BigTV English

Mudragada Family: ప్రత్తిపాడులో ముద్రగడ కూతురు ఎంట్రీ.. ఇక నుంచి సమరమే..!

Mudragada Family: ప్రత్తిపాడులో ముద్రగడ కూతురు ఎంట్రీ.. ఇక నుంచి సమరమే..!

Mudragada Family: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చేది ముద్రగడ పద్మనాభం పేరే. అక్కడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పనిచేసిన ముద్రగడ కాపు నేతగా ప్రస్థానం మొదలుపెట్టారు. కాపునాడు వ్యవస్థాపకుడు దివంగత వంగవీటి రంగా వారసుడిగా అందరికీ సుపరిచితులయ్యారు. ప్రత్తిపాడులో ఓటమి తర్వాత ఆ సెగ్మెంట్లో అడుగుపెట్టడానికి ఇష్టపడని ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆయన వారసులే అక్కడ ప్రత్యర్ధులుగా రాజకీయం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొడుకు గిరి వైసీపీ ఇన్చార్జ్‌గా కొనసాగుతుంటే, జనసేన ఇన్చార్జ్ పదవి కోసం కుమార్తె క్రాంతి ప్రయత్నిస్తున్నారట. ఆ క్రమంలో పెద్దాయన పొలిటికల్ స్టాండ్ చర్చనీయాంశంగా మారిందిప్పుడు.


ఒకప్పుడు ముద్రగడ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ప్రత్తిపాడు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఒకప్పుడు ముద్రగడ ఫ్యామిలికి కంచుకోటగా వెలుగొందింది. ముద్రగడ పద్మనాభం తండ్రి విరరాఘవరావు ప్రత్తిపాడు నుంచి 1962, 67 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ముద్రగఢ పద్మనాభం 1978లో జనతాపార్టీ మొదటిసారి ప్రత్తిపాడు నియోజకవర్గంలో విజయం సాధించారు. తర్వాత 1983 లో స్వతంత్ర అభ్యర్థిగా సత్తా చాటుకున్నారు. 1985లో టీడీపీ నుంచి, 1989లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి వరుస విజయాలు సాధించి అయా ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు.


1994లో ఓటమి తర్వాత ప్రత్తిపాడుపై అలిగిన ముద్రగడ

1994 ఎన్ని్కల్లో తిరిగి కాంగ్రెస్ నుంచి పోటి చేసిన ముద్రగడ పద్మనాభాన్ని ప్రత్తిపాడు ఓటర్లు తిరస్కరించడంతో అయిన ఆ సెగ్మంట్ పై అలిగి ఇక ప్రత్తిపాడు రాజకీయాల్లో అడుగుపెట్టనని శపదం చేసి బయటికి వచ్చేశారు. తర్వాత టీడీపీలోకి వచ్చి 1999లో ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా విజయం సాధించగలిగారు. 2004 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటి చేసి ఓడిపోయిన ముద్రగడ మళ్లి కాంగ్రెస్ బాట పట్టారు. అప్పటి సీఎం వైఎస్ 2009 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటి చేయమంటే తిరస్కరించిన ముద్రగడ కాపు ఓటర్ల లెక్కలతో పిఠాపురం బరిలోదిగి ఓటమి మూట కట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఏమనుకున్నారో ఏమో తిరిగి ప్రత్తిపాడు నుంచి పోటి చేసి చేతులు కాల్చుకున్నారు.

2024 ఎన్నికల ముందు వైసీపీ బాట పట్టిన ముద్రగడ

2014 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన అయిన 2024 ఎన్నికల ముందు కోడుకు ముద్రగడ గిరితో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు నేతగా ఉన్న అయిన జనసేనాని, పవన్ కళ్యాన్‌ను వ్యతిరేకించి వైపీలో చేరటంలో కాపు సంక్షేమ సంఘం ముద్రగడను తమ సామాజిక వర్గం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.. అదలా ఉంటే ప్రస్తుతం వైసీపీలో ఉన్న ముద్రగడ రాజకీయ భవితవ్యం తిరిగి ప్రత్తిపాడుతోనే ముడిపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ ఇన్చార్జ్‌గా ముద్రగడ కుటుంబం నుంచి మూడో తరం నాయకుడిగా ముద్రగడ గిరి బాబు కొనసాగుతున్నారు.

పవన్ కాళ్యాణ్‌ను ఓడిస్తానని శపధం చేసిన పద్మనాభం

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజల్లోకి విసృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమనాయకుడి హోదాలో తమ కుమారిడితో వైసీపీలో చేరి పిఠాపురం ఎమ్ఎల్ఎగా పవన్ కళ్యాణ్ గెలిస్తే పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని భీకర శపథం చేశారు. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిన పద్మనాభం వైసీపీ దారుణ ఓటమి తర్వాత కూడా ఆ పార్టిలోనే కొనసాగుతానంటూ తన పేరు ముద్రనాభరెడ్డిగా మార్చుకున్నట్లు ప్రకటించారు. దానిపై అటు కాపులు, ఇటు రెడ్డి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

Also Read: 17 ఏళ్ల యువతికి పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా డాక్టర్లు, నిజంగా అద్భుతం

పార్టీలో ముద్రగడకు ప్రాధాన్యత పెంచిన జగన్

పార్టీ కోసమే పేరు మార్చుకున్నారని భావించడంతో జగన్ కూడా ముద్రగడకు సమూచిత స్థానం కల్పించారు. దీంతో జగన్ ముద్రగడ పద్మనాభంకు స్టేట్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో స్థానం కల్పించి కుమారుడి గిరిబాబుకి ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలీ కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలు తండ్రి, కొడుకులు చురుగ్గా పాల్గొంటున్నారు. ముద్రగడ గిరిబాబు ప్రజలతో మమేకమవుతూ వైసీపీ బలోపేతానికి తన వంతూ ప్రయత్నాలు చేస్తున్నారు.

Story By Rami Reddy, Bigtv

Related News

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

Big Stories

×