Priyanka Chopra: ప్రపంచ ఫ్యాషన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూసే మెట్ గాలా ఈవెంట్ మొదలైంది. ఈ ఈవెంట్లో ఒకరితో ఒకరు పోటీపడుతూ.. భారతీయ నటీమణులు కూడా అదరగొడుతున్నారు. రెడ్ కార్పెట్ వేడుకలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) – నిక్ జోనస్ (Nick Jonas) జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ వేడుక కోసం ప్రియాంక చోప్రా ధరించిన డైమండ్ పీస్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె ధరించిన ఈ హారం మిరుమిట్లు గొలిపేలా ఉంది.
ప్రియాంక చోప్రా ధరించిన గ్రీన్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా..?
దీంతో అందరూ ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక దీని విషయానికి వస్తే.. ఇది ప్రఖ్యాత బల్గరి బ్రాండ్ నెక్లెస్. బల్గరి పాలీ క్రోమా హై జువెలరీ కలెక్షన్ ని మెట్ గాలా 2025 ఈవెంట్లో ప్రియాంక చోప్రా ప్రదర్శించింది. దీనిని మాగ్నస్ ఎమరాల్డ్ నెక్లెస్ అని పిలుస్తారు. ఇది పచ్చ డైమండ్ తో డిజైన్ చేయడం అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. 241.06 క్యారెట్ల ఎమరాల్డ్ తో ఈ నెక్లెస్ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల హారం. అరుదైన రాళ్లతో రూపొందించిన బల్గరీ తన ఇన్స్టా లో వెల్లడించింది. ఇకపోతే ఇంకా ఏడాది జామ్ నగర్ లో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో భాగంగా నీతా అంబానీ ఈ పచ్చ నెక్లెస్ తో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పుడే ఆ నెక్లెస్ ధర కోట్లలో ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఈమె ధరించిన హారంపై కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ నెక్లెస్ ఖరీదు ఎంత అనేది బల్గారి సంస్థలు వివరాలు వెల్లడించలేదు. కానీ సుమారుగా రూ.10 నుండీ రూ.12 కోట్లకు పైగా దీని ధర ఉంటుందని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని ఎగ్జాక్ట్ ధర ఎంత అన్నది ఇప్పటివరకు తెలియలేదు.
ప్రియాంక చోప్రా సినిమాలు..
ఇక ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు (Maheshbabu) సరసన రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ SSMB -29లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఇప్పుడు మెట్ గాలా కోసం ఈమె కాస్త విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రియాంక చోప్రా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ(Atlee ) కాంబినేషన్లో వస్తున్న #AA22 అనే మూవీలో నటిస్తోంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఆమె నటించలేదు. మరొకవైపు క్రిష్ 4 లో మాత్రం ప్రియాంక చోప్రా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ క్రిష్ 4 ప్రియాంక చోప్రాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ALSO READ:SriNidhi Shetty: 10వ తరగతికే జీవితం అయిపోయింది..ఆ నరకం నుండీ బయటపడ్డానికి ఎన్నో కష్టాలు..!