BigTV English

MLC Kavitha: మోదీ టార్గెట్‌గా కవిత పోస్ట్.. బీఆర్ఎస్‌లో కొత్త జోష్

MLC Kavitha: మోదీ టార్గెట్‌గా కవిత పోస్ట్.. బీఆర్ఎస్‌లో కొత్త జోష్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై విడుదల అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. 10 రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత అందరినీ కలుస్తానని అప్పట్లో ప్రకటించారు. ఆగస్టు చివరి వారంలో ఆమెకు బెయిల్ మంజూరైంది. అయితే ఏమైందో ఏమో గాని ఆమె జైలు నుంచి విడుదలై 3 నెలలు గడుస్తున్నా బయట కనిపించడం లేదు. ఎవరిని కలవడం లేదు. ఈ మధ్య కాలంలో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ చేయించుకుంటే ఆమె కవిత గైనిక్ సమస్యలతో భాదపడుతున్నట్లు వెల్లడించారని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు.

తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఆమె మానసికంగా దెబ్బ తిన్నారని , కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆమె వర్గీయులు ప్రచారం చేశారు. జైల్లో ఉన్నప్పుడు రుద్రాక్ష మాల కావాలని కోర్టును రిక్వెస్ట్ చేసిన కవితకు అనుమతి మంజూరైంది. అప్పటి నుంచి ఆమె ఆ రుద్రాక్ష మాల ధరించే ఉన్నారు. ఇటీవల ఏఐజీ ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ కోసం వచ్చిన రోజు కూడా ఆమె మెడలో రుద్రాక్ష మాల కనపించారు. దాంతో ఆమె దీక్షలో ఉన్నారని కొందరు చెప్తున్నప్పటికి అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం తెలియడటం లేదు. ఆమె కాని, ఆమె కుటుంబసభ్యులు కాని వెల్లడించడం లేదు. ప్రస్తుతానికి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో ఎవరికి తెలియదు.కేసీఆర్ తో పాటుగా ఎర్రవల్లి ఫాం హౌస్ లోనే కవిత ఉంటున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతుంది.


బతుకమ్మ రోజు కవిత బయటకు వస్తారని అందరూ భావించినప్పటికీ ఆమె మాత్రం పూర్తి స్థాయి విశ్రాంతిలోనే ఉన్నారు. ఎక్కడ కనిపించలేదు. జాగృతి కమిటీలు రద్దు చేసిన కవిత కొత్త కమిటీల పైన దృష్టి పెట్టలేదని తెలుస్తుంది. ఆమె గతంలో ఉన్న మాదిరిగా ప్రభుత్వం పై దూకుడు కొనసాగిస్తారా? లేకపోతే సైలెంట్ అవుతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ప్రస్తుతానికైతే కవిత ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆమెకు ఏమైందో చెపుతారనుకుంటే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదు. అన్న కేటీఆర్ కూడా దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

Also Read: వ్యూహం ఫెయిల్.. ఫ్రస్ట్రేషన్‌లో కేటీఆర్ ?

ఢిల్లి లిక్కర్ కేసులో బెయిల్ పై మాత్రమే బయట ఉన్న కవిత కేసు పూర్తి కాలేదని భయపడుతున్నారా అన్న చర్చ కూడా జరిగింది .. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కవిత తనను జైల్లో పెట్టిన వారిని ఎవరినీ వదలను అని హెచ్చరించారు. తరువాత ఏమైంది ఏమో గాని ఆమె మాత్రం సైలెంట్ అయిపోయారు. అయితే పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమె వచ్చే ఏడాదిలో ఆమె బయటకు వస్తారని.. జాగృతి నూతన కమిటీల ఏర్పాటు చేస్తారని, బీసీ సబ్ ప్లాన్ పై జిల్లాల్లో పర్యటించి వరుస సమీక్షలు నిర్వహిస్తారని.. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాలు రూపొందిస్తారంట.

దానికి తగ్గట్లే కవిత గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తున్నారు. తాజాగా ఆమె ఆమె ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యారు.  ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్‌గా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. అఖండ భారతంలో అదానికో న్యాయం. ఆడబిడ్డకో న్యాయమా? అని ఆమె ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్న అదానీనని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా? అని కవిత తన ట్వీట్లో ఎత్తి పొడిచారు.

అదానీ గ్రీన్ సంస్థ డైరెక్టర్లకు అమెరికా న్యాయశాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. షేర్ మార్కెట్ ప్రారంభానికి ముందే ఈ నోటీసులు రావడంతో.. అదానీ గ్రూప్స్ భారీ నష్టాన్ని చవిచూశాయి. ఏకంగా రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. మరోవైపు పొలిటికల్ పరంగానూ రచ్చ రచ్చ అవుతోంది. ప్రతిపక్ష పార్టీలు అదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. జేపీసీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోడీని ఎత్తిపొడుతస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. ఏదేమైనా బెయిల్ తర్వాత కవిత సోషల్ మీడియాలోనైనా కనిపించడం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోందంట.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×