Big Stories

PM Modi Political Strategy : ఇది శాంపిలే.. అసలు సినిమా ముందుంది!

- Advertisement -

PM Modi Political Strategy: ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా.. ఇది మూవీ డైలాగ్‌ కాదు. ప్రధాని నరేంద్ర మోడీ తమ పాలన చెబుతున్న మాట.. ఇప్పటి వరకు ప్రజలు చూసిన తమ పదేళ్ల పాలన ఒక ట్రైలర్ మాత్రమే అని.. ఇక రాబోయే రోజుల్లో తమ అసలు సిసలైన పాలనేంటో చూస్తారని చెబుతున్నారు.. అంతేకాదు నెక్ట్స్‌ గవర్నమెంట్‌లో వచ్చే వంద రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.. ఇంతకీ మోడీ మాటల వెనక ఆంతర్యమేంటి? ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ స్ట్రాటజీ ఏంటి? మోడీ తీసుకోబోయే ఆ నిర్ణయాలేంటి?  నరేంద్ర మోడీ.. బీజేపీ రూలింగ్‌కు ఫ్రంట్ ఫేస్.. ఈసారి ఎలక్షన్స్‌లో కూడా అదే ఫేస్‌తో పోల్‌ఫైట్‌కు వెళుతోంది బీజేపీ.. దీనికి తగ్గట్టుగానే ఆయన కూడా దూసుకుపోతున్నారు.

- Advertisement -

అయితే ఈ మధ్య ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. వేస్తున్న అడుగులు.. ఇప్పుడు సంచలనాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. విపక్షాలపై విమర్శలు చేస్తూనే.. భవిష్యత్తుపై ఆశలు పుట్టిస్తున్నారు మోడీ. దీనికి అనేక వ్యూహాలను పన్నుతున్నారు. సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. మోడీ వ్యూహాలు ఎలా ఉంటాయనే దానికి లెటెస్ట్ ఎగ్జాంపుల్ కచ్చతీపు ఐలాండ్.. ఈ ఐలాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.. ఈ ఐలాండ్‌ను 1974లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంకకు అప్పగించారు.. సరిగ్గా ఎన్నికల ముందు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు మోడీ.. దక్షిణ భారతంలోని ఓ రాష్ట్రానికి మూలన విసిరేసినట్టు ఉండే అతి చిన్న దీవి ఇది.

Also Read:పవన్ లో మార్పు.. ప్రచారంలో కొత్త అస్త్రం! 

ఇప్పుడు ఎన్నికల ప్రధాన అంశంగా మారింది. దీని గురించి ఆయన దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలోనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మోడీ మాట్లాడేంత వరకు ఈ వివాదం గురించి తెలియని వారే ఎక్కువ.. నిజనిజాలు ఏంటి? అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు ఉదయించడానికి ముందే.. కాంగ్రెస్‌ దేశ ప్రయోజనాలను మరించింది అన్న అంశమే జనాల్లోకి వెళుతుంది. ఇందులో మోడీ సక్సెస్ కూడా అయ్యారనే చెప్పాలి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే.. కొంచెం పాస్ట్‌కు వెళదాం. బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉందన్నారు.

అదే నిజమైతే మరి ఇతర పార్టీలను పొత్తులకు ఆహ్వానించడం ఎందుకు? ఈ క్వశ్చన్‌కి దిమ్మ తిరిగే ఆన్సర్‌ చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు.. ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టడం లాంటిదంటున్నారు. ముందుగా ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. మోడీ టార్గెట్ ఇండియా కూటమిని దెబ్బతీయడం.. అది సక్సెస్‌ఫుల్‌గా చేశారు.. ఇందులో కూటమిలోని నేతల స్వయంక్రుతాపరాధం కొంతైతే.. బీజేపీ వ్యూహాలు చేసింది మరికొంత.. ఇండియా కూటమిలోని నేతలను సక్సెస్‌ఫుల్‌గా బయటికి లాగారు.. కూటమిలో కీలకంగా వ్యవహరించిన జేడీయూ నేత నితీష్‌కుమార్‌ బయటికి వచ్చారు.. మోడీతోనే ఇక నా ప్రయాణమని ప్రకటించారు. ఇక నవీన్‌ పట్నాయక్‌ ఇండియా కూటమికి దరి చేరకుండా అడ్డుకున్నారు.

