Big Stories

Dharmana says Vote for Babu: అయోమయంలో మంత్రి.. షాకిస్తున్న ఓటర్లు.. !

minister dharmana prasadarao says many people asked vote for babu

- Advertisement -

Dharmana says Vote for Babu(AP political news): వైసీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులు అనగానే గుర్తు కొచ్చే పేర్లలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకరు. ఆయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి చెబుతూనే విపక్షానికి చురకలు వేస్తుంటారు. సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన్ని మాటల మాంత్రికుడిగా ఆ పార్టీ నేతలు చెబుతారు.

- Advertisement -

ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు బయట పెడుతున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ విషయంలో పార్టీ ఏమన్నా ఆయన మాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఆయనకు ఓటర్లకు షాకిస్తున్నారు. ఓటర్ల మాటలకు కన్య్ఫూజన్‌లో పడిపోతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం శ్రీకాకుళం నియోజకవర్గం అంతటా చుట్టేస్తున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌తో కలిసి ఓటర్లతో మమేకం అవుతున్నారాయన.

సోమవారం తన నియోజకవర్గం పరిధిలోని బలగ, తండేంవలస పంచాయితీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. చాలామంది ఓటర్లను పలకరించిన మంత్రి ధర్మాన.. ఏపార్టీకి ఓటేస్తారని అడిగితే చాలామంది బాబుకే వేస్తామని సమాధానం ఇచ్చారు. ఏ బాబు అని మరలా అడిగితే కొందరైతే హస్తం అని, మరికొందరు సైకిల్ అని రకరకాలుగా సమాధానం చెప్పడం చూసి షాకయ్యారు. తన మాటలతో అందర్నీ కన్య్ఫూజన్‌లో పెట్టే మంత్రి ధర్మాన.. చివరకు ఆయనే ఇబ్బందిపడుతున్నారు. ఓటర్ల నుంచి వస్తున్న సమాధానంతో ప్రజలను ఏ పార్టీకి ఓటు వేస్తారని అడగడమే మానేశారట.

ALSO READ: నన్ను కలవడానికి వచ్చి.. సన్న బ్లేడ్‌లతో కట్ చేస్తున్నారు: పవన్ కళ్యాణ్

ప్రజలకు తమ పార్టీ, గుర్తు గురించి అవగాహన కల్పించాలని లేకుంటే ఇలాంటి సమస్యలు ఎదురవు తాయని అంటున్నారట మంత్రి ధర్మాన. ఓటర్లు చెప్పిన మాటలు ఎలాంటి దాపరికాలు లేకుండా ఓపెన్‌గా బయటపెట్టేశారు. ఈ విషయంలో ఎవరు ఏమన్నా ఆయన పట్టించుకోరు. ఏడాది కిందట ఓటర్లతో ఆయన మాట్లాడారు. పథకాలకు అందుతున్నాయా అని మహిళలను అడిగారట. సీఎం జగన్ ఇంట్లో నగదు ఇస్తున్నారా అని కొంతమంది మహిళలు ఆయన్ని ప్రశ్నించాట. ఎవరైనా ఇంట్లోది ఇస్తామంటే వారి ఇంటికి వెళ్తామని వ్యాఖ్యానించారట. పథకాలు తీసుకుని సంస్కారవంతమైన మాటలు రాకపోతే ఎలా అప్పట్లో ఆయన నొచ్చుకున్నారు కూడా. రానున్న రోజుల్లో ఓటర్ల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయోనని ఆలోచనలో పడ్డారట మంత్రి ధర్మాన ప్రసాదరావు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News