BigTV English

Dubbaka Politics: దుబ్బాక ఎమ్మెల్యే, ఎంపీల వార్..

Dubbaka Politics: దుబ్బాక ఎమ్మెల్యే, ఎంపీల వార్..

Dubbaka Politics: దుబ్బాక అభివృద్ధిపై ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డిల మధ్య మాటల యుద్దం మొదలైంది.. ఆ ఇద్దరి డైలాగ్ వార్‌తో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌తో ఎంపీ సీరియస్ అవుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంపీగా ఈయన, ఎంపీగా ఈయన ఉంటే ఎమ్మెల్యేగా ఆయన ఉంటూ వచ్చారు .. ఆ క్రమంలోఇద్దరు నేతల మధ్య వైరం ఇప్పటిది కాదు. ఇప్పుడా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మళ్లీ విభేదాలు మరోసారి బహిర్గతం అవుతున్నాయి..
ఎంపీ, ఎమ్మెల్యేల వార్


దుబ్బాకగా మారిన దొమ్మాట

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం. గతంలో దొమ్మాటగా పిలవబడే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ రాను రాను దుబ్బాకగా మారింది. 2020లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సతీమణి సోలిపేట సుజాతను అభ్యర్థిగా ఎంపికచేయగా… బీజేపీ నుంచి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు బరిలో నిలిచారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు జరిగినా ఈ పోరులో రఘునందన్ రావు వెయ్యి పై చిలుకు ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.


దుబ్బాక సెగ్మెంట్లో రఘునందన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామాలు

అప్పటికి మెదక్ ఎంపీగా ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. రఘునందన్ గెలవడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి అప్పటి నుంచి దుబ్బాకపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటు ఎమ్మెల్యే రఘునందన్, అటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలా స్వగ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో ఉండటంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయం సాగేది. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగేది. అలాగే తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేను కాబట్టి నియోజకవర్గంపై బీఆర్ఎస్ సవతి తల్లి ప్రేమ చూపుతుందని…నిధులు ఇవ్వడంలేదని బహిరంగంగానే ఆరోపించారు రఘునందన్.

2023లో రఘునందన్ ని ఓడించిన ప్రభాకర్‌రెడ్డి

సీన్ కట్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 55 వేల ఓట్ల తేడాతో రఘునందన్‌ని ఓడించిన ప్రభాకర్‌రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అయ్యారు . లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి రఘునందన్ రావు మెదక్ ఎంపీగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. దాంతో అప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉంటే రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యే. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే రఘునందన్ ఎంపీ.. ఇలా ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఎక్కువవుతునే ఉంది.

దుబ్బాకపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న రఘునందన్

రఘునందన్ ఎంపీగా ఉన్నా దుబ్బాకపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అదలా ఉంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. గతంలో ఎవరు కూడా దుబ్బాకని పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి పెద్దగా నిధులు రాలేదని. అందుకే నియోజవకర్గ అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కొన్ని పనులు మంజూరు చేయించుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే రాజకీయాలకతీతంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్దికి పనిచేద్దామని పిలుపునిచ్చారు

Also Read: గుడివాడ అమర్నాథ్‌కు జగన్ షాక్.. ఆ పదవి తొలగింపు?

కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్‌పై మెదక్ ఎంపీ రఘునందన్ స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అదే చెబుతున్నానని అప్పుడు అది నిజం కాదని వాదించిన కొత్త ప్రభాకర్ రెడ్డే బీఆర్ఎస్ హయాంలో దుబ్బాక ఎంత నిర్లక్ష్యానికి గురైదో ఒప్పుకున్నారని యద్దేవా చేశార. మీ కిప్పుడు సీఎంలు, మంత్రులు కలుస్తున్నారని, కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం, మంత్రులు అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు కాదని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి ఉండేదని చురకలు అంటించారు.

బీఆర్ఎస్ బహిష్కరించిన తర్వాత బీజేపీలో చేరిన రఘునందన్

ఆ క్రమంలో మరోసారి రఘునందర్, కొత్త ప్రభాకర్ రెడ్డిల మధ్య నియోజకవర్గ అభివృద్దిపై రచ్చ మొదలైంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావులు గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవారు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత రఘునందన్ బీజేపీలో చేరారు. అందుకే ఈ రాజకీయ వైరం మరింత ముదిరిందంటున్నారు. మరి ఇద్దరు నేతలు ఓకే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడంతో దుబ్బాకలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×