Big Stories

Operation Kapu in YCP: పవన్‌ను పవర్ బ్రేకులు! ఆపరేషన్ కాపు!

Operation Kapu in YCP
 
- Advertisement -

దీనికోసం వైసీపీ.. ఆపరేషన్‌ కాపు వ్యూహాన్ని అమలు చేస్తోందట. కీలకమైన నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం మాజీలను.. వైసీపీ ఆహ్వానిస్తోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మాకినీడి శేషు కుమారుడిని ఫ్యాన్ పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. దీంతో పాటు మరికొందరు జనసేన నేతలనూ వైసీపీలో చేర్చుకోవటం ద్వారా కాపు సామాజికవర్గానికి దగ్గరయ్యే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. ఎక్కువ నేతలను ఆకర్షిస్తే.. కాపుల్లో చీలిక వస్తుందని.. అది తమ పార్టీకి ఉపయోగంగా మారుతుంది అనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. వీరి చేరిక ద్వారా పవన్ కల్యాణ్ గెలుపునకు చెక్ పెట్టాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. కీలకమైన కాపు సామాజికవర్గం నేతలంతా వైసీపీ వెంటే ఉన్నారనే అంశాన్ని జనంలోకి తీసుకు వెళ్లాలనే ప్రయత్నంలో జగన్ ఉన్నారట. పిఠాపురం బరిలో పవన్ బరిలో నిలిచిన వెంటనే.. అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీతను రంగంలోకి దించారు. ప్రస్తుతం వంగా గీత.. కాకినాడ ఎంపీగా ఉన్నారు. గీతను బరిలో దించటం ద్వారా ఎక్కువ ఓటింగ్ ఉన్న కాపుల్లో ఓట్లు చీలుతాయనేది వైసీపీ అధినేత తాజా వ్యూహంగా తెలుస్తోంది.

- Advertisement -

Also Read: అయోమయంలో మంత్రి.. షాకిస్తున్న ఓటర్లు.. !

కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత పిఠాపురంలో నిలవడం ద్వారా పవన్‌పై పోటీ చేసే బలమైన అభ్యర్థిగా జగన్ భావిస్తున్నారట. 2019 ఎన్నికల్లో పెండెం దొరబాబు.  పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న వంగా గీతను వ్యూహాత్మకంగానే పిఠాపురం బరిలో నిలిపారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే సాధారణమైన నేతలతో సాధ్యం కాదని కీలకమైన మహిళా నేత అయిన వంగా గీత వైపే జగన్‌ మొగ్గుచూపడానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. 2024 సార్వత్రిక ఎన్నికలను పవన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతోంది. కాపుల ఐక్యత రాగాన్ని జనసేనాని అందుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా కాపులంతా రాజకీయ చైతన్యంతో ఏకతాటిపైకి రావాలని పదే పదే ప్రకటన చేస్తున్నారు. కాపు ఓట్లు..వైసీపీ వైపు మళ్లకుండా లెక్కలు సిద్ధం చేసుకుంటున్నారు. దానికి తగినట్లే పదునైన ప్రసంగాలతో పిఠాపురం ప్రజలకు ఆకట్టుకుంటున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

2019 ఎన్నికల్లో కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న గాజువాక, భీమవరం బరిలో నిలిచి పవన్‌ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే.. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో సుమారు 90వేల కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు సునాయాసమేనని భావనలో పవన్‌ ఉన్నారు.

Also Read: ఏపీలో ఫించన్ల పంపిణీపై రాజకీయ రగడ.. ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ ఫైర్..

ఈ నేపథ్యంలోనే పవన్‌కు.. వంగా గీత ద్వారా చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం నెలకొన్న సామాజిక సమీకరణాల దృష్ట్యా పిఠాపురం బరిలో వంగా గీత బరిలో నిలిపినా..గెలుపు సునాయాసం కాదని భావిస్తున్న వైసీపీ అధినేత ఆపరేషన్ కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం, చేగొండి సూర్యప్రకాష్ తో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఉన్న బలమైన కాపు సామాజిక వర్గం నేతలను వైసీపీలోకి ఆహ్వానించారు జగన్‌. త్వరలో పిఠాపురం నుంచి మరికొందరు నేతల చేరికలను ఉండేలాగా చూసుకుంటున్నారని టాక్‌.

ఇప్పటికీ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన తాజా మాజీలతో పాటు జనసేన పార్టీలోని నేతలకు వెల్కమ్ చెబుతున్న జగన్.. ఆ బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డికి అప్పగించారు. కాపు సామాజికవర్గంలోని ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు రాబోయే రోజుల్లో ఆ వర్గం ఓటర్లు వైసీపీ వైపే ఉంటారనే అంశాన్ని బలంగా చూపించవచ్చని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు జగన్.. ఆపరేషన్‌ కాపు అంశాన్ని తెరపైకి తెచ్చేరనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ చేస్తున్న బస్సు యాత్ర పిఠాపురం చేరే నాటికి మరికొంతమందిని వైసీపీలోకితెచ్చే ప్రయాత్నాలనూ స్థానిక నేతలు చేస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్‌ కాపు ద్వారా వైసీపీ చేస్తున్న యత్నాలు ఏ మేరకు ఫలితం ఇస్తాయో చూడాలి.

 

..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News