SA20 final: సన్ రైజర్స్…అభిమానులకు మరో ట్రీట్ వచ్చేసింది. మరోసారి ఫైనల్ కు చేరింది సన్ రైజర్స్. సౌత్ ఆఫ్రికా 20 లీగ్ లో మరోసారి ఫైనల్ కు చేరింది కావ్య పాప కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ). SA20 టి20 లీగ్ లో తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో పార్ల్ రాయల్స్ జట్టు పైన ( Paarl Royals )… సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముచ్చటగా మూడోసారి ఫైనల్ కు చేరింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ).
Also Read: Ind vs Eng 1st Odi: నీ అవ్వ తగ్గేదేలే…నాగపూర్ వన్డేలో పుష్ప రచ్చ మామూలుగా లేదుగా!
ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ) 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్ కు చేరింది. ఇక ఫైనల్ బరిలో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుతో ( Mumbai Indians Cape Town ) తల పడబోతుంది సన్రైజర్స్. ఇక ఈ మ్యాచ్ లో… పార్ల్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టి20 ఫార్మాట్ లో ఈ స్కోర్ భారీ దేమి కాదన్న సంగతి తెలిసిందే. 200 ప్లస్ స్కోర్ చేసి ఉంటే ఆ జట్టు గెలిచి ఉండేది. అయితే… ఈ ఇన్నింగ్స్ లో… పార్ల్ రాయల్స్ ప్లేయర్లలో కొంతమంది మాత్రమే రాణించారు.
అందులో పార్ల్ రాయల్స్ ఓపెనర్ లహున్ ఒక్కడే 59 పరుగులు.. చేయడం జరిగింది. 41 బంతుల్లో 59 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఆ తర్వాత మిచెల్ ఓవెన్ డక్ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన రూబిన్ హేర్మన్… అద్భుతంగా రానించి… జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇతను 53 బంతుల్లో 81 పరుగులు చేశాడు. రూబిన్ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు అలాగే ఎనిమిది బౌండరీలు ఉన్నాయి.
అనంతరం వచ్చిన కెప్టెన్ డేవిడ్ మిల్లర్ ఆరు పరుగులు అలాగే దినేష్ కార్తీక్ రెండు పరుగులకే వెనుతిరిగారు. ఇలా మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడంతో నిర్ణీత 20వ వాలలో 175 పరుగులు మాత్రమే చేసింది పార్ల్ రాయల్స్ ( Paarl Royals ). అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ) 19.2 ఓవర్లలోనే 177 పరుగులు చేసి విజయం సాధించింది. చేజింగ్ చేసే క్రమంలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ). కావ్య పాప జట్టులో టోనీ ఒక్కడే 78 పరుగులతో దుమ్ము లేపాడు. 49 బంతుల్లో 78 పరుగులు చేసిన టోనీ 11 బౌండరీలు అలాగే రెండు సిక్సార్లు బాదాడు.
Also Read: Travis Head: మళ్లీ ఇండియన్స్ ను రెచ్చగొట్టిన హెడ్… ఆ వేలు చూపించి మరి?
జోర్దార్ హేర్మన్ 69 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ముచ్చటగా మూడోసారి… సన్రైజర్స్ ఫైనల్ కు చేరింది. 2023, 2024 అలాగే ఈ 2025 సీజన్లో కూడా సన్రైజర్స్… ఫైనల్ కు చేరే రికార్డు సృష్టించింది. కెప్టెన్ మర్కరం కెప్టెన్సీలో ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ). ఈసారి కూడా ఛాంపియన్ గా నిలుస్తుందని అందరూ అంటున్నారు. ఇక ఈ టోర్నమెంట్.. ఫైనల్ మ్యాచ్ ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape ) మధ్య రేపు రాత్రి 9 గంటలకు జరిగింది.
– Champions in 2023.
– Champions in 2024.
– Qualified for the finals in 2025*.THE ORANGE ARMY OF MARKRAM IN SA20 – It's Sunrisers Eastern Cape 🧡 pic.twitter.com/abZGqfGt2z
— Johns. (@CricCrazyJohns) February 6, 2025