ఇక అంతర్గత కుమ్ములాటల కారణంగా మమతా బెనర్జీ సొంతంగా అభ్యర్తులను ప్రకటించేశారు. అఖిలేష్‌ యాదవ్.. కాంప్రమైజ్‌ అయినా పెద్దగా వర్కౌట్ అయ్యే చాన్స్ కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడుని అవసరం లేకపోయినా ఎన్డీఏలోకి చేర్చుకొని ఇండియా కూటమి వైపు చూడకుండా చేశారు. మహారాష్ట్రలో స్ట్రాంగ్‌గా ఉన్న శివసేన, ఎన్సీపీలను సక్సెస్‌ఫుల్‌గా దెబ్బతీశారు. ఇలా అవసరం ఉన్నా.. లేకపోయినా.. ఎన్డీలోకి ప్రాంతీయ పార్టీలను చేర్చుకొని విపక్షాన్ని వీక్ చేశారు. ఇక సెకండ్ పాయింట్.. ఇది చాలా ఇంపార్టెంట్‌.. ఇది అర్థం కావాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి. తమ థర్డ్ టర్మ్‌లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామని ఓపెన్‌గా చెబుతున్నారు మోడీ.

Also Read: గొట్టిపాటికి గట్టి పోటీ? అద్దంకి..ఎవరికి?

ఫర్ ఎగ్జాంపుల్ ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. లాంటివి. దీనితో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో.. ఇలాంటి నిర్ణయాలు చట్టాలుగా మారాలంటే పార్లమెంట్ ఆమోదం అవసరం.. కొన్ని రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదాలు అవసరమవుతాయి. ఇది సాధ్యం కావాలంటే మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండాలి.. కానీ అది సాధ్యమయ్యే పని కాదు.. అందుకే నెక్ట్స్‌ అధికారంలోకి వస్తాయనుకున్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు.. ఫ్యూచర్‌లో ఎన్డీఏలో ఉన్న కారణంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లులుగా ఈజీగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది.. అందుకే ఎన్డీఏలోకి అవసరం ఉన్నా.. లేకున్నా.. ఎన్డీఏలోకి పార్టీలను ఆహ్వానిస్తుంది బీజేపీ.

సామదానభేద దండోపాయాలను ఉపయోగిస్తున్నారు మోడీ.. కొన్ని రాష్ట్రాలపై ప్రస్తుతం స్పెషల్ ఫోకస్‌ పెట్టారు మోడీ.. ఈ లిస్ట్‌లో తమిళనాడు మెయిన్‌గా కనిపిస్తోంది.. బీజేపీ టార్గెట్‌ అధికారంకాకపోయినా.. తమిళనాడులో ఓ స్ట్రాంగ్ బేస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీని కోసం తమిళ ప్రజల మనసులు గెలుచుకునేందుకు ట్రై చేస్తున్నారు. గుజరాతీ వంటకాలను ఇష్టపడే మోడీ.. నాకు తమిళ వంటకాల్లో ఉప్మా ఇష్టమంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా స్ట్రాటజిక్ మూవ్‌ అనడంలో ఎలాంటి డౌట్ లేదు.. ప్రాచీన భాష తమిళమే అని సర్టిఫికేట్ ఇస్తున్నారు.. ఇడ్లీ, దోశ గురించి మాట్లాడుతున్నారు.. భాషను రాజకీయాల్లోకి లాగడం కూడా సరికాదంటున్నారు.

Also Read: వాలంటీర్ల రాజీనామా.. ప్రభావమెంత?

అంతేకాదు. శ్రీలంక అదుపులో ఉన్న తమిళ జాలర్ల గురించి మాట్లాడుతున్నారు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌ను అన్నామలైని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇలా మోడీ ప్రతీ మూవ్ ఓ వ్యూహం ప్రకారం జరుగుతోంది. ఇవే కాదు అయోధ్య ఆలయ నిర్మాణం. తమ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రొగ్రెస్ కార్డ్.. ప్రపంచ దేశాల్లో భారత్‌కు పెరిగిన ప్రాధాన్యం.. వీటన్నింటిని గమనించమంటున్నారు మోడీ.. అందుకే వికసిత్ భారత్ అనే నినాదాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. అయితే నార్త్ ఇండియాలో బీజేపీకి అనుకూలంగా గాలి వీస్తున్నా.. సౌత్ ఇండియాకు వచ్చేసరికి మాత్రమే కాస్త పరిస్థితులు అనుకూలించడం లేదు.

అందుకే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.. అయితే సౌత్‌లో ఏ స్టేట్‌లో ఏ స్ట్రాటజీ ఉపయోగించినా.. బీజేపీ అనుకున్నంత సులువుగా అయితే పరిస్థితులు లేవు.. లాంగ్వేజ్, కల్చర్, ప్రాంతీయత, చారిత్రక రాజకీయ అనుబంధాలు.. బీజేపీకి అడ్డుగోడలుగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఒవరాల్‌గా చూస్తే మోడీ చెబుతున్న ట్రైలర్ ఎంత మందికి నచ్చింది? సినిమా చూసేందుకు ఎంత మంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు? మోడీ తర్వాతి టర్మ్‌లో చూపించే అద్భుతాలను చూసేందుకు సిద్ధంగా ఉన్నారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News