BigTV English

Putin Gift Korea: కిమ్ జాంగ్‌కు సింహాలు, ఎలుగుబంట్లు, పక్షుల భారీ కానుకలు.. పుతిన్‌తో దోస్తీ మామూలుగా ఉండదు

Putin Gift Korea: కిమ్ జాంగ్‌కు సింహాలు, ఎలుగుబంట్లు, పక్షుల భారీ కానుకలు.. పుతిన్‌తో దోస్తీ మామూలుగా ఉండదు

Putin Gift Korea| ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా నాటో దళాలు, యూరోప్ దేశాలు నిలబడితే.. ఒక్క ఉత్తర కొరియా మాత్రమే ధైర్యంగా రష్యాకు మద్దుతుగా వచ్చింది. యుద్ధంలో రష్యా సాయం కోసం ఉత్తర్ కొరియాకు చెందిన 10,000 మంది సైనికులు పోరాడుతున్నారు. కొరియా సాయానికి ఫుల్ హ్యాపి అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం చేయడానికి భారీ కానుకలు పంపించారు. రష్యా రాజధాని మాస్కో నుంచి ఉత్తర్ కొరియా రాజధాని ప్యోంగ్ యాంగ్ వరకు విమాన మార్గంలో 70 వన్య మృగాలను తరలించారని సమాచారం.


రష్యాకు చెందిన ప్రకృతి వనరులు, పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కో లోని జూపార్క్ నుంచి కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్ సెంట్రల్ జూ కు 70 వన్యమృగాలు, పశువుల డాక్టర్ల బృందంతో సహా బయలుదేరింది. ఈ మృగాలలో ఒక ఆఫ్రికా సింహం, రెండు బ్రౌన్ ఎలుగుబంట్లు, అయిదు తెల్లని కాకటూ చిలుకలు, 25 రకాల అందమైన ఫీసెంట్ పక్షులు, 40 మాండరిన్ బాతులు ఉన్నాయి. ఈ అంశంపై రష్యా పర్యావరణ మంత్రి అలెగ్జాండర్ కోజ్లోవ్ మాట్లాడుతూ.. “మా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరపున కొరియాకు కానుకలివి. రష్యా, ఉత్తర కొరియా స్నేహం కేవలం సైన్యం, వ్యాపార రంగాలలోనే కాదు. వన్య సంరక్షణ రంగంలో కూడా ప్రారంభమైంది. రష్యా, కొరియా స్నేహంలో ఇరు దేశాల జూ పార్క్ లు కూడా భాగమయ్యాయి” అని చెప్పారు.

Also Read: ప్రపంచంలో ఖరీదైన పాస్‌పోర్ట్ ఈ దేశానిదే.. ఇండియా కన్నా చీప్‌గా మరో దేశంలో..


ఇంతకుముందు ఏప్రిల్ 2024లో కూడా రష్యా నుంచి 40 వన్యమృగాలు కొరియాకు పంపించారు. రష్యా సమాచారం ఏజెన్సీ తాస్ (TASS) ప్రకారం.. పుతిన్ ప్రభుత్వం గద్దలు, చిలుకలు, కొండ చిలువలు, లాంటి 40 జంతువులను కొరియా జూ లకు తరలించారు. జూన్ 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కొరియాకు బయలుదేరే ముందుక ఉత్తర కొరియా శాసకుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా తన స్నేహితుడికి కానుకగా రెండు పుంగ్సాన్ జాతి వేట కుక్కలు బహుకరించాడు. ఈ కుక్కలు చాలా అరుదుగా లభిస్తాయి.

మాస్కో జూ డైరెక్టర్ స్వెత్లానా అకులోవా మాట్లాడుతూ.. కొరియాలో విద్య, శాస్త్రియ పరిశోధనలకు ఈ జంతువులు ఉపయోగపడతాయని అన్నారు.

జూన్ 2024లో పుతిన్, కిమ్ జాంగ్ మధ్య కీలక మిలిటరీ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలపై దాడి జరిగినప్పుడు మరో దేశం సైనిక సాయం అందిస్తుంది. ఈ కారణంగానే నెల రోజుల క్రితం ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్దంలో పోరాడేందుకు 10000 మంది కొరియా సైనికులు వచ్చారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో కుర్స్క్ ప్రాంతంలో కొరియన్ సైనికులు భీకరంగా పోరాడుతున్నారని రష్యా మీడియా కథనాలు ప్రచురించింది.

అమెరికాకు బద్ధ శత్రువైన ఉత్తర కొరియాలో ప్రజలు ఆహార కొరతతో విలవిల్లాడుతున్నారు. విపరీత వరదలు, కొండచరియలు విరిగిపడడం కారణంగా అక్కడ మానవతా సంక్షోభ పరిస్థితులున్నాయి. వీటికి తోడు.. ఉత్తర కొరియా అమెరికా ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశంతో ఇతర దేశాలు వాణిజ్యం చేయలేని పరిస్థితి.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×