BigTV English

Fast foods affects: ఆహారంతో పాటు.. ఇక్కడ అనారోగ్యం కూడా ఫాస్టే

Fast foods affects: ఆహారంతో పాటు.. ఇక్కడ అనారోగ్యం కూడా ఫాస్టే

Fast foods affects on our body with various diseases: మారుతున్న కాలంతో పాటు మనిష జీవన విధానం కూడా మారింది. తినే ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు అలవాటు పడిన యూత్ అయితే ఇంటి వద్దకు వెళ్లి ఫుడ్డు తినే టైమ్ కూడా కేటాయించడం లేదు. అప్పటికప్పుడు రోడ్డుపై నూడుల్స్, ఎగ్,చికెన్ రైస్, పిజ్జాలు, బర్గర్లు, రోటీలు వంటి ఫుడ్డుకు బాగా అలవాటు పడిపోయారు. బ్యాచిలర్సే కాదు ఉద్యోగం చేసే భార్య, భర్త ఇద్దరూ కూడా బయట తినేసే వస్తున్నారు. ఇంటికి రావడం, వండుకోవడం, తోముకోవడం ఇవన్నీ ఎందుకు..ఎంచక్కా కావలసిన ఫుడ్డు రెడీ మేడ్ గా బయటే దొరికేస్తుంటే అంటూ ఫాస్ట్ ఫుడ్డు కల్చర్ కు బాగా అలవాటుపడిపోయారు. ముందు బాగానే ఉంటుంది. క్రమంగా ఫుడ్డు పడక తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు.
హైదరాబాద్ నగరంలో గల్లీకో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తయారవుతున్నాయి. ఎప్పుడు చూసినా అవి కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటాయి.


మొబైల్ వ్యానుల్లోనే అమ్మheaకాలు

వీటి నిర్వాహకులు ప్రత్యేకంగా షాపులు తీసుకోనక్కర్లేదు ఎక్కడికక్కడ మొబైల్ వ్యాన్లు లేదా బండ్లు పెట్టుకుని జనం ఎక్కువగా తిరిగే సెంటర్లలో ఆకర్షణీయంగా బోర్డులు పెడుతుంటారు. చాలా తక్కువ ధరకే ఈ ఫుడ్డు లభించడంతో యువత ఈ తరహా ఫుడ్డుకు అలవాటుపడిపోతున్నారు. బయట స్టార్ హోటల్ లో బిర్యానీ తిందామంటే నాలుగు నుంచి ఐదు వందల బిల్లు అవుతుంది. అదే ఇలాంటి రోడ్డు పక్క బండ్లలో తింటే యాభై నుంచి అరవై రూపాయలలోపే లభిస్తుంది. దీనితో అంత పెద్ద స్టార్ హోటలక్ కి ఎందుకని మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు వీటికి నిత్య వినియోగదారులవుతున్నారు.


సర్వం కల్తీ మయం

వీళ్లకు ఇంత తక్కువ ధర ఎందుకు పడుతోందని ఆలోచించడం లేదు ఎవరూ..హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో కల్తీ నూనె, ఆహార పదార్థాలు చాలా చీఫ్ గా లభ్యమవుతాయి. బయట బహిరంగ మార్కెట్ లో వంద రూపాయలకు లభించే వస్తువు వీళ్లకు ఇరవై ఐదు రూపాయలకే లభిస్తుంది. కల్తీవి కావడంతో నాణ్యత ప్రమాణాలు ఉండవు. వినియోగ వస్తువులు ఆకర్షణీయంగా కనిపించేందుకు కొన్ని కెమికల్స్ కూడా వాడుతుంటారు. అవి చాలా ప్రాణాంతకం. స్వీట్లు, హాట్లు తయారీకి ఈ కెమికల్స్ ని వాడుతుంటారు. హోల్ సేల్ లో చౌకగా లభ్యమయ్యే స్వీట్లను తెచ్చి జనానికి అమ్మేస్తుంటారు. అవి తిని అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆహార పదార్థాలు అమ్మే చుట్టుపక్కల చెత్తాచెదారం,దుర్గంధం వెదజల్లే మురుగు నీరు ఉంటుంది. వాటి పక్కనే పానీ పూరీలు, బజ్జీలు, పునుగులు అంటూ అమ్మేస్తుంటారు. చెత్తాచెదారం పై వాలిన ఈగలు మళ్లీ తినే ఆహారపదార్థాలపై వాలి దుర్గంధాన్ని నేరుగా మన నోటికి చేరుస్తుంటాయి.

ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఎక్కడ?

పేరుకే ఫుడ్ ఇన్ స్పెక్టర్లు..ఎక్కడికక్కడ చెకింగ్ చేసే అధికారి కూడా ఉండడు. ఒక వేళ చెకింగ్ కు వచ్చినా వాళ్లిచ్చే డబ్బులకు ఆశపడి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళిపోతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వానలు పడి నీరు నిల్వవుండి రోజుల తరబడి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లే ప్రాంతాలు సిటీలో ఎక్కడికక్కడ కనిపిస్తుంటాయి. అనారోగ్యాన్ని మనమే కొనుక్కుంటున్నాం. తల్లిదండ్రులు కూడా ఇంటి వద్దే హోం ఫుడ్డు తినాలని తమ పిల్లలకు వీటిపై అవగాహన కల్పించాలి. కరోనా తర్వాత కొన్నాళ్లు జనం బయట ఫుడ్డుకు దూరంగానే ఉన్నారు. మళ్లీ కరోనాను మర్చిపోయి ఈ తరహా ఫుడ్డును ప్రోత్సహిస్తున్నారు. ఇకనైనా బయట ఫుడ్డుకు దూరంగా ఉందాం..ఇంటి ఫుడ్డునే ఆస్వాదిద్దాం.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×