Operation Sindoor India Weapons| పాకిస్తాన్ లో భారత్ సైన్యం వైమానిక దాడులు చేయడమే కాదు.. చాలా కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాల లోపలికి చొచ్చుకొనే విధంగా క్షిపణులతో దాడి చేశాయి. ఇదంతా దాడి చేయడానికి ఇండియా ఉపయోగించిన హై టక్నాలజీ ఆయుధాలు, మిసైల్స్, రాఫెల్ ఫైటర్ జెట్ల ద్వారా సాధ్యమైందని జాతీయ మీడియా కథనం.
మీడియా నివేదిక ప్రకారం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, హామర్ స్టాండాఫ్ ఆయుధాలు, కామికాజ్ డ్రోన్స్ ని పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ప్రయోగించింది. ఈ మిసైల్స్, డ్రోన్ ప్రయోగాల ద్వారానే పాకిస్తాన్ లో జైషె మొహమ్మద్, లష్కరె తయిబా లాంటి ప్రముఖ ఉగ్రవాద సంస్థల మొత్తం 9 స్థావరాలపై దాడులు చేసి నాశనం చేసింది.
ఇప్పుడు ఈ విజయాన్ని ఎత్తి చూపుతూ ట్విట్టర్ ఎక్స్‌లో ఇండియన్ మిలిటరీ రాఫెల్ (Rafale Fighter Jets) యుద్ధ విమానాల ప్రత్యేకత గురించి ఒక ట్వీట్ చేసింది. అవి ఆకాశంలో ఎగరడమే కాదు ఆకాశంలో డామినేట్ చేస్తాయి అని ట్విట్ లో రాశారు. రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ్ రాయ్ ఇండియాన్ ఆర్మీ వద్ద ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలు నిరుపయోగంగా ఉన్నాయని.. వాటిని పెట్టుకొని ఆర్మీ పూజ చేస్తోందని హేళనగా వ్యాఖ్యలు చేశారు.
ఒక బొమ్మ విమానాన్ని చూపిస్తూ.. దానిపై రాఫెల్ అని రాసి.. దానికి ముందు నిమ్మకాయ, పచ్చిమిర్చి పెట్టి చూపిస్తూ.. జాతీయ మీడియాతో ఇలా అన్నారు. “దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మన దేశ యువత ప్రాణాలు కోల్పోయింది. కానీ మన ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితం అయింది. అలాంటి ఉగ్రవాదులను నలిపేస్తాం, ఉగ్రవాదాన్ని అణచివేస్తామని మాటలు చెప్పడం వరకే పరిమితమైంది. రాఫెల్ యుద్ధ విమానాలు నిమ్మకాయ, పచ్చిమిర్చి పెట్టి హాంగార్ల లో (విమానాలు పార్కింగ్ చేయు స్థలం) పార్కింగ్ చేయడానికి మాత్రమే పరిమితమయ్యాయి. వారు ఉగ్రవాదులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు. ఉగ్రవాదులకు సహకారం అందించేవారిని ఎప్పుడు శిక్షిస్తారు” అని ప్రశ్నించారు.
2019లో రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు వచ్చినప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ వాటికి నిమ్మకాయలు, మిర్చీలు పెట్టి పూజలు చేశారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ అవహేళన చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అజయ్ రాయ్ వ్యాఖ్యానించిన కొంత సమయానికే పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ పైలట్లు విరుచుకుపడ్డాయి. ఇప్పుడు ఇండియన్ మిలిటరీ.. అజయ్ రాయ్ కు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ రాఫెల్ యుద్ధ విమానాలు గాల్లో ఎగరడమే కాదు.. ఆకాశాన్ని సొంతం చేసుకుంటాయని పోస్ట్ చేసింది.
Also Read: పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్న 7 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు.. ఇక వీరికి మూడినట్లే..
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆపరేషన్ సిందూర్ నిర్వహింంచింది. ఈ ఆపరేషన్ లో రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు మైరేజ్, మిగ్ 20 యుద్ధ విమానాలు ఉపయోగించి వాటి ద్వారా 450 కిలోమీటర్ల రేంజ్ గల స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ (మరోపేరు స్టార్మ్ షాడో), హ్యామర్ గ్రౌండ్ బాంబులను ప్రయోగించి విజయం సాధించింది.
Rafale doesn’t just fly, it dominates. The sky belongs to India now. 💪🇮🇳#operation_sindoor pic.twitter.com/jzlUM7Jyt3
— Indian Military (@Ind_Military) May 7, 2025