్ సిస్టమ్.. భవిష్యత్‌లో దేశ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

హైపర్‌లూప్.. ఫిఫ్త్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్

హైపర్‌లూప్.. ఫిఫ్త్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. ఇది గానీ సక్సెస్ అయితే.. ఈ ప్రపంచంలోనే గేమ్ ఛేంజర్ అవుతుంది. అట్లాంటిది ఇండియా నుంచే వచ్చిందంటే.. గ్లోబ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఇప్పటికే మద్రాస్ ఐఐటీలో.. హైపర్‌లూప్ సిస్టమ్ అభివృద్ధికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్నీ సరిగ్గా జరిగితే.. హైపర్‌లూప్ సిస్టమ్ విషయంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.

గాలికంటే వేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్

ఒక చోటు నుంచి మరో చోటికి గాలికంటే వేగంగా దూసుకెళ్లే హైపర్‌లూప్ టెక్నాలజీ కోసం అన్ని దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో భారత్ ఎంతో ముందుంది. మిగతా దేశాల కంటే ముందే హైపర్‌లూప్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేస్తోంది. అసలు.. హైపర్‌లూప్ ఏంటి? అది సక్సెస్ అయితే.. మనకు జరిగే మేలేంటి? రైల్వే శాఖ.. దీనిని ఇంత సీరియస్‌గా ఎందుకు తీసుకుంది? అనే ప్రశ్నలున్నాయి.

ఇండియన్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలో మారనున్న సీన్

కానీ.. హైపర్‌లూప్ అందుబాటులోకి వస్తే.. ఇండియన్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలో మొత్తం సీనే మారిపోతుంది. వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కూడా గంటలోనే చేరుకోవచ్చు. అదే.. హైపర్‌లూప్ స్పెషాలిటీ. భారత్‌లో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలు కూడా అప్పుడు చాలా దగ్గరైపోతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా అరగంట, గంటలోపే ప్రయాణించేందుకు వీలవుతుంది. దేశంలో జర్నీ టైమ్ గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోతుంది. ఇదే.. హైపర్‌లూప్ సక్సెస్ అయితే.. రాబోయే మేజర్ రెవల్యూషన్.

అయస్కాంత శక్తితో క్యాప్స్యూ‌ల్‌ని కదిలించే టెక్నాలజీ

భూమి మీద, గాలిలేని వాతావరణంలో.. అయస్కాంత శక్తితో హైపర్‌లూప్‌ క్యాప్స్యూల్‌ని కదిలించడమే ఈ టెక్నాలజీ మెయిన్ టార్గెట్. దీని కోసం ఓ ట్యూబ్ కావాలి. అందులో వాక్యూమ్ క్రియేట్ చేసి.. గంటకు వెయ్యి కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించేలా దానిని సిద్ధం చేస్తారు. ఈ హైపర్‌లూప్ కోసం కొన్నేళ్లుగా మద్రాస్ ఐఐటీ వివిధ డిజైన్లలో పాడ్స్‌ని తయారు చేసింది. ప్రస్తుతం.. ఏడో జనరేషన్ పాడ్‌పై ప్రయోగాలు చేస్తోంది ఆవిష్కార్ హైపర్‌లూప్ టీమ్.

410 మీటర్లలతో ఆసియాలోనే అతిపెద్ద టెస్ట్ ట్రాక్

ఇప్పటికే.. అమెరికాకు చెందిన వర్జిన్ సంస్థ.. ఓ క్యాప్స్యూల్ రెడీ చేసి.. 620 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ కూడా చేసింది. అలా.. మన దగ్గర కూడా పాడ్ రన్ చేసేందుకు వీలుగా.. 410 మీటర్లతో ఆసియాలోనే అతిపెద్ద హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ని తైయ్యూరు క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. హైపర్‌లూప్ ట్యూబ్‌లో అయస్కాంత శక్తి పాడ్‌ని గాల్లో తేలుస్తుంది. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ పుష్.. పాడ్‌ని ట్యూబ్‌లో ముందుకు తోస్తుంది. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే.. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి.

హైపర్ లూప్‌ని సక్సెస్ చేసేందుకు ప్రయత్నించిన మస్క్

ఈ హైపర్‌లూప్ ఐడియా ఎలాన్ మస్క్ మెదడులో పుట్టింది. ఇది.. అతని డ్రీమ్ ప్రాజెక్ట్! ఎలాగైనా సక్సెస్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. మస్క్ మధ్యలోనే వదిలేశాడు! కానీ.. మనోళ్లు మాత్రం గట్టిగా పట్టుకున్నారు! భారత్ ఒక్కటే కాదు చైనా లాంటి మిగతా దేశాలు కూడా ఈ హైపర్‌లూప్ సిస్టమ్‌పై ప్రయోగాలు చేస్తున్నాయి. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బెల్జియం దేశాల్లోనూ కొన్ని సార్టప్ కంపెనీలు హైపర్‌లూప్‌పై ప్రయోగాలు చేస్తున్నాయి.

హైపర్ లూప్‌తో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం

మన మద్రాస్ ఐఐటీ స్టూడెంట్స్ కూడా దీనిపై సీరియస్‌‌గా పనిచేస్తున్నారు. కచ్చితంగా హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌ని సక్సెస్ చేసి తీరతామని చెబుతున్నారు. ఈ ప్రయోగాలకు.. భారత రైల్వే శాఖ సహకారం అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయితే.. ముందుగా ముంబై, పుణె మధ్య హైపర్‌లూప్‌ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ టెక్నాలజీ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే.. హైపర్‌లూప్‌తో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశముంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×