BigTV English
Advertisement

MLC Jeevan Reddy: పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?

MLC Jeevan Reddy: పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?

MLC Jeevan Reddy: ఎన్నికలు ఏవైనా తాను సంసిద్ధమంటూ రంగంలోకి దిగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈసారి మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ఎందుకు బరిలోకి దిగడం లేదు? పోటీ చేయడం వద్దనుకున్నారా? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు వేసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇంకా అలక వీడలేదా?.. లేకపోతే ఈ ఎన్నికకు దూరంగా ఉంటే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ లభించిందా? ఇక చాల్లే అనుకుని గౌరవప్రదంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని అనుకుంటున్నారా..? అసలు జీవన్‌రెడ్డి రాజకీయ భవితవ్యయంపై ఇంత చర్చ? ఇన్ని సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి ?


సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాక అసలు సిసలు కాంగ్రెస్ వాదిగా ఫోకస్ అయ్యారు జీవన్‌రెడ్డి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పట్ల అంత కమిట్‌మెంట్‌తో ఉన్న వ్యవహరించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి తనకు తాను అర్ధాంతరంగా బయటకొస్తే బాగుండదు కాబట్టి కొనసాగుతున్నారంటున్నారు. పార్టీలో సీనియర్‌మోస్ట్ అయిన ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారంట.

2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత సంజీవ్‌కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో మొదలైన లొల్లితో.. పెద్దాయన జీవన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది తయారైంది. సంజీవ్ చేరిక సమయంలోనే జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్ బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనలో మాత్రం ఆ అసంతృప్తి కొనసాగుతూనే ఉందంట.


ఆ క్రమంలో తన ప్రత్యర్ధినే పార్టీలో చేర్చుకోవడంతో నొచ్చుకున్న జీవన్‌రెడ్డి .. రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారో? , లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచన తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారో? కాని పొలిటికల్‌గా మనుపటి దూకుడు ప్రదర్శించడం లేదు. సంజీవ్ ఎపిసోడ్‌తో పార్టీ అధిష్ఠానంతో కూడా గ్యాప్ ఏర్పడినట్లు కనిపిస్తుండటంతో.. మార్చి నెలాఖరుకి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక ఏకంగా రాజకీయాలకే స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అలాంటిదేమీ లేదని.. జీవన్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని అధిష్టానం నుంచి హామీ లభించిదన్న టాక్ కూడా వినిపిస్తుంది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తాను ఇంతకాలం నమ్ముకున్న పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదనే బాధ జీవన్ రెడ్డిలో ఉందని ఆయన అనుంగ అనుచరులు అంటున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు.. జగిత్యాల ఎపిసోడ్ ఆయనలో ఆ బాధను పలుమార్లు బయటపెట్టింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్‌పై పోరాటం చేసిన తనకు.. పదేళ్ల తర్వాత అధికారం దక్కాక పెద్దగా సముచిత స్థానం దక్కకపోవడం జీవన్ రెడ్డిని తీవ్రంగా కలిచి వేస్తుందంట.

Also Read: ఉన్నది కాస్త ఊడింది.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వమంగళం పాడిన బాపు..!

ఈ పరిణామాలే జీవన్ రెడ్డి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. ఆయన సుముఖంగా లేకున్నా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చి ఓటమి మూట గట్టుకున్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా తీసుకుని గెలిస్తే ఓకే.. లేదంటే, ఇక తన పనైపోనట్టే అనేది నిరూపించేందుకే ఎమ్మెల్సీ టిక్కెట్ ను ఆఫర్ చేసి ఉంటారని జీవన్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు అనుమాన పడుతున్నారంట.

ఇలాంటి సందేహాలు, అనుమానాలతో పాటు.. పార్టీతో పెరిగిన గ్యాప్, తనకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వంటివన్నీ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్ నిరాకరించేందుకు కారణమయ్యాయంట. అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దాంతో ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తారన్న ప్రచారం మొదలైంది. మరి పెద్దాయన పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×