IRCTC Jannat-E-Kashmir Tour: కాశ్మీర్. ఈ పేరు వినిగానే మనసులో తెలియని ఆహ్లాదకర భావన కలుగుతుంది. చుట్టూ మంచు పర్వతాలు, ఎత్తైన కొండలు, రోప్ జర్నీలు ఆహా అనిపిస్తాయి. ఆహా అనిపించే కాశ్మీర్ అందాలు చూడాలనుకునే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. జన్నత్-ఇ-కాశ్మీర్ టూర్ పేరతో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ టూర్ ఎన్ని రోజులు ఉంటుంది? టికెట్ ధర ఎంత ఉంటుంది? ఏ ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జన్నత్-ఇ-కాశ్మీర్ టూర్ పేరుతో స్పెషల్ ప్యాకేజీ
త్వరలో జమ్మూ నుంచి శ్రీనగర్ కు వందేభారత్ రైలు ప్రారంభం కానున్న నేపథ్యంలో IRCTC ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో మొత్తం 30 మంది ప్రయాణీకులకు అవకాశం కల్పించనుంది.
ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఏ ప్రాంతాలను కవర్ చేస్తుంది?
IRCTC జన్నత్-ఇ-కాశ్మీర్ టూర్ లో భాగంగా శ్రీనగర్, సోన్ మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ లను కవర్ చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ లక్నో విమానాశ్రయం నుంచి ప్రారంభం అవుతుంది. లక్నో నుంచి శ్రీనగర్ కు ఇండిగో ఎయిర్ లైన్ (6E-2026/2747) ద్వారా ఉదయం 8:25 గంటలకు పర్యటన ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రయాణీకులను హోటల్ కు తీసుకెళ్లడానికి, ఇతర గమ్యస్థానాలు, సందర్శనా స్థలాలను సందర్శించడానికి ప్రత్యేక బస్సును అందుబాటులో ఉంచుతారు. ఏప్రిల్ 24న, శ్రీనగర్ నుంచి లక్నోకు ఇండిగో ఎయిర్ లైన్ విమానంలో (6E-2305/2151) తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ విమానం శ్రీనగర్ నుండి మధ్యాహ్నం2 గంటలకు బయల్దేరి 2:40కి లక్నో విమానాశ్రయానికి చేరుకుంటుంది.
కాశ్మీర్ టూర్ ప్యాకేజీ ధరలు
IRCTC జన్నత్-ఇ-కాశ్మీర్ టూర్ ప్యాకేజీ కోసం ఒక్కో ప్రయాణీకుడు సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 52,550, డబుల్ ఆక్యుపెన్సీ అయితే, రూ. 49, 900, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 48950 చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైపర్ లూప్ ట్యూబ్, వేగం ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
కాశ్మీర్ టూర్ లో భాగంగా నాన్-AC వాహనంలోనే కాశ్మీర్ పర్యటన చేయిస్తారు. సందర్శనా స్థలాల్లోన్ని ఖర్చులను ప్రయాణీకులు పెట్టుకోవాల్సి ఉంటుంది. శ్రీనగర్, పహల్గామ్ లలోలగ్జరీ గదులలో వసతి సౌకర్యం ఉంటుంది. హౌస్ బోట్ లో ఒక రాత్రి బస ఉంటుంది. ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్లలో రోమింగ్ పని చేయకపోవచ్చు. ప్రయాణీకులు పోస్ట్ పెయిడ్ మొబైల్ నంబర్లను తీసుకెళ్లాలని IRCTC సూచించింది. మరిన్ని వివరాల కోసం, ప్రయాణీకులు ఈ 8287930911/ 8287930902 నెంబర్లను సంప్రదించాలని వెల్లడించింది. తక్కువ ధరలో కాశ్మీర్ పర్యటన అందుబాటులో ఉన్న నేపథ్యంలో పర్యాటకులు వినియోగించుకోవాలని సూచించారు. శీతాకాలం పోయి వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్ అందాలను చూసి ఎంజాయ్ చేయాలంటున్నారు.
Read Also: ‘రాధేశ్యామ్’ పూజా హెగ్డేలా రైలుకు వేలాడింది.. సొరంగం రావడంతో